Mayagadu
-
మాయగాడు మూవీ రివ్యూ
టైటిల్: మాయగాడు నటీనటులు: నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రి సురేష్, అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రాఫర్: వెంకట్ గంగాధరి ఎడిటర్: జునైద్ సిద్దిఖ్ నిర్మాత: భార్గవ్ మన్నె రచన, దర్శకత్వం: జి కార్తిక్ రెడ్డి విడుదల తేదీ: 03-02-2023 నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్స్‌గా అడ్డా ఫేం జీ.ఎస్.కార్తీక్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. పైరసీ బ్యాక్ డ్రాప్లో రూపొందిన లవ్ స్టోరీ ఇది. ఈ రోజు రీలిజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే: కాకినాడలో రవి(నవీన్ చంద్ర) అనే వ్యక్తి సినిమాలని పైరసీ చేసే ఒక సీడీల షాప్ ఓనర్. ఆకతాయిగా అమ్మాయిలతో తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. పైరసీ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న సిరి(గాయత్రి సురేష్) రవిని పోలీసులకి పట్టిస్తుంది. హీరో అప్పటి నుంచి సిరి వెనక పడుతుంటాడు. ప్లే బాయ్‌గా తిరిగే రవి(నవీన్ చంద్ర) లవ్‌లో సిరి ఎలా పడింది? మరి పూజా ఝావేరికి నవీన్ చంద్రకి సంబంధం ఏంటి? పూజా ఝావేరి అన్నయ్య యాంటోని(అభిమన్యు సింగ్) నవీన్ చంద్రని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అసలు పైరసీ ఆగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథ ఎలా ఉందంటే.. ఫస్ట్ హాఫ్ ఓపినింగ్లో నవీన్ చంద్ర ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్తాడు. సినిమా రిలీజ్ తరువాత పైరసీ చేసి డబ్బులు సంపాదిస్తూ తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. కాకపోతే, ప్లే బాయ్‌గా చూపించే క్యారెక్టర్లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. తన ఫ్రెండ్ గీత పెళ్లి మ్యాచెస్ కోసం కాకినాడకి వచ్చిన సిరి.. పైరసీ చేస్తున్న నవీన్ చంద్రకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో అతని వలలో చిక్కుకుంటుంది. అదే టైంలో పూజా ఝావేరి నవీన్ చంద్రకి పరిచయమవ్వుతుంది. తన అన్నయ్య ఒక కిల్లర్ అని చెప్పిన పట్టించుకోకుండా ఆమె చుట్టూ తిరుగుతాడు. ఒక రోజు యాంటోని(అభిమన్యు సింగ్) తన చెల్లితో రొమాన్స్ చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పారిపోతాడు. వీళ్లిద్దరి మధ్య సీన్స్ నిడివి తక్కువే అయ్యిన పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాలో వచ్చే సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకోవు. ఒక బలమైన సీక్వెన్స్‌లో నవీన్ చంద్ర అండ్ గాయత్రి సురేశ్ ఇద్దరు బాగా దగ్గరవ్వతున్న సమయంలో బ్రేకప్‌తో ఫస్టాప్ ముగుస్తుంది. సెకండ్ ఆఫ్ వచ్చేసరికి ప్లే బాయ్ కాస్త లవర్ బాయ్‌లా మారిపోతాడు. అయితే కొన్ని సీన్స్‌లో ఎమోషన్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకునేలా లేవు. అభిమన్యు సింగ్ కామెడీ కాస్తా నవ్విస్తుంది. క్లైమాక్స్ పైరసీ కోసం ఫ్యాన్స్‌తో పోరాటం చేసిన తీరు బాగున్నప్పటికీ అంతగా మెప్పించలేదు. సినిమాలో కథ, డైలాగ్స్ మీద దర్శకుడు ఇంకాస్త దృష్టి సారిస్తే బాగుండేది. ఎవరెలా చేశారంటే: నవీన్ చంద్ర ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఈ సినిమాలో ఆకతాయి కుర్రాడిలా ఆకట్టుకున్నాడు. పూజా ఝావేరి యాక్టింగ్‌తో పాటు తన అందచందాలతో సూపర్ అనిపించింది. గాయత్రి సురేశ్ తన పాత్ర లో చక్కగా ఓదిగిపోయింది. అభిమన్యు సింగ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఒక మెంటల్ కిల్లర్‌లా అద్భుతంగా రాణించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ పాత్ర ఫ్యాన్స్‌ను మెప్పించింది. మిగిలి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు జి. కార్తిక్ రెడ్డి పాత్రల ఎంపిక విషయంలో బాగానే ఉన్నా.. కథపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కథలో కొత్తదనం లేకపోవడం మైనస్. జునైద్ సిద్దిఖ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రాఫి సినిమా స్థాయి పెంచింది. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. చిత్రనిర్మాణ సంస్థ నిర్మాణ విలువలు ఫర్వాలేదు -
'రామ్ చరణ్ సినిమాను కూడా పైరసీ చేస్తా'
నవీన్ చంద్ర ,గాయత్రీ సురేశ్ జంటగా నటించిన చిత్రం 'మాయగాడు'. అడ్డా మూవీ ఫేమ్ జీ.ఎస్. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చిత్ర ట్రైలర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కాగా.. అందాల రాక్షసితో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత సినిమాల్లో నటించారు. ఇటీవలే బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. మరోవైపు నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గాయత్రీ సురేశ్. ఈ సినిమా ట్రైలర్ చూస్తే పైరసీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న లవ్ స్టోరీగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అభిమన్యు సింగ్, కబీర్ సింగ్, జయప్రకాష్ రెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు ఈ సినిమాలో నటించారు. -
శెభాష్ పోలీస్....
మాయగాడి నుంచి ఇద్దరు అమ్మాయిలను రక్షించిన పోలీసులు మారేడుపల్లి: మాయగాడి వలలో పడబోయిన ఇద్దరు అమ్మాయిలను కాపాడి మారేడుపల్లి పోలీసులు శెభాష్ అనిపించుకున్నారు. ఎస్.ఐ రవికుమార్ కథనం ప్రకారం... మెదక్ జిల్లా లోతట్ట గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు (16,17 ఏళ్లు) పేదకుటుంబానికి చెందిన వారు. నగరంలో ఉద్యోగం చేసుకుని జీవిద్దామని ఈనెల 27న సికింద్రాబాద్‌కు వచ్చారు. రెండ్రోజుల పాటు జేబీఎస్ పరిసరాల్లో తలదాచుకుని తమ గ్రామానికి తిరిగి వెళ్లారు. మళ్లీ ఈనెల 3న జేబీఎస్‌కు చేరుకున్న వారు అమాయకం అటూ, ఇటూ తిరుగుతుండగా జేబీఎస్ ప్రాంగణంలో కూల్‌డ్రింక్స్ అమ్ముతున్న ప్రశాంత్(30) గమనించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తాన ని నమ్మబలికాడు. వారిని ఆ రోజు రాత్రి జేబీఎస్ సమీపంలోని ఎగ్జిబిషన్ మైదానానికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తుండగా డ్యూటీలో ఉన్న పోలీసులు గమనించి ప్రశాంత్‌తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ను అరెస్టు చేసి అమ్మాయిలను బుధవారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సమయానికి స్పందించి ఇద్దరు అమ్మాయిల జీవితాలను కాపాడినందుకు స్థానికులు పోలీసుల మెచ్చుకున్నారు. అమ్మాయిలు ఈ విధంగా ఏమి తెలియకుండా ఉద్యోగాల కోసమని నగరానికి వచ్చి, మాయగాళ్ల వలలో పడొద్దని ఎస్ఐ రవికుమార్ సూచించారు.