దావూద్‌కు మోదీ మాస్టర్ స్ట్రోక్!!
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వలర్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను యూఏఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు వస్తున్న వార్తలపై అధికార బీజేపీ స్పందించింది. యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో దావూద్‌కు చెందిన రూ. 15వేల కోట్ల ఆస్తులు సీజ్ చేయడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద దౌత్య విజయమని, ఇది ప్రధాని నరేంద్రమోదీ మాస్టర్ స్ట్రోక్ అని అభివర్ణించింది.
భారత ప్రభుత్వం పంపిన దౌత్య పత్రాల వల్లే దావూద్‌కు వ్యతిరేకంగా ఈ చర్యలు తీసుకున్నట్టు బీజేపీ అధికార పేజీ ట్వీట్ చేసింది. ‘ప్రధాని మోదీ గొప్ప దౌత్య విజయం. యూఏఈలో భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తులు సీజ్ చేశారు’ అని బీజేపీ పేర్కొంది. ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్‌కు వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద అణచివేత చర్య ఇదేని పేర్కొంది.
2015లో తన యూఏఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. దావూద్ ఆస్తుల చిట్టాను ఆ దేశ ప్రభుత్వానికి అందజేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపింది. ఈ దౌత్యపత్రాల ఆధారంగా విచారణ జరిపిన యూఏఈ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తన ఫొటో కామెంట్లో వివరించింది. 59 ఏళ్ల దావూద్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరుమోసిన దావూద్ యూఏఈలో ఆస్తులు సీజ్ చేయడం అతిపెద్ద చర్యగా భావిస్తున్నప్పటికీ, ఈ కథనాలను భారత నిఘావర్గాలు ఇంకా ధ్రువీకరించడం లేదు.
Major diplomatic success of PM Modi: One of India's most wanted criminals, Dawood Ibrahim's properties worth Rs. 15,000 crore seized in UAE. pic.twitter.com/MMERwLoPO1
— BJP (@BJP4India) January 4, 2017