పెళ్లి వ్యాను బోల్తా : 20 మందికి గాయాలు | Wedding van accident in warangal district, 20 injured | Sakshi
Sakshi News home page

పెళ్లి వ్యాను బోల్తా : 20 మందికి గాయాలు

Published Fri, Feb 13 2015 8:50 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Wedding van accident in warangal district, 20 injured

వరంగల్ :వరంగల్ జిల్లాలో ఓ పెళ్లి వ్యాన్ బోల్తాపడిన ఘటనలో 20మంది గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  చెన్నారావుపేట మండలం అమీనాబాద్ సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.  వర్ధన్నపేట మండలం డీసీ తండా నుంచి నర్సంపేట మండలం ఐనపురంలో జరిగే పెళ్లికి డీసీఎం వ్యాన్‌లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

 

క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మోతిలాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement