Mary Matha festival at Gunadala
-
గుణదల మేరీ మాత ఉత్సవాలు
గుణదల(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రికుల కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, రైల్వే అధికారులు గుణదల, రామవరప్పాడు స్టేషన్లలో పలు రైళ్లు నిలిచేందుకు అనుమతి ఇచ్చారు. పలు రైళ్లకు గుణదల, రామవరప్పాడు స్టేషన్లలో హాల్టింగ్ గుణదల మేరీ మాత ఉత్సవాల సందర్భంగా.. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగే మేరీ మాత ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం పలు రైళ్లకు గుణదల, రామవరప్పాడు స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు. గుణదల స్టేషన్లో నిలిచే రైళ్లు.. ► రైలు నంబర్ 17289 తిరుపతి–కాకినాడ టౌన్ ►రైలు నంబర్ 17250 కాకినాడ టౌన్–తిరుపతి ►రైలు నంబర్17257 విజయవాడ–కాకినాడ పోర్టు ►రైలు నంబర్ 17258 కాకినాడ పోర్టు–విజయవాడ ►రైలు నంబర్ 07768 విజయవాడ–రాజమండ్రి ►రైలు నంబర్ 07767 రాజమండ్రి–విజయవాడ రామవరప్పాడు స్టేషన్లో నిలిచే రైళ్లు.. ►రైలు నంబర్ 07867 మచిలీపట్నం–విజయవాడ ►రైలు నంబర్ 07861 విజయవాడ–మచిలీపట్నం. -
మరియమాత స్మరణలో గుణదల కొండ
గుణదల (విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో రెండు రోజులుగా జరుగుతున్న మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజైన బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. లక్షలాదిగా వచ్చిన యాత్రికులు మరియమాత దర్శనం కోసం బారులు తీరారు. మరియమ్మ నామ స్మరణతో గుణదల కొండ మార్మోగింది. భక్తులు కొండ పైన కొలువుదీరిన మరియతల్లిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కొండ దిగువన ఉన్న బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో డయాసిస్ గురువులు సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నెల్లూరు కథోలిక పీఠం బిషప్ మోస్ట్ రెవ.మోజెస్ దొరబోయిన ప్రకాశం మాట్లాడుతూ.. లోకమాతగా నీరాజనాలందుకుంటున్న మరియమాతను ఆశ్రయించి ఆమె దీవెనలు పొందాలని కోరారు. అనంతరం సమష్టి దివ్యబలిపూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. విజయవాడ డయాసిస్ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన దివ్యబలి పూజలో విశాఖపట్నం బిషప్ మల్లవరపు ప్రకాష్ హాజరై దేవుని వాక్య సందేశం అందించారు. -
జనసంద్రమైన గుణదల పుణ్యక్షేత్రం