masjeed
-
మసీదులో మౌజన్ దారుణ హత్య
రాజమహేంద్రవరం రూరల్: మసీదులో నిద్రిస్తున్న మౌజన్ హత్యకు గురవడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉద్రిక్త త నెలకొంది. బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఫారూఖ్ (61) మూడు నెలల క్రితం రాజమహేంద్రవరం లాలాచెరువులోని నూరానీ మసీదులో మౌజన్ (చిన్నగురువు)గా చేరి అక్కడే ఉంటున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఇమామ్ అబ్దుల్ హసీఫ్ గేటు తీసి లోపలికి వెళ్లి చూడగా ఫారూఖ్ తలపై బలమైన గాయాలతో మృతిచెంది కనిపించాడు. అక్కడ ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ కాల్చివేసి ఉండటంతో పాటు ప్రార్థనాస్థలం అగ్నికి ఆహుతై ఉన్నాయి. ఇమామ్ మసీదు కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మసీదుల అభివృద్ధికి చెక్కుల పంపిణీ
చిలుకూరు: మండలంలోని నారాయణపురం, సీతరాంపురం, రామాపురం, కొండాపురం, జెర్రిపోతులగూడెం, బేతవోలులో రెండు మసీదులకు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి∙ఒక్కోక్క మసీదుకు మంజూరైన రూ. 15 వేలను ముస్లీం పెద్దలకు బుధవారం ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్‌లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లీలంకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కొల్లు దామోదర్‌రావు, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, విఆర్వో నభి తదితరులు పాల్గొన్నారు.