Mass Leader
-
YS Jagan: జనానికి ఎందుకంత ఎమోషన్?
జనం ఇబ్బందుల్లో ఉంటే.. వాళ్ల దగ్గరికి వెళ్లాలి. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకోవాలి. తమ బాధ్యతగా ప్రభుత్వాల్ని నిలదీయాలి. అవసరమైతే ‘నేనున్నాను..’ అంటూ బాధితుల్ని ఓదార్చాలి. అంతేగానీ తాను వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయని తప్పించుకునేవాడు అసలు నాయకుడేనా?.అధికారంతో ఆయనకు సంబంధం లేదు. అది ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా నటించడం ఆయనకు చేత కాదు. గత ఐదేళ్లు. పేదల ముఖాల్లో సంతోషం అనే వెలుగులు పూయించేందుకు ప్రతీ క్షణం పాటుపడ్డారు. సంక్షేమంతో అన్ని వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. సమస్య ఎక్కడున్నా సత్వర పరిష్కారం కోసమే ఆయన తాపత్రయం కనిపిస్తుంది. అందుకేనేమో..జగనన్న ఎక్కడికెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటుంది. పండు ముసలి నుంచి ఊహతెలిసిన పిల్లాడి దాకా.. ఆయన ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఆయన్ని దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని.. తమ ఫోన్లలో క్లిక్‌మనిపించాలని ఆరాటపడుతుంటారు. ఆ అభిమానాన్ని అంతే ఒద్దికగా ఆయన స్వీకరిస్తుంటారు. ఓల్డ్ ఆర్ఆర్ పేట వరద బాధితుల్ని కలవడానికి వెళ్లినప్పుడు తనను చూసి భావోద్వేగానికి గురైన ఓ చిన్నారి కన్నీళ్లను తుడుస్తూ కనిపించారాయన.రాజకీయాల్లో అవసరాలకు తగట్లు మసులు కోవడం జగన్ స్టైల్ కానే కాదు. జనాలకు దూరంగా ఉండడం.. ఫొటోలకు ఫోజులిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నామని బిల్డప్‌లు ఇవ్వడం.. ఆయన చేయరు. కులాల ప్రస్తావన తెచ్చి మరీ జనాలను కించపరిచేలా ఆయన ఏనాడూ మాట్లాడరు. ఎప్పటికీ ఆయన జనం మనిషి.. పేదల పక్షపాతి. అందుకే.. ఆయన వస్తున్నారంటేనే జనం ఆటోమేటిక్‌గా తరలివస్తారు. అది ఎలాంటి సందర్భం అయినా సరే!. తమ బాగుకోసం అంతలా ఆయన ఆలోచిస్తారని జనం గుర్తించారు కాబట్టే ఆ అభిమానం. అందుకే ఆ అభిమానాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేని ఆయన కూడా వాళ్లను దగ్గరకు తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. రాజన్న బిడ్డగా.. అంతకు మించి జనం మెచ్చిన జననేతగా జగన్కంటూ ఓ గుర్తింపు ఉంది. ఇది ఎవరైనా అంగీకరించాల్సిన విషయం.ఇట్లు.. ఓ జగన్ అభిమాని -
‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’ అన్నట్లుగా ఎన్నికల ఫలితాల్లో పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరు కనిపించింది. జిల్లాలో తిరుగులేని మాస్ లీడర్‌గా ఉన్న ఆయన మరోసారి తన చరిష్మా చూపించారు. బీఆర్ఎస్పై తిరుగుబాటుతో.. వైఎస్సార్ సీపీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అక్కడ సరైన ప్రాధాన్యత లభించక ఈ ఏడాది ఆరంభంలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ ఆయన విసిరిన సవాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ను వీడిన తర్వాత పొంగులేటి రాజకీయ ప్రస్థానం ఏ దిశగా వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యాన బీజేపీలోకి వెళ్లాలని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ రాజకీయంగా ఓసారి దెబ్బతిన్న ఆయన తొందరపాటు నిర్ణయాలకు పోకుండా ఆచితూచి అన్ని అంశాలు బేరీజు వేసుకుని కాంగ్రెస్‌లో చేరారు. తగ్గేదే లే... కాంగ్రెస్‌లో చేరే సమయంలో పదింట ఎనిమిది సీట్లు పొంగులేటి వర్గీయులకే ఇస్తారనే ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. కమ్యూనిస్టుల కోసం కొత్తగూడెం సీటు వదులుకోవాల్సి వచ్చింది. పాలేరు, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట సీట్లు పొంగులేటి వర్గానికి దక్కాయి. గత అనుభవాలు నేర్పిన పాఠంతో ఓర్పుగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. ఓవైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే తన అనుయాయుల గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థుల గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు పొంగులేటి ఎంట్రీ ఇచ్చేవరకు కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆశించిన స్థాయిలో సఖ్యత కనిపించలేదు. ఒక్కసారి శ్రీనివాసరెడ్డి రాకతో పరిస్థితి మారిపోయింది. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారు. క్రాస్ ఓటింగ్‌కు అవకాశమే లేకుండా జాగ్రత్త పడ్డారు. వెరసి నాలుగు స్థానాల్లో విజయఢంకా మోగించడమే కాదు మెజార్టీలోనూ దుమ్ము రేపారు. -
మాస్ లీడర్ టూ మేయర్
సింగ్ఈజ్ కింగ్ - సౌత్ ఇండియాలో ఏకైక సిక్కు మేయర్ కరీంనగర్ : మాస్ లీడర్ నుంచి నగర అత్యున్నత పదవి మేయర్‌గా ఎన్నికై సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకున్నారు సర్దార్ రవీందర్‌సింగ్. టీఆర్ఎస్ ఒడిదొడుకుల ప్రస్థానంలో నగరంలో ఆ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు ఆయన. తెలంగాణవాదం లేదు... గిలంగాణవాదం లేదు అని 2006లో మంత్రి ఎమ్మెస్సార్ చేసిన సవాల్‌ను స్వీకరించి ఉప ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నగరంలో అండదండగా నిలిచింది సర్దార్జీనే. 2006లో బీజేపీ పట్టణాధ్యక్ష పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న రవీందర్‌సింగ్... తన ఎనిమిదేళ్ల ప్రస్థానంలో పార్టీ బలోపేతంతోపాటు తెలంగాణ ఉద్యమాన్ని భుజానవేసుకుని అన్నివర్గాల ప్రజలను మమేకం చేశారు. మాస్‌లీడర్‌గా గుర్తింపుపొందిన సింగ్ పేరును ఉటంకిస్తూ కేసీఆర్ అనేక బహిరంగసభల్లో మాట్లాడడం ఎప్పటికైనా ఆయనకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందని అందరూ ఊహించారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సర్దార్జీ ఇప్పుడు మేయర్‌గా అరుదైన గౌరవమే దక్కించుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే సిక్కు సామాజికవర్గానికి మేయర్ పదవి వరించడం ఇదే మొదటిసారి. రవీందర్‌సింగ్ ఇప్పటికే రెండుసార్లు కౌన్సిలర్, ఓసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ఇప్పుడు మరోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించి ఏకంగా మేయర్ పదవి దక్కించుకున్నారు. రాజకీయ ప్రస్థానం 1964 ఆగస్టు 6న దన్నాభాయ్-లక్ష్మణ్సింగ్లకు జన్మించిన రవీందర్‌సింగ్ ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు కరీంనగర్‌లోనే సాగింది. ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో 1984లో కాలేజీ ప్రెసిడెంట్‌గా ఎన్నికై రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. 1987లో నాందేడ్‌లో న్యాయవిద్య పూర్తి చేసుకున్నారు. న్యాయవాదిగా ఉంటూనే 1995లో మొదటిసారిగా కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2006 వరకు బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగారు. 2000, 2005లో రెండుసార్లు బీజేపీ నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 2006లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2008లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అత్యధిక మెజార్టీతో ఎన్నికై కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ సమావేశ మందిరం, క్యాంటీన్ నిర్మాణం చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. 2010లో టీఆర్ఎస్ నగర అధ్యక్షునిగా నియామకమయ్యారు. 50 సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా ఉండడమే కాక ఆర్టీసీ టీఎంయూ కార్మిక సంఘం గౌరవాధ్యక్షునిగా, ట్రేడ్ యూనియన్ల గౌరవ సలహాదారుడిగా ఉన్నారు.