![Zimbabwes Hamilton Masakadza breaks All Time T20I Record - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/21/Masakadda.jpg.webp?itok=IFyVfVwO)
చివరి మ్యాచ్ ఆడేసిన మసకద్జకు ఘనమైన వీడ్కోలు
చిట్టగాంగ్: టి20ల్లో అఫ్గానిస్తాన్ 12 వరుస విజయాల ఆల్ టైమ్ రికార్డు జింబాబ్వే తెరదించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్లతో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్బాజ్ (47 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హజ్రతుల్లా జజాయ్ (31) అద్భుత ఆరంభాన్నిచ్చినా మిగతావారు విఫలమవడంతో అఫ్గాన్ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, పేసర్ ఎంపొఫు (4/30) ప్రత్యర్ధిని దెబ్బకొట్టాడు. కెప్టెన్ మసకద్జ (42 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో జింబాబ్వే 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 156 పరుగులు చేసి గెలిచింది. తన కెరీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో మసకద్జ చెలరేగడం విశేషం. దాంతో పాటు జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించి తన వీడ్కోలుకు ఘనమైన ముగింపు పలికాడు.
Comments
Please login to add a commentAdd a comment