Mauryani
-
నేడే విడుదల
అసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటించిన చిత్రం ‘నేడే విడుదల’. ఈ సినిమా ద్వారా రామ్ రెడ్డి పన్నాల దర్శకునిగా పరిచయమవుతున్నారు. నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా ప్రీ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఆసక్తికరమైన కథ, ఆలోచింపచేసే కథనంతో పాటు ఆహ్లాదపరిచే సంభాషణలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్, సాంగ్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అజయ్ అరసాడ, కెమెరా: సిహిచ్ మోహన్ చారి. -
నెల్లూరు టు ఖమ్మం
సతీష్ రెడ్డి, మౌర్యాని, ముంతాజ్ ముఖ్య తారలుగా వీజే రెడ్డి దర్శకత్వంలో సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రఘునాథరెడ్డి నిర్మించిన చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. గురురాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను సీనియర్ దర్శకులు సాగర్, రేలంగి నరసింహారావు విడుదల చేశారు. సాగర్ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా చేయడానికి కొంత సమయం తీసుకున్నా పర్లేదు కానీ ఏదో ఒకటి చేయాలనుకోకూడదు. ‘నెల్లూరి పెద్దారెడ్డి’ చిత్రాన్ని దర్శకుడు వీజే రెడ్డి పకడ్బందీగా రూపొందించారని తెలిసింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని నెల రోజుల్లోనే కంప్లీట్ చేయడం గొప్ప విషయం. కథను ఎంత బాగా చెప్పామన్నదే ప్రేక్షకులకు ముఖ్యం’’ అన్నారు రేలంగి నరసింహారావు. ‘‘నెల్లూరి నుంచి ఖమ్మం జిల్లా సీతాపురం గ్రామానికి వలస వెళ్లిన పెద్దారెడ్డి అనే వ్యక్తి కథ ఇది. తోటివారికి సాయం చేయాలనుకునే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడం వల్ల కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఆసక్తికరం. గురురాజ్ సంగీతం, డాక్టర్ కమలాకర కామేశ్వరరావు సాహిత్యం చక్కగా కుదిరాయి. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు వీజేరెడ్డి. ‘‘సినిమాలో నెల్లూరి పెద్దారెడ్డి ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతులను అందిస్తాడు’’ అన్నారు సతీష్ రెడ్డి. -
మౌర్యానీ.. మనసుదోచె
‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా ఫేమ్ మౌర్యానీ సిటీలో సందడి చేసింది. ఎల్బీనగర్లోని లక్ష్మి పద్మశాలి టెక్టŠస్టైల్ మార్కెట్ (ఎల్పీటీ) ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి బంపర్ డ్రా నిర్వహించారు. దీనికి మౌర్యానీ ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీశారు. హస్తినాపురానికి చెందిన శ్వేత విజేతగా నిలిచి మారుతి ఆల్టో కారు గెలుపొందారు. కార్యక్రమంలో మార్కెట్ ట్రస్ట్ కమిటీ అధ్యక్షుడు జెల్ల భిక్షం, ఉపాధ్యక్షుడు గోవర్దన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ, మార్చెంట్ కమిటీ అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షుడు నర్సింహ తదితరులు పాల్గొన్నారు. –మన్సూరాబాద్