బుద్ధ పూర్ణిమ రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నేపాల్ పర్యటనలో ఉన్నారు. ఒక్క పర్యటన సందర్భంగా మోదీ.. లుంబినీలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో మోదీ కీలక చర్చలు జరిపారు.
ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ మేరకు సాంస్కృతిక, విద్యా రంగాల్లో ఆరు అవగాహనల ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి ఒకే కుటుంబంగా మారుస్తోందని స్పష్టం చేశారు. బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడు. బుద్ధుడే మనల్ని కలుపుతున్నాడు. రాముడికి సైతం నేపాల్‌తో బంధం ఉంది. నేపాల్ లేకపోతే రాముడు అసంపూర్ణం. ఇరు దేశాల మధ్య పండుగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోందని మోదీ తెలిపారు.
వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలని కోరారు.
Addressing a programme in Lumbini on the auspicious occasion of Buddha Purnima. https://t.co/Frs6jrcHIC
— Narendra Modi (@narendramodi) May 16, 2022
ఇది కూడా చదవండి: పాఠశాలలో చేర్పించమని సీఎంనే అభ్యర్థించిన బాలుడు: వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment