బోపన్న జంట ఓటమి
మోంటెకార్లో: ఈ సీజన్లో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో తన భాగస్వామి ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)తో బరిలోకి దిగిన బోపన్న క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బోపన్న-మెర్జియా ద్వయం 2-6, 3-6తో నాలుగో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యా చ్లో బోపన్న జోడీ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఈ ఏడాది ఎనిమిది టోర్నీలలో పాల్గొన్న బోపన్న కేవలం ఒక టోర్నీలో మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నాడు.