మాస్టర్స్..అథ్లెటిక్స్
ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది అందరికీ తెలుసు.. కానీ ఆచరించేవారు చాలా తక్కువ. ఆరోగ్యంపై దృష్టి పెట్టనివారు మమ్మల్ని చూసైనా కొంత నేర్చుకుంటారని తపన. మేం కొన్నేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాం. మేమంతా ఉండే చోటే మైదానం.. ఉదయం సాయంత్రం అంతా ప్రాక్టీసే అని చెబుతున్నారు రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు హాజరైన పలు జిల్లాల క్రీడాకారులు. పోటీలు ఎక్కడైనా సరే.. ఎప్పుడైన సరే రెడీ అంటున్నారు.
ఇంకా వారేమన్నారో వారి మాటల్లోనే...
అలసట ఉండదు..
నాకు 35 సంవత్సరాల వయస్సప్పటి నుంచి వ్యాయామం చేస్తున్నా. ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు. ఇంత వయస్సున్నా అసలు నాకు అలసట అనేది ఉండదు. ఎప్పుడు చురుకుగా ఉంటా. ఒకసారి పుణెలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్, హ్యామర్‌త్రోలో పాల్గొంటున్నా.
వి. సరోజని, మెదక్
కరీంనగర్లో..
కరీంనగర్ స్పోర్ట్స్ : తొలి తెలంగాణ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు శనివారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు తెలంగాణలోని 8 జిల్లాల నుంచి సుమారు 650 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు.
35 సంవత్సరాలు వయస్స్సు నుంచి మొదలుకొని 90 సంవత్సరాల వయస్స్సు పైబడిన క్రీడాకారులు హాజరయ్యారు. పోటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవలీ కాలంలో జిల్లా వేదికగా జాతీయ.. రాష్ట్రస్థాయి పోటీలు జరగడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ అన్నారు.
క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా పేరు నిలపాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, జిల్లా సంఘం అధ్యక్షుడు కొండూరి రవీందర్ రావు, రాష్ట్ర సంఘం అధ్యక్షకార్యదర్శులు లక్ష్మణ్‌రెడ్డి, భగవాన్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి సత్యవాణి, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి నీలం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న మార్చ్ఫాస్ట్.. విజేత వరంగల్
రాష్ర్టస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు హాజరైన 8 జిల్లాల క్రీడాకారులు చేసిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. ఒక్కో జిల్లా నుంచి సుమారు 80 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. పెద్దపెద్ద మెగా టోర్నీలలో క్రీడాకారులు ఎలా మార్చ్ఫాస్ట్ చేస్తారో.. దానిని మించి వృద్ధులు మార్చ్ఫాస్ట్ చేయడం చూసి యువత నివ్వెరపోయింది. మార్చ్ ఫాస్ట్‌లో వరంగల్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సొంతం చేసుకోగా, రంగారెడ్డి, మెదక్ జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
రన్నింగ్ చేసిన కొండూరి, సర్దార్
మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభించడానికి వచ్చిన అతిథులుపోటీల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. 400 మీటర్ల రన్నింగ్ పోటీని రెఫరీ పిలవగానే అక్కడే ఉన్న మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావులు లైన్ మీది కొచ్చి పోటీకి సిద్ధమయ్యారు. ఒక రౌండ్ వేసి క్రీడా స్ఫూర్తి నింపారు.
800 మీటర్ల రన్నింగ్..పురుషులు:
35 సంవత్సరాలు: జగన్ మోహన్ (రంగారెడ్డి), శంబు లింగం, శ్రీనివాస్ (నల్గొండ)
40సం: హలాజీ(కరీంనగర్), కోటినారంగం (నల్గొండ), జానాకిరావు (ఖమ్మం)
45సం: శ్రీనివాసులు(మెదక్), రాంబాబు (ఖమ్మం),రాజిరెడ్డి (కరీంనగర్)
50సం: రాంబాబు (ఖమ్మం), ప్రేంకుమార్ (మహబూబ్‌నగర్), పాపయ్య (మెదక్)
55 సం: ఐలయ్య (కరీంనగర్), చెన్నకేశవులు (మహబూబ్‌నగర్), కుమార్ (వరంగ్ల్)
60సం: పెంచలయ్య (మెదక్), రాజ్‌కుమార్, సుందర్ రాజం (రంగారెడ్డి)
800 మీటర్ల రన్నింగ్..మహిళలు:
35 సం: మంజుల, కవిత (వరంగల్), వరలక్ష్మి (ఖమ్మం)
200 మీటర్ల ర న్నింగ్..పురుషులు:
35 సం: బద్రుదొద్దీన్ (కరీంనగర్), నవీన్‌రాజ్ (మెదక్), శంకర్ (కరీంనగర్)
40 సం: లక్ష్మణ్ (కరీంనగర్), జాన్ (రంగారెడ్డి), ఫాన్సీస్ (నల్గొండ)
45 సం: బాలరాజు (మెదక్), మోహీయోద్దీన్ (కరీంనగర్), రమేశ్ (కరీంనగర్)
50 సం: జ్ఞానేశ్వర్ (రంగారెడ్డి), ముఖర్జీ (హైదరాబాద్), శ్రీనివాసులు (మెదక్)
55 సం: ఫసీయోద్దీన్ (కరీంనగర్), సురేందర్ కుమార్ (రంగారెడ్డి), చిరంజీవులు (మెదక్)
60 సం: రాఘవేందర్ రావు (మెదక్), వెంకటయ్య (మహబూబ్‌నగర్), శర్మ (రంగారెడ్డి)
65 సం: బాబు, హరీరాం (రంగారెడ్డి), కరుణాకర్ (మెదక్)
200 మీటర్ల ర న్నింగ్.. మహిళలు:
35 సం: నీలిమా (రంగారెడ్డి), కవిత, కృష్ణవేణి (వరంగల్)
45 సం: కుసుమ (వరంగల్), విజయలక్ష్మి (రంగారెడ్డి), స్నేహలత (హైదరాబాద్)
50 సం: సుబ్బలక్ష్మి, ఆది లక్ష్మి (రంగారెడ్డి), ప్రభాలత (హైదరాబాద్)
55సం: సీహెచ్ విజయలక్ష్మి, డి.విజయలక్ష్మి, శారద (రంగారెడ్డి)
1500 మీటర్ల రన్నింగ్..పురుషులు:
35 సం జగన్ మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), మొయిన్పాషా (కరీంనగర్), శంభులింగం (నల్గొండ)
40 సం: తయప్పా (రంగారెడ్డి), సూర్యనారాయణ (మెదక్), శ్రీశైలం (వరంగల్)
45సం: శ్రీనివాసులు ( మెదక్), రాజిరెడ్డి (కరీంనగర్), సూర్య ప్రకాష్ (రంగారెడ్డి)
50 సం: ఆనందం (హైదరాబాద్), రాంబాబు (ఖమ్మం), వెంకటేశ్వర్లు (రంగారెడ్డి)
60 సం: సదానందం (రంగారెడ్డి), రాఘవేంద్రరావు (మెదక్), సుధాకర్‌రెడ్డి (హైదరాబాద్)
65 సం: నారాయణ (హైదరాబాద్), సుగ్రీవుడు, సూరజ్ (మెదక్)
1500 మీటర్ల రన్నింగ్..మహిళలు:
35 సం: మంజుల, తిరుపతమ్మ (వరంగల్), శోభారాణి (కరీంనగర్)
10 వేల మీటర్లు రన్నింగ్.. పురుషులు:
40 సం: తైయ్యప్ప(రంగారెడ్డి), బాలాజీ (కరీంనగర్), సూర్యనారాయణ (మెదక్)
45 సం: ప్రబులయ్య, అజయ్‌కుమార్(మెదక్), సూర్యప్రకాశ్ (రంగారెడ్డి)
45 సం: వేణుగోపాల్రాజ్(రంగారెడ్డి), ఐలయ్య (కరీంనగర్), రఘురాంరెడ్డి(రంగారెడ్డి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు.
నన్ను చూసి రావాలి..
నాకు 75 సంవత్సరాలు. నేను ప్రతిరోజూ గ్రౌండ్‌కు వెళ్తా. వ్యాయామం చేయని రోజు ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. మూడుసార్లు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నా. 5 కిలోమీటర్ల రన్నింగ్‌లో ఒకప్పుడు నేనే స్పెషల్. ఇప్పుడు 100, 200, హర్డిల్స్ అంశాల్లో పాల్గొంటున్నా. నన్నుచూసి కొంతమందైనా.. మైదానం బాట పడుతారని నా ఆశ.
ఆర్పీ భగవాన్, రాష్ర్ట సంఘం కార్యదర్శి
నేనే ఫస్ట్..
వ్యాయామం అనేది అందరికి అవసరం. నాకు 78 సంవత్సరాలు ఉన్నాయి. అయినా వ్యాయామం చేయడం మర్చిపోను. అప్పుడు, ఇప్పుడు
జావెలిన్త్రోనే పాల్గొంటున్నా. మాస్టర్స్
అథ్లెటిక్స్ పోటీలు ఉన్నాయంటే మాకు
ఒక పండుగా. మూడు రోజులు చాలా
సంతోషంగా గడుపుతాం.
: భుజంగరావు, రంగారెడ్డి
25 ఏళ్లుగా ప్రాక్టీస్..
ఇప్పడు నాకు 65 సంవత్సరాలు. సుమారు 25 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఎక్కడా రాష్ట్రస్థాయి పోటీలు ఉన్నా సరే.. నేను తప్పకుండా హాజరవుతా. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసి పోటీలకు వెళ్తా. ఇప్పటి వరకు నాలుగుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. 5 కిలో మీటర్ల వాకింగ్‌లో ముందుంటా.
పోటీలకు మేమిద్దరం
మా వయస్సు 70, 65. ఇప్పటికీ ఇద్దరం కలిసి పదికి పైగా టోర్నమెంట్లలో పాల్గొన్నాం. ప్రతిసారి ఇద్దరం మంచి పర్ఫార్మెన్స్ కూడా చూపాం. గోల్డ్, సిల్వర్ మెడళ్లు సాధించాం. మమ్మల్ని చూసిన పిల్లలు వ్యాయామం చేయడం ప్రారంభించారు. ఇలాంటి ఆలోచన అందరికి రావాలి. ఇదే మా ఆశయం : ఉదయ్శిజువాల్కర్, ఊర్మిల, రంగారెడ్డి
నేటికి మైదానంలోనే..
నేను 2010 నుంచి మైదానంలోనే. ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్నా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని తెలిసింది. దాంతో పాటు ఇలాంటి పోటీల్లో పాల్గొనవచ్చు కూడా . అందరూ రోజు మైదానం బాట పట్టాలి. అప్పుడే అందరు ఆరోగ్యంగా ఉంటారు. 10 కిలోమీటర్ల వాకింగ్ చేస్తున్నా.
: ఎండీ. యాకూబ్ పాషా, వరంగల్