mastanamma
-
మస్తానమ్మకు గుడ్ బై: వీడియో వైరల్
తన వంటకాలతో గ్లోబల్‌గా అభిమానులను సంపాదిస్తున్న ఇంటర్నెట్ సంచలనం కంట్రీ ఫుడ్స్ మస్తానమ్మ (107) ఇకలేరు. నిండు నూరేళ్ల జీవితాన్ని చలాకీగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగించిన మస్తానమ్మ ఇక సెలవంటూ కన్నుమూశారు. పసందైన వంటకాలతో యూట్యూబ్ వీడియోల ద్వారా దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందారు మస్తానమ్మ. అయితే గత ఆరు నెలలుగా కంట్రీ ఫుడ్స్ వెబ్సైట్ బామ్మ వంటకాల వీడియోలు లేక వెల వెల బోయింది. దీంత ప్రపంచంలోని ఆమె అభిమానులంతా ఆకలితో మలమలలాడినంతగా విలవిల్లాడిపోయారు. చివరకు ఆమె ఇక లేరన్న వార్త వారిని బాధించింది. కంట్రీఫుడ్స్ వెబ్సైట్లో గతంలో పోస్ట్ చేసిన ‘ది స్టోరీ ఆఫ్ గ్రాండ్మా ’ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. మస్తానమ్మ జీవిత ప్రస్తానంలోని సాధక బాధకాలను ఈ వీడియోలో పొందుపర్చారు. (ఆ ఘుమఘుమలు ఇకలేవు) అయితే ఇలా అర్ధాంతరంగా అందనంత దూరం వెళ్ళిపోయిన మస్తానమ్మకు అభిమానులు నివాళులు ప్రకటించారు. తన బామ్మ మస్తానమ్మ చిన్నప్పటినుండి తమ కుటుంబానికి ఎంతో చేదుడువాదోడుగా ఉండేదని ఆమె మనుమడు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. కష్టించి పనిచేసి చివరి శ్వాసవరకూ కుటుంబాన్ని ఆదుకున్న తమ పెద్దదిక్కు ఇలా అకస్మాత్తుగా తమను వీడిపోవడం తీరని లోటని కన్నీరు మున్నీరయ్యారు. వెజ్, నాన్ వెజ్ ఇలా ఏదైనా.. ఆమె వంటకాల వీడియోలు లక్షల వ్యూస్‌ను సాధించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. బామ్మ అండతో తాను ప్రారంభించిన యూ ట్యూబ్ ఛానల్‌కు విశేష ఆదరణకు నోచుకుందన్నారు. 106 ఏళ్ళ వయసులో కూడా ఎంతో శ్రమకోర్చి యూట్యూబ్ వంటల వీడియోల ద్వారా ఆర్థికంగా ఎంతో సాయపడిన బామ్మ ఇలా ఒక్కసారిగా తమను వదిలి వెళ్లిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
ఘుమఘుమల ‘గూగులవ్వ’ ఇకలేరు
సాక్షి, తెనాలి: తన చేతివంటతో పాకశాస్త్ర ప్రపంచంలో సంచలనం రేపిన ‘గూగుల్’ బామ్మ ఇకలేరు. పంటచేల పక్కన సంప్రదాయ కట్టెల పొయ్యిలో గుడ్డు ఆమ్లెట్ నుంచి రొయ్యల వేపుడు వరకు, గుత్తి వంకాయ నుంచి ములక్కాయ పులుసు వరకు తన వంటకాల ఘుమఘుమలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వీక్షకుల నోరూరించిన ఆ అవ్వ కర్రె మస్తానమ్మ 107 ఏళ్ల వయసులో అస్వస్థతకు గురై కన్నుమూసిన విషయం ఆలస్యంగా తెలియవచ్చింది. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం గుడివాడలోని తన స్వగృహంలో ఆమె ఆదివారం సాయంత్రం మృతిచెందారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేసినట్టు మనుమడు లక్ష్మణ్ తెలియజేశారు. (సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్ సెన్సేషన్) మస్తానమ్మ సొంతూరు తెనాలి దగ్గర్లోని కోపల్లె. అత్తిల్లు సమీపగ్రామం గుడివాడ. పెళ్లయిన కొన్నేళ్లకే భర్త నాగభూషణం చనిపోయారు. ఏకైక కుమారుడు ఇంట్లో ఉండే అవకాశమున్నా, అదే ఆవరణలో ఓ పాకలో నివసిస్తూ వచ్చారు. కాలూచేయీ ఆడేంతవరకూ ఒకరిపై ఆధారపడకూడదన్న భావనతో అన్ని పనులు స్వయంగా చేసుకుంటూ వచ్చారు. పొలం పనులు చేసే శక్తి సన్నగిల్లినా, పొలం వెళ్లటం మాత్రం మానలేదు. హైదరాబాద్‌లో వీడియో ఎడిటరైన ఆమె మనుమడు లక్ష్మణ్, తన స్నేహితుడు శ్రీనాథ్‌రెడ్డితో కలిసి ఆమె వంటలను యూ ట్యూబ్ ద్వారా అందరికీ నేర్పించాలనుకున్నారు. ‘కంట్రీ ఫుడ్స్’ పేరుతో ఛానల్‌ను 2016 ఆగస్టులో ప్రారంభించారు. గుడ్డు ఆమ్లెట్ నుంచి మటన్ బిర్యానీ, చేపల పులుసు, పుచ్చకాయ చికెన్, రొయ్యల వేపుడు, పీతల కూర, గోంగూర చికెన్, వంకాయ మసాల, గుత్తివంకాయ వంటి వంటకాలకు సంబంధించిన 40 పైగా వీడియోలను అప్లోడ్ చేశారు. ఈ ఛానల్‌కు 2.30 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేశారు. మొత్తంమీద 43 మిలియన్లకు పైగా మస్తానమ్మ చేతివంటను వీక్షించారు. బీబీసీలోనూ రెండు నిముషాల కథనం ప్రసారమైందని మనుమడు లక్ష్మణ్ చెప్పారు. గూగుల్ సంచలమనయ్యాక 2017 ఏప్రిల్‌లో మస్తానమ్మ పుట్టినరోజును మనుమడు, బంధువులు ఘనంగా జరిపారు. వివిధ దేశాల సబ్‌స్కైబర్లు బహుమతులు, డబ్బును పంపారు. -
సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్ సెన్సేషన్
సాంప్రదాయ రుచికరమైన వంటల తయారీలో గుడివాడ మస్తానమ్మ స్టయిలే వేరు. సెంచరీ దాటేసిన ఈ గ్రానీ ప్రస్థానం తెలిస్తే అంతా ఔరా అనుకోవాల్సిందే. అవును 106 ఏళ్ళ వయసులో చలాకీగా, తన పనులు తను చేసుకుంటూ నోరూరించే వంటకాలతో, టాలెంట్ ప్రదర్శిస్తూ యూ ట్యూబ్ సంచలనంగా మారిపోయింది. 'కంట్రీ ఫుడ్స్' పేరుతో సొంత ఛానెల్‌ను నడుపుతున్న ఈ బామ్మ లక్షల ఫాలోయర్స్‌తో దుమ్మురేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గుడివాడకు చెందిన మస్తానమ్మ యూట్యూబ్ స్టార్.. యూ ట్యూబ్ సెన్సేషన్. తన వంట ట్యుటోరియల్స్ తో యూట్యూబ్ లో సునామీ సృష్టిస్తోంది. కంట్రీ ఫుడ్స్ ఛానల్ లో రకరకాల వంటల నైపుణ్యంతో గుడివాడ బామ్మ సూపర్ పాపులర్. ఆమె చేతి వంటకాల లిస్ట్ ఒకటా రెండా.. చాలా పెద్దదే. ఎగ్ దోశ, ఫిష్ ఫ్రై , పాయా, అరటి ఆకులతో చేసే స్పెషల్ ఫిష్ ఫ్రై, బ్యాంబూ చికెన్ బిర్యానీ లాంటి ఇతర వంటకాలను సులభంగా వండేస్తోంది. ముఖ్యంగా ఈమె వంటకాల్లో వాటర్ మిలన్ చికెన్ ప్రత్యేకమైందనే చెప్పాలి. ఈ ఒక్క వీడియేకే 66లక్షల వ్యూస్ వచ్చాయంటేనే ఇది ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఈ వెరైటీ వంటకాలతో అమెరికా, బ్రిటన్, దుబాయ్‌లలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అక్కడున్న బంధువులు ఫోన్ చేసి మరీ మస్తానమ్మ వంటకాలపై ప్రశంసలు కురిపించారట. ఒక ఆకలితో ఉన్న రాత్రి తాను, తన ఫ్రెండ్స్ కొంత ఆహారాన్ని సిద్ధం చేసుకున్న సందర్భంలో తాము కూడా యూ ట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనే ఆలోచన వచ్చిందట మస్తానమ్మ మనువడు లక్ష్మణ్ కి. ఇలా మొదలు పెట్టిన ఫస్ట్ వీడియోనే వైరల్‌గా మారడంతో మరింత ఊత్సాహంగా దీన్ని ముందుకు నడిపించారు. ఇతనికి అమ్మమ్మ వెరైటీ రెసిపీలు మరింత సహాయం చేశాయి. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే మొదట్లో ఆమె వీడియోలను షూట్ చేస్తోంటే తనకు ఏమీ అర్థంకాలేదని, కానీ అసలు విషయం తెలిసిన తరువాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందని లక్ష్మణ్ వివరించారు. అంతేకాదు.. ఇటీవల 106 వ పుట్టినరోజు సందర్భంగా చీరలు, గ్రీటింగ్ కార్డులు లాంటి బోలెడన్ని బహుమతులు అందుకుందట గ్రాండ్మా. ముఖ్యంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్‌కు చెందిన ఓ ఫ్యాన్ చీరను పంపించారంటూ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ బామ్మకు యూ ట్యూబ్ ఫాలోయర్ల సంఖ్య ఎంతో తెలుసా. సుమారు 2 లక్షల 48వేలమంది సబ్ స్కైబర్లు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటు వయసులో లేటెస్ట్ సంచలనంగా మారిన మస్తానమ్మకు మనం కూడా సాహో అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం వాటర్ మిలన్ చికెన్ వీడియోపై ఒక లుక్కేసుకుంటే పోలా.. -
మస్తాన్‌బాబుకు భారతరత్న ఇవ్వాలి
సంగం: పర్వతారోహణలో అనేక రికార్డుల్ని బద్దలుకొట్టి జాతికి గర్వకారణంగా నిలిచిన ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబుకు భారతరత్న అవార్డు ప్రకటించాలని ఆయన సోదరి డాక్టర్ మస్తానమ్మ డిమాండ్ చేశారు. గత ఏడాది అర్జెంటీనా పర్వతశ్రేణుల్లో ప్రాణాలుకోల్పోయిన మస్తాన్‌బాబు ప్రథమ వర్ధంతి బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఆయన స్వగ్రామమైన గాంధీజనసంఘంలో నిర్వహించారు. తొలుత మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ, సోదరి దొరసానమ్మ, ఆత్మకూరు ఆర్డీఓ ఎం.వెంకటరమణలు పలువురు అభిమానులతో కలిసి మస్తాన్‌బాబు సమాధి వద్ద జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్ దొరసానమ్మ మాట్లాడుతూ మల్లి మస్తాన్‌బాబు మృతిచెంది ఏడాది గడిచినా తాము సమాధి వద్ద ఆయన పేరును లిఖించలేదని పేర్కొన్నారు. 37 పర్వతాలు అధిరోహించి మస్తాన్‌బాబు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని, ఆయన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం భారతరత్న ప్రకటిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. ఆ నమ్మకంతోనే భారతరత్న ప్రకటించిన అనంతరం పేరుకు ముందు ఆ పదాన్ని ఉంచుతూ సమాధి వద్ద లిఖించాలని అనుకున్నానని వివరించారు. తానెప్పుడు మస్తాన్‌బాబును తమ్మునిగా భావించలేదని, ఓ భారతీయునిగా గుర్తించామని వివరించారు. ఎంతో కష్టతరమైన పర్వతారోహణకు మస్తాన్‌బాబు సిద్ధమైనప్పుడు ఓ భారతీయుడిగా పేరు రావాలనే ప్రోత్సహించామని తెలిపారు. పర్వతాలు అధిరోహించడం ఎంత కష్టమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తన తమ్ముడు మృతిచెందిన ఆండీస్‌లోని సెర్రోట్రెస్ క్రోసెస్ పర్వతాన్ని స్వయంగా అధిరోహించానన్నారు. ఒక్క పర్వతం ఇంత కష్టమైతే 37 పర్వతాలు అధిరోహించడం ఎంత కష్టతరమో, ప్రపంచంలో మల్లి మస్తాన్బాబుకొక్కడికే అది సాధ్యమైందని కొనియాడారు.