రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎన్ కౌంటర్ లో కొందరు స్మగ్లర్లు తప్పించుకున్న నేపధ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఎర్రచందనంతో పాటు ముగ్గురు తమిళకూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.