mayadevi
-
నేపాల్ లేకపోతే ‘రాముడు’ అసంపూర్ణం
బుద్ధ పూర్ణిమ రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నేపాల్ పర్యటనలో ఉన్నారు. ఒక్క పర్యటన సందర్భంగా మోదీ.. లుంబినీలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో మోదీ కీలక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ మేరకు సాంస్కృతిక, విద్యా రంగాల్లో ఆరు అవగాహనల ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి ఒకే కుటుంబంగా మారుస్తోందని స్పష్టం చేశారు. బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడు. బుద్ధుడే మనల్ని కలుపుతున్నాడు. రాముడికి సైతం నేపాల్‌తో బంధం ఉంది. నేపాల్ లేకపోతే రాముడు అసంపూర్ణం. ఇరు దేశాల మధ్య పండుగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోందని మోదీ తెలిపారు. వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలని కోరారు. Addressing a programme in Lumbini on the auspicious occasion of Buddha Purnima. https://t.co/Frs6jrcHIC — Narendra Modi (@narendramodi) May 16, 2022 ఇది కూడా చదవండి: పాఠశాలలో చేర్పించమని సీఎంనే అభ్యర్థించిన బాలుడు: వీడియో వైరల్ -
ముగ్గురు ఐఏఎస్‌ల తల్లి.. చదివింది ఎనిమిదే!!
మాయాదేవి.. ఆమె చదివింది కేవలం 8వ తరగతి వరకు మాత్రమే. కానీ తండ్రిలేని ముగ్గురు బిడ్డలను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దింది. బిడ్డల తండ్రి ఓ సామాన్య రైతు. ఆయన కూడా పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే మరణించాడు. అయినా.. ఆ తల్లికి మాత్రం తన బిడ్డలను ఐఏఎస్ అధికారులుగా చూడాలన్న తపన ఏమాత్రం తగ్గలేదు. ఉన్న ముగ్గురు బిడ్డల్లో ఎవరో ఒకరిద్దరిని కాదు.. మొత్తం ముగ్గురినీ ఆ స్థాయిలోనే చూడాలని గట్టిగా పట్టుబట్టింది. ఎంతగా అంటే, పెద్ద కూతురు ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండగానే ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. ఎక్కడో రాజస్థాన్‌లోని మారుమూల గ్రామంలో నివాసం ఉండే మాయాదేవి.. జీవితంలో తాను ఎంత కష్టాలు పడినా.. తన బిడ్డలను మాత్రం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి పంపింది. ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే తనంత అదృష్టవంతురాలు, సంతోషకరమైన తల్లి మరొకరు లేరని భావిస్తోంది. ఆమె పెద్దకుమార్తె క్రాంతి ఇప్పటికే యూపీఎస్సీ పరీక్షలు పాసై.. ముంబైలో ఆదాయపన్ను శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు కుమారుడు లోక్‌బంధు, రెండో కుమార్తె పూజ కూడా తాజాగా యూపీఎస్సీ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారు. దీంతో తాను కన్న కలలు నిజమయ్యాయని, బిడ్డలు ముగ్గురూ ఉన్నత స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని ఆమె చెబుతోంది.