Massive irregularities
-
టీడీపీ నేత.. ఎరువుల మేత!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులకు చెందాల్సిన ఎరువులు, పురుగు మందులను టీడీపీ నేతలు అప్పనంగా కాజేశారు. రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు సరఫరా చేసిన ఎరువులు, పురుగు మందుల సొమ్మును టీడీపీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్ స్వాహా చేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.38.79 లక్షలు నొక్కేశారు. పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో ఈ బాగోతం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారం వెలగబెడుతున్న సమయంలో 2016 నుంచి 2018 మధ్యలో ఎరువులు, పురుగు మందుల విక్రయం ద్వారా వచ్చిన నిధులను మింగేశారు. అక్రమాలకు పాల్పడింది అప్పటి కారంచేడు పీఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య కాగా అందుకు పూర్తిగా సహకారం అందించింది మాత్రం సీఈవో గంటా మల్లయ్య చౌదరి. ఆడిట్లో బయటపడ్డ బండారం జిల్లా సహకార శాఖ అధికారులు ఏటా పీఏసీఎస్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ జమానాలో సహకార శాఖ అధికారులు పీఏసీఎస్ ఆడిట్ చేయడానికి కూడా భయపడ్డారు. కారంచేడు పీఏసీఎస్ మీద తీవ్రమైన ఆరోపణలు రావడంతో చివరకు మూడేళ్లకు సంబంధించి 2018లో సహకార శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించారు. అంటే 2015–16, 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి ఏకకాలంలో ఆడిట్ నిర్వహించారు. దీంతో అప్పటి వరకు జరిగిన అక్రమాలు కొంతమేర బయటపడ్డాయి. ఆడిట్ రిపోర్టును అప్పటి అధికారులు జిల్లా సహకార శాఖ అధికారులకు సమర్పించారు. చర్యలు తీసుకోవడంలో అధికారుల మీనమేషాలు రైతులకు సరఫరా చేసేందుకు పీఏసీఎస్‌లకు ఎరువులు, పురుగు మందుల కొనుగోలు కోసం జిల్లా పీడీసీసీ బ్యాంకు రుణం రూపంలో నిధులు కేటాయిస్తుంది. అయితే కారంచేడు పీఏసీఎస్‌లో చైర్మన్‌తోపాటు సీఈవో కలిసి రూ.38,79,001.63 స్వాహా చేశారు. అప్పటి నుంచి పీఏసీఎస్ తీసుకున్న నిధులు బ్యాంకుకు తిరిగి జమ కాలేదు. బ్యాంకు సీఈఓ సొసైటీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే జిల్లా సహకార శాఖ అధికారులు మాత్రం కాజేసిన సొమ్మును తిరిగి వసూలు చేయడంలో మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది. ఇంత వరకు వారిద్దరిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అంతుపట్టని అంశంగా మారింది. విచారణతో వెలుగులోకి.. ఆడిట్ రిపోర్టు ఆధారంగా అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి కారంచేడు పీఏసీఎస్‌లో నిధుల స్వాహా విషయమై డిప్యూటీ రిజిస్ట్రార్ ఎల్.సుధాకర్‌ను విచారణాధికారిగా నియమించారు. విచారణ 2019లో చేపట్టారు. అయితే ఆడిట్ రిపోర్టులో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు విక్రయించి తద్వారా వచ్చిన నిధులను కాజేశారని తేలింది. మందులు అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము రూ.28,35,957ను పీఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య, సొసైటీ సీఈవో గంటా మల్లయ్య చౌదరి కలిసి కాజేశారని స్పష్టమైంది. దీంతోపాటు చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య ఒక్కడే రూ.10,43,044.63 కాజేశారని విచారణలో బయటపడింది. మొత్తం రూ.38,79,001.63 సొమ్మును కాజేశారని విచారణాధికారి జిల్లా సహకార శాఖ అధికారికి 2019 జనవరిలోనే నివేదిక అందించారు. రికవరీకి నోటీసులిచ్చాం కారంచేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నిధుల గోల్‌మాల్‌పై సొసైటీ అప్పటి చైర్మన్‌కు, సీఈవోకు నోటీసులిచ్చాం. సహకార చట్టం సెక్షన్ 52 కింద నోటీసులు జారీ చేశాం. 2020 మార్చి 7వ తేదీన నోటీసులు వారికి అందాయి. వారు కాజేసిన సొమ్మును 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నాం. అయితే ఆ తర్వాత కోవిడ్ నిబంధనలు వెలువడటంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉన్నతాధికారులు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి సారించారు. – ఎల్.సుధాకర్, డిప్యూటీ రిజిస్ట్రార్, సహకార శాఖ చదవండి: కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు విషాదం: అమ్మకు తోడుగా వచ్చి.. -
ట్రంప్ మద్దతుదారుల హింసాకాండ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వేలాది మంది ఆయన మద్దతుదారులు, అభిమానులు వీధుల్లోకి వచ్చారు. వాషింగ్టన్ శివార్లలో మిలియన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) మార్చ్ పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అధ్యక్షుడిగా మళ్లీ ట్రంప్ గెలిచినట్లు ప్రకటించాలని నినాదాలు చేశారు. మరో నాలుగేళ్లు ట్రంప్, ఎన్నికల దొంగతనం ఆపండి అంటూ నినదించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. జో బైడెన్ వర్గీయులపై హింసాకాండకు పాల్పడ్డారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన ఓటమిని ట్రంప్ ఇంకా అంగీకరించడం లేదు. శనివారం ట్రంప్ మద్దతుదారులు ఫ్రీడం ప్లాజా నుంచి నిరసన ర్యాలీ ప్రారంభించారు. రాత్రి దాకా శాంతియుతంగానే ఉన్నప్పటికీ తర్వాత సహనం కోల్పోయారు. బైడెన్ మద్దతుదారులతో ఘర్షణకు దిగారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు కొంత దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ట్రంప్ అభిమానుల దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నల్లజాతి ప్రజల హక్కుల ఉద్యమ కార్యకర్త అయిన అతడిని వెనుకనుంచి కత్తితో పొడిచారు. అధికారులు యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ అభిమానుల దాడిలో మరో ఇద్దరు పోలీసు అధికారులు సైతం గాయపడ్డారు. ట్రంప్, బైడెన్ మద్దతుదారులు కొన్ని నిమిషాలపాటు ఒకరినొకరు కొట్టుకున్నారు. ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైడెన్ అభిమానులు సైతం ట్రంప్ మద్దతుదారులపై కోడిగుడ్లు విసిరినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ట్రంప్‌నకు సంబంధించిన ప్రచార సామగ్రిని వారు దహనం చేసినట్లు తెలిపింది. ట్రంప్, బైడెన్ వర్గీయుల ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసినట్లు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీసు విభాగం వెల్లడించింది. తనకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలను మీడియా తొక్కిపెడుతోందని, ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వడం లేదని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఓటమిని ఒప్పుకున్న ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా ఇన్నాళ్లూ మొండిగా వ్యవహరించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కాస్త దిగొచ్చారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచారని చెప్పారు. తద్వారా తొలిసారిగా తన ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం వల్లే బైడెన్ విజయం సాధించారని ట్రంప్ ఆక్షేపించారు. ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలో మాత్రమే బైడెన్ అధ్యక్షుడిగా నెగ్గాడని ఎద్దేవా చేశారు. చెడ్డ పేరున్న రాడికల్ లెఫ్ట్ కంపెనీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి పరిశీలకులను అనుమతించలేదని తప్పుపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను డెమొక్రాట్లు చోరీ చేశారని మరోసారి మండిపడ్డారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. బైడెన్ 306.. ట్రంప్ 232 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల ఫలితాలు కూడా వచ్చాయి. జార్జియాలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, నార్త్ కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అలస్కాలో విజయంతో ఇప్పటికే ట్రంప్ 217 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా నార్త్ కరోలినాలో గెలుపుతో తన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్యను 232కి పెంచుకున్నారు. ఇప్పటికే మేజిక్ మార్క్ 270ని సునాయాసంగా దాటేసిన బైడెన్.. తాజాగా జార్జియాలో గెలుపుతో 306 ఎలక్టోరల్ ఓట్లతో వైట్‌హౌజ్‌లోకి వెళ్లనున్నారు. జార్జియాలో బైడెన్, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపొందారని అమెరికాలో ప్రధాన మీడియా సంస్థలు పేర్కొన్నాయి. జార్జియాలో గెలుపుతో బైడెన్ మరో రికార్డు సాధించారు. గత 28 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జార్జియాను డెమొక్రటిక్ పార్టీ ఖాతాలో వేశారు. గత 28 ఏళ్లుగా అక్కడ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి గెలుపొందలేదు. -
అక్రమాల లెవీ
- పైరవీకారులకు ధాన్యం కేటాయింపులు - సీఎంఆర్ ప్రక్రియలో జోరుగా అక్రమాలు - బియ్యం ఇచ్చే విషయంలో జాప్యం - 38 శాతమే బియ్యం ఇచ్చిన రైస్ మిల్లర్లు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే(సీఎంఆర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించే విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లుల సామర్థ్యాన్ని పరిగలోకి తీసుకోకుండా.. తమకు నచ్చిన వారికే ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులను ప్రసన్నం చేసుకున్న వారికి ఎక్కువగా ధాన్యం దక్కుతుంది. రైస్ మిల్లర్ల సంఘం ముఖ్య నాయకులు సీఎంఆర్ బియ్యం లెవీ అక్రమాల్లో పాత్ర ధారులు అవుతున్నారు. అధికారుల వద్ద పైరవీలు చేసిన సంఘం నాయకుల మిల్లులకే ఎక్కువ ధాన్యం చేరుతోంది. రైస్ మిల్లర్ల నుంచి గడువులోపు బియ్యాన్ని ప్ర భుత్వానికి అప్పజెప్పేలా చూడాల్సిన మి ల్లర్ల సంఘం ముఖ్యులు.. ఈ విషయంలో అక్రమార్కులకే సహకరిస్తున్నారు. ఇలా అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ము ఖ్యలు కలిసి తమకు నచ్చిన వారికి ధాన్యం కేటాయింపుల ప్రక్రియను నిర్వహిస్తున్నా రు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన బి య్యాన్ని కొందరు మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేస్తున్నారు. బియ్యం ఇవ్వడంలో జాప్యం రైతులకు కనీస మద్దతు ధర కల్పిం చేందుకు ప్రభుత్వ సంస్థలు ధాన్యం కొనుగోలు చేయడం దశాబ్దకాలంగా జరుగుతోంది. 2014-15 లెవీ మార్కెటింగ్ సీజ ను గత ఏడాది అక్టోబరు 1న మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగియనుంది. గత ఖరీఫ్, రబీల్లో ఉత్పత్తి అయిన ధాన్యంలో 83,642 టన్నులను ప్రభుత్వం సేకరించింది. మార్కెటింగ్ సీజనులో ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చేందుకు జిల్లాలోని 72 మంది మిల్లర్లకు అధికారులు కేటాయించారు. 83,642 ధాన్యం మిల్లింగ్ చేయడంతో 56,876 టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతాయి. ఈ బియ్యాన్ని మిల్లర్లు సెప్టెంబరు 30లోపు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), పౌర సరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు వెంటనే బియ్యంగా మార్చి ఇచ్చే విషయంలో తాత్సారం చేస్తున్నారు. చాలా మిల్లులో ధాన్యం లేని పరిస్థితి ఉంది. కొందరు అధికారులు ఈ విషయాన్ని గుర్తించినా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా సెప్టెంబరు 30లోపు ప్రభుత్వం సంస్థలకు మిల్లర్లు బియ్యం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మిల్లర్లు ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాల్సిన బియ్యంలో ఇప్పటికి 22,064 టన్నులనే ఇచ్చారు. మిగిలిన 34,802 టన్నుల బియ్యం ఎప్పటికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. బియ్యం సేకరణకు క్షేత్రస్థాయి అధికారులను సమాయత్తం చేయాల్సిన ఉన్నతాధికారులు ఈ పని చేయడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.