Masakadza
-
జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం రాత్రి బిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా క్యాపిటల్స్ 78 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు భారీ స్కోరు చేసింది. జింబాబ్వే ఆటగాడు సొలొమన్ మైర్ (38 బంతుల్లో 82 పరుగులు, 7 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. మరో జింబాబ్వే బ్యాటర్ మసకద్జా 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ దినేశ్ రామ్‌దిన్ 20 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బిల్వారా కింగ్స్ బౌలర్లలో యూసఫ్ పఠాన్ మూడు వికెట్లు తీయగా.. బెస్ట్, టిమ్ బ్రెస్నన్ చెరొక వికెట్ తీశారు. అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ 19.2 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. తన్మయ్ శ్రీవాత్సవ 27 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. నమన్ ఓజా 20 పరుగులు చేశాడు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో బిల్వారా కింగ్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో రజత్ బాటియా, ప్రవీణ్ తాంబే, పంకజ్ సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. -
ఆల్‌టైమ్ టీ20 రికార్డు బ్రేక్
చిట్టగాంగ్: టి20ల్లో అఫ్గానిస్తాన్ 12 వరుస విజయాల ఆల్ టైమ్ రికార్డు జింబాబ్వే తెరదించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్లతో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్బాజ్ (47 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హజ్రతుల్లా జజాయ్ (31) అద్భుత ఆరంభాన్నిచ్చినా మిగతావారు విఫలమవడంతో అఫ్గాన్ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, పేసర్ ఎంపొఫు (4/30) ప్రత్యర్ధిని దెబ్బకొట్టాడు. కెప్టెన్ మసకద్జ (42 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో జింబాబ్వే 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 156 పరుగులు చేసి గెలిచింది. తన కెరీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో మసకద్జ చెలరేగడం విశేషం. దాంతో పాటు జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించి తన వీడ్కోలుకు ఘనమైన ముగింపు పలికాడు. -
బంగ్లాదేశ్ లక్ష్యం 321
ఢాకా: స్పిన్నర్లు తైజుల్ ఇస్లాం (5/62), మెహదీ హసన్ మిరాజ్ (3/48) విజృంభించడంతో... జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. 139 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. తైజుల్, మెహదీ ధాటికి 181 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మసకద్జా (48; 7 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 321 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు లిటన్ దాస్ (14 బ్యాటింగ్), ఇమ్రుల్ కైస్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఫలితం రావడం ఖాయమైంది.