ameenabad
-
చికిత్సపొందుతున్న వివాహిత మృతి
అమీనాబాద్(కోదాడరూరల్): కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వివాహిత మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన మీసాల నాగమణి (30)కి కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా లేదు. దీంతో పాటు ఇటీవల ఆమె అనారోగ్యం పాలయింది. దీంతో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమణించిన ఆమె భర్త శ్రీను, తమ్ముడు రవి మంటలు ఆర్పే క్రమంలో స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన ఆమెను ఖమ్మం వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. మృతురాలి తమ్ముడు కిన్నెర రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ప్రకాశ్ తెలిపారు. -
వివాహేతర సంబంధం నెపంతో వ్యక్తి హత్య!
నల్గొండ(కోదాడ): కోదాడ మండలం అమీనాబాద్ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మర్మాంగాల మీద బలంగా కొట్టడం వల్ల చనిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి వ్యాను బోల్తా : 20 మందికి గాయాలు
-
పెళ్లి వ్యాను బోల్తా : 20 మందికి గాయాలు
వరంగల్ :వరంగల్ జిల్లాలో ఓ పెళ్లి వ్యాన్ బోల్తాపడిన ఘటనలో 20మంది గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం డీసీ తండా నుంచి నర్సంపేట మండలం ఐనపురంలో జరిగే పెళ్లికి డీసీఎం వ్యాన్లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మోతిలాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.