‘దేశం’దుశ్శాసనం
సాంస్కృతిక రాజధాని’గా రాజమండ్రిని అభివర్ణిస్తుంటారు. అలాంటి నగర పాలనాధికారాన్ని దక్కించుకున్న తెలుగుదేశం వారు కనీస సంస్కారం లేకుండా పేట్రేగిపోయూరు. వారి అధికారమదం ముందు ప్రజాస్వామ్యం.. వరద గోదావరి వెల్లువలో గడ్డిపరకలా కొట్టుకుపోరుుంది. కౌన్సిల్ హాలు గోడలే సిగ్గుపడేలా వారి దూషణలపర్వం కొనసాగింది. ‘కుర్చీల’ వంకన వారు.. కుర్చీలే భీతిల్లి పరుగులు తీసేలా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కాగా దీనంతటికీ.. వందల కోట్లతో చేపట్టే పుష్కరపనుల్లో కౌన్సిల్ ప్రమేయం లేకుండా చేసి, లబ్ధి పొందాలన్న అధికారపక్ష నేత పన్నాగం ఉందని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బల్లగుద్ది చెపుతోంది.
సాక్షి, రాజమండ్రి : మేయర్ పంతం రజనీ శేషసారుు అధ్యక్షతన బుధవారం జరిగిన నగర పాలక మండలి సమావేశాన్ని అధికార తెలుగుదేశం సభ్యులు రణరంగంగా మార్చేశారు. ఓ పథకం ప్రకారం ప్రధాన ప్రతిపక్షం అయిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులపై దాడి కి దిగారు. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు. ఎన్నుకున్న ప్రజలు ఖిన్నులయ్యేలా వ్యవహరించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన వారి దాష్టీకం.. ఎందరో ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన స్థానిక పాలన చరిత్ర, గౌరవాలను చిన్నబుచ్చింది. వీరా మన నగరాన్ని పాలించే కార్పొరేటర్లు అంటూ నగరవాసులు ముక్కున వేలేసుకున్నారు. నగర పాలక సంస్థ ఏర్పడ్డ నాటి నుంచి కౌన్సిల్ హాలులోకి పోలీసులు ప్రవేశించినది లేదు. కానీ టీడీపీ సభ్యుల దౌర్జన్య కాండ పుణ్యమాని ప్రజా సమస్యలు చర్చించాల్సిన సమావేశ మందిరంలోకి పోలీసులు కాలిడక తప్పలేదు.
వారి దౌర్జన్యం ఇలా మొదలైంది..
గత నాలుగు కౌన్సిల్ సమావేశాల్లో సమావేశ మందిరంలో ఎడమ పక్కన ముందు వరుస నుంచి ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ సభ్యులు కూర్చున్నారు. బుధవారం నాటి సమావేశంలో వీరి సీట్లను టీడీపీ సభ్యులు ఆక్రమించి, లేవమని అడిగితే వాగ్వాదానికి దిగారు. ఉద్దేశ పూర్వకంగా వైఎస్సార్ సీపీ సభ్యులపై ముందు మాటల దాడికి దిగారు. దానిని దీటుగా తిప్పికొడుతున్న వైఎస్సార్ సీపీ సభ్యులపై ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం భౌతిక దాడులకు సిద్ధపడ్డారు. టీడీపీ సభ్యుడు పాలిక శ్రీను వైఎస్సార్ సీపీ సభ్యుని కాలర్ పట్టుకోవడం, టీడీపీ ఫ్లోర్ లీడర్ వర్రే శీనివాస్ కూడా దాడికి ముందుకు రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
ఈ ఆగడం వెనుక గోరంట్ల పన్నాగం..
రూ.కోట్లతో చేపట్టే పుష్కర పనులను కౌన్సిల్లో ఉంచకుండా ఏకపక్షంగా చేసుకుపోతున్న వైనంపై సభ దృష్టిని మళ్లించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పన్నిన పన్నాగం ప్రకారమే సమావేశంలో అధికారపక్ష సభ్యులు దాడులకు తెగబడ్డారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. సీనియర్ నేత అయి ఉండి కూడా టీడీపీ సభ్యుల ఆగడాలను గోరంట్ల అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా తాను కూడా వారితో చేరి పరిస్థితిని మరింత జటిలం చేశారు.
ప్రతిపక్షసభ్యులపై జరుగుతున్న దాడిని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తీవ్రంగా ఖండించారు. ఆదిరెడ్డి టీడీపీ సభ్యుల దాడిని వారించే ప్రయత్నం చేయగా గోరంట్ల సైతం ఎమ్మెల్సీ ఆదిరెడ్డిపై దాడికి సిద్ధమయ్యూరు. ఈ నేపథ్యంలో ఒకరినొకరు తోసుకునే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి మహోద్రిక్తంగా మారుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు.
మేయర్ మాటా బేఖాతర్
సభలో ఉద్రిక్తతను సడలించడానికి మేయర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీ సభ్యులు ఆమె ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ రెచ్చిపోయారు. తమకు ప్రోటోకాల్ లేదని, సభా మర్యాదలు తమకు వర్తించవని చేష్టల ద్వారా చాటి చెప్పారు. సంఖ్యా బలాన్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ షర్మిళారెడ్డి తీవ్రంగా ఖండించారు. కౌన్సిల్లో ఏర్పడ్డ ఈ పరిస్థితి ప్రజాభివృద్ధికి గొడ్డలి పెట్టు కాగలదని ఆవేదన వ్యక్తం చేశారు.
జనమే గుణపాఠం చెపుతారు..
సంఖ్యాబలం ఉంది కదా అని టీడీపీ సభ్యులు వీర్రవీగుతున్నారు. వారి అవినీతి చర్యలను సమర్థించుకోవడానికే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. వారి బలాన్ని ఎదిరించేందుకు మా ఎనిమిది మంది సభ్యులు చాలు. ఈ సభలో వారు కౌరవుల్లాంటి వారు. మావాళ్లు పాండవులు. వీరి దుశ్చర్యలను తిప్పి కొట్టడం మాకు ఏ మంత కష్టం కాదు. టీడీపీ అవినీతి, ఆగడాలను అదుపు చేస్తాం, ప్రజా కోర్టులో ఎండగడతాం. ప్రజలే వీళ్లకి తగిన గుణపాఠం చెబుతారు.
- ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ
అవినీతి బయటపడుతుందన్న భయంతోనే..
కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిని సాక్ష్యాధారాలతో వెలికి తీస్తున్నామన్న భయంతో, కుట్రపూరితంగానే టీడీపీ సభ్యులు మాపై దాడికి తెగబడ్డారు. అవినీతిపై సమాధానం చెప్పాల్సి వస్తుంనే గిల్లి కజ్ఞాలు పెట్టుకుంటున్నారు. అయినా మేం వదిలే ప్రసక్తి లేదు. వారి చర్యలను తిప్పి కొడతాం. నగరపాలక సంస్థలో అవినీతిని మూలాలతో సహా వెలికి తీసి చూపిస్తాం.
-మేడపాటి షర్మిళారెడ్డి, వైస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్