వివాహితపై లైంగిక దాడికి యత్నం
గంట్యాడ: మండలంలోని డికెపర్తి పంచాయతీ అడ్డతీగలో ఓ వివాహిత(30)పై అదేగ్రామానికి చెందిన రౌతు అంజిబాబు అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించినట్లు బాధితురాలు సోమవారం గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు గంట్యాడ ఎస్సై షేక్షరీప్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతనెల 25వతేదీన బాధితురాలి భర్త జామి ఎల్లమాంబ పండగకు వెళ్లాడని అదేరోజు రాత్రి 9గంటల సమయంలో కొడుకు వరస అయిన అంజిబాబు తనపై లైంగికదాడికి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భయంతో కేకలు పెట్టగా జనం వచ్చేసరికి పరారయ్యాడని తెలిపింది.