ఆత్మరక్షణకు యూట్యూబ్ క్లాసులు
నిర్భయ ఘటన తర్వాత మహిళల ఆత్మరక్షణకు సంబంధించి బోలెడు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆత్మరక్షణ తరగతుల పేరుతో పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రత్యేక శిక్షణలు ఇవ్వడం కూడా ఎక్కువయ్యాయి. గడచిన ఏడాదిలో విద్యార్థినులకు మార్షల్ఆర్ట్స్ నేర్పే విద్యాలయాల సంఖ్య బాగా పెరిగింది. పాఠశాలలు, కళాశాలలతో పాటు కొన్ని ప్రయివేటు కంపెనీల్లో కూడా మహిళలకు ఆత్మరక్షణ బోధనలు చేయడం మొదలుపెట్టారు. అయితే అందరికీ అలా నేర్చుకోవడం కుదరదు కదా! అలాంటివారు యూట్యూబ్ ద్వారా టిప్స్ తెలుసుకుంటున్నారు. 2013లో అతిఎక్కువగా చూసిన యూట్యూబ్ వీడియోల జాబితాలో సెల్ఫ్డిఫెన్స్ వీడియోలే ముందు వరుసలో ఉన్నాయి.
గడచిన ఏడాదిలో మన దేశంలో అమ్మాయిలపై జరిగిన లైంగికదాడులే కారణం. చేతిలో పెప్పర్ స్ప్రే, బ్యాగులో కారం పొట్లం మాత్రమే మహిళల్ని రక్షించలేవు. దుండగుల చేతుల నుంచి విడిపించుకుని తమను తాము రక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ కావాలి. కొన్ని ముఖ్యమైన ఫైట్ టెక్నిక్స్ కూడా తెలియాలి. వాటిని యూట్యూబ్ ద్వారా తెలుసుకునే మహిళల సంఖ్య పెరగడం మంచి పరిణామమే.