ఇంగ్లిష్, లెక్కలు లేని విద్య వృధా ప్రయాసే..!
ఎక్కువ మంది విద్యార్థులను ఫెయిల్ చేస్తున్న ఇంగ్లిష్, గణితాన్ని సబ్జెక్టులుగా తొలగించి ఐచ్చికాంశాలుగా మాత్రమే కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధికి సంబంధించి అత్యంత కింది స్థాయి ఉద్యోగాలకు మాత్రమే ప్రజారాసులను సిద్ధం చేసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
పాఠశాల విద్యను ప్రోత్స హించే లక్ష్యం కోసం భారత్‌లో విచిత్రమైన పరిణా మాలు జరుగుతున్నాయి. దీని కోసం త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చారు. కొద్ది సంవత్స రాలు పాస్ కాకున్నా పై తర గతిలో చేరేందుకు అనుమతించారు. బాలికలకు ఉచిత విద్యను అందించారు. బాలికలు బడి మానకుండా చేయ డానికి టాయ్లెట్లను నిర్మించే ప్రయత్నం చేశారు. విద్యా హక్కును కూడా తీసుకొచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ ఫలి తాలను ఇవ్వలేదు. విద్యావ్యాపారంలో ప్రైవేట్ రంగా నికి ప్రభుత్వమే తలుపులు బార్లా తెరుస్తున్నందున, పాఠశాలకు బాలికలను తీసుకురావడం ఖరీదైన వ్యవ హారంగా మారిపోయింది.
ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్, గణితాన్ని స్కూల్ సబ్జెక్టులుగా తొలగించి వాటిని ఐచ్ఛికాంశాలుగా కొనసాగించాలని భావిస్తోంది. ఎందుకంటే ఈ రెండు సబ్జెక్టుల వల్లే పాఠశాలల్లో అనేకమంది ఫెయిల్ అవు తున్నారు. రాష్ట్ర విద్యామంత్రి వినోద్ తావ్డే సైతం విద్యాబోధన స్థాయి, పాఠశాలల పర్యవేక్షణను పక్కన బెట్టి, ఈ రెండు సబ్జెక్టులే విద్యా ప్రమాణాల వినాశ కారులని చూపిస్తున్న సమాచార పత్రాల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ పరిధికి వెలు పల పాఠశాలలు ‘అంతర్జాతీయం’ అయిపోతున్నాయి.
మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిపుణత గురించి కేంద్రంతో చర్చిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చర్య సీరియస్ వ్యవహా రంగా కనిపిస్తోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు సాధిం చిన లేదా తమ పరీక్షల్లో నెగ్గని విద్యార్థులకు పాస్ అయ్యారు అని, నిపుణతలకు తగినవారుఅని సర్టిఫికెట్ రూపొందించడం ద్వారా పదవ తరగతిలో ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయని తరహా వ్యవస్థ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రశ్నించదగిన ప్రమాణాలు కలిగిన వ్యవస్థలో కనీస కొలబద్దను కూడా ఇప్పుడు ఇంకాస్త తక్కువ స్థాయికి దించుతున్నారన్నమాట.
దేశవ్యాప్తంగా పంచాయతీల నుంచి పురపాలక సంస్థలకు సంబంధించి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులలో సగంమంది మూడో తరగతిలో నేర్చుకున్న పాఠాలను కూడా చదవలేకపోతున్నారని మనందరికీ తెలుసు. అంటే అన్ని రాష్ట్రాలూ తమకు గర్వ కారణంగా భావిస్తున్న మాతృభాషలో కూడా వీరు పదా లను, వాక్యాలను రాయలేకపోతున్నారు. అదే క్రమంలో వీరు లెక్కలు కూడా చేయలేరు. అంటే భావ వ్యక్తీకరణ లోనూ, మార్పులను గణించడంలోనూ వీరంతా పేలవ మైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని అర్థం.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,. ఆధునిక ప్రపంచానికి తలుపులు తెరుస్తున్నట్లు తాము భావిస్తున్న ఇంగ్లిష్ మీడియం విద్యవైపు తల్లిదండ్రులు పరుగులు పెడుతున్న దశలో ఇది వెలుగు చూస్తోంది. ప్రభుత్వం లేక వ్యవస్థను నడిపిస్తున్న రాజకీయ నేతల్లా కాకుండా, ప్రపంచంతో తమ పిల్లలను అనుసంధానించడంలో ఉన్న ప్రాధాన్యతను తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు. అదే సమ యంలో ప్రభుత్వం.. మాతృభాషను ఇంగ్లిష్‌పై ఉన్న భ్రమలకు సహజ నివారణగా భావిస్తూ దాని పట్ల అనురక్తిని ప్రదర్శిస్తున్నట్లు కనబడుతోంది.
విద్య విషయంలో దేశంలోనే తీవ్ర నేరస్తురాలిగా పక్కన పెట్టనప్పటికీ, మహారాష్ట్ర ఈ కొత్త పరిణామానికి ఉదాహరణగా నిలుస్తోంది. వార్షిక స్థిర విద్యా నివేదికలు విద్యలో అల్ప ప్రమాణాల గురించి ఒకేరకమైన వివరణ లను పదే పదే వెలువరిస్తున్న నేపథ్యంలో... తగిన మానవ వనరుల పునాదిని అభివృద్ధి చేయడంలో తోడ్పాటు నందించే కొన్ని విలువైన సవరణలను కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చాయి. అయితే ఉపాధికి సంబంధించి అత్యంత కింది స్థాయి ఉద్యోగాలకు మాత్రమే ప్రజా రాసులు సిద్ధమవుతున్నారా అనిపించేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
దేశం విద్యారంగంలో ఎంత చక్కగా పనిచేస్తోంది అనే అంశాన్ని నిర్ధారించడానికి, పాఠశాలల్లో ప్రవేశం అనేది కొలబద్ద కాదు. చక్కటి విద్యా బోధనా స్థాయి, నేర్చుకోవ డానికి సంబంధించి విద్యార్థులకు తోడ్పాడు నందించడంలో దాని సానుకూల ప్రభావం అనేవి పాఠశాల ప్రవేశంతోటే సిద్ధించవు.
మీకు విద్యా హక్కు ఉండవచ్చు కానీ, ఏక గది పాఠశాలలు, విజ్ఞానాన్ని అందించడంలో సందేహాస్పదమైన సామర్థ్యం కలిగిన ఉపాధ్యాయుల గైర్హాజర్ అనేవి విద్యాబోధనను మొత్తంగా అపహాస్యం చేస్తున్నాయి. విద్యకోసం కేటా యించే బడ్జెట్ల కంటే అది తీసుకువస్తున్న ఫలితమే నిజమైన కొలబద్ద. అయితే ప్రమాణాలను తగ్గించడం ద్వారా గోల్ పోస్టును మార్చడానికి దేశంలో కనీసం ఒక రాష్ట్రమైనా ఇప్పుడు సంసిద్ధతను ప్రదర్శిస్తున్నట్లు కన బడుతోంది.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
- మహేష్ విజాపుర్కార్
ఈ మెయిల్ : mvijapurkar@gmail.com