Mayor tank Sridhar
-
టార్గెట్ మేయర్
టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెంట్రల్ ఎమ్మెల్యే వద్ద కార్పొరేటర్ల పంచాయితీ సీఎంను కలిసేందుకు సన్నాహాలు చిచ్చుపెట్టిన లే అవుట్ విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మేయర్ కోనేరు శ్రీధర్ వైఖరిపై ఆ పార్టీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వద్ద పంచాయితీ పెట్టారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కౌన్సిల్లో మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కోటరీలోని కార్పొరేటర్లకు మాత్రమే ఆర్థిక లబ్ధిచేకూరుస్తున్నారన్నది అసమ్మతి కార్పొరేటర్ల ప్రధాన ఆరోపణలు. సెంట్రల్ నియోజక వర్గం కేంద్రంగా రాజుకున్న ఈ అసంతృప్తి అగ్గిని ఆసరాగా తీసుకొని మేయర్ చైర్‌కు ఎసరు పెట్టేందుకు అసమ్మతి వర్గం చురుగ్గా పావులు కదుపుతోందని సమాచారం. ఏమైందంటే.. కనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన 12.96 ఎకరాల భూమిని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకొని లే అవుట్ రిలీజ్ చేయాల్సిందిగా సొసైటీ సభ్యులు కోరారు. 1994 నుంచి ఈ ఫైల్ ఉడాలో పెండింగ్ ఉంది. నాటి నిబంధనల ప్రకారం 12.5344 (10శాతం) లే అవుట్ వదలాల్సి ఉండగా 1,088 సంట్లు (8.68శాతం) మాత్రమే వదిలారు. లే అవుట్ స్థలం తక్కువ వదలడంతో ఉడా ఫైల్ పెండింగ్ పెట్టింది. ఉడా రద్దయ్యి సీఆర్డీఏ ఏర్పడటంతో ఆ ఫైల్ కార్పొరేషన్‌కు చేరింది. సీఆర్డీఏ తాజా నిబంధనల ప్రకారం 14 శాతం లే అవుట్ ఓపెన్‌స్పేస్ వదలాలని తెలుస్తోంది. 8.68 శాతం మాత్రమే స్థలం ఉన్నప్పటికీ లే అవుట్ రిలీజ్‌కు కౌన్సిల్ ఆమోదముద్ర వేయడం వివాదాస్పదమైంది. హైడ్రామా ఈ నెల 9న కౌన్సిల్ జరిగింది. దీనిపై ముందురోజు కేశినేని భవన్లో కార్పొరేటర్లతో మేయర్ సమావేశం నిర్వహించారు. అందులో ఈ విషయంపై ఎలాంటి చర్చరాలేదు. సాయంత్రం 6 గంటల వరకు ఈ అంశం కౌన్సిల్ వద్దకు రాలేదు. 93 అంశాలపై చర్చించిన మేయర్ పది నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా అంటూ బయటకు వెళ్లారు. ఆ తరువాత అదనపు అంశం 108/109గా దీన్ని చేర్చారు. ఇందులో ఏదో తేడా జరుగుతోందని పసిగట్టిన కొందరు టీడీపీ కార్పొరేటర్లు వాయిదా వేయాల్సింగా కోరారు. ఇందులో ఏం తేడా లేదని సర్దిచెప్పి హడావుడిగా ఆమోదించేశారు. 21 సంవత్సరాలు ఉడాలో పెండింగ్ఉన్న ఫైల్‌పై ఇరవై నిమిషాలు కూడా చర్చ జరక్కుండా ఆమోదించడం ఏమిటన్నది కొందరు టీడీపీ కార్పొరేటర్ల ప్రశ్న. కోట్ల రూపాయలు చేతులు మారడం వల్లే తీర్మానం చేశారని టీడీపీ కార్పొరేటర్ ఒకరు ‘సాక్షి’ వద్ద ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిలాపాపం.. తలా పిడికెడు తిలాపాపం తలా పిడికెడు చందంగా ఇందులో టౌన్‌ప్లానింగ్ అధికారుల పాత్ర ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 14 శాతం లే అవుట్ ఓపెన్ స్పేస్‌కు గాను 8.68 శాతం మాత్రమే సొసైటీ వదలింది. మిగిలిన స్థలం మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తం మినహాయింపు ఇవ్వడం వెనుక అమ్యామ్యాల కథ నడిచినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎన్జీవో మాజీ నేత ఒకరు చక్రం తిప్పినట్లు భోగట్టా. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద లేఅవుట్ రిలీజ్ వ్యవహారంలో టీడీపీలో చిచ్చుపెట్టింది. హడావుడిగా తీర్మానం ఎందుకు? విజయవాడ సెంట్రల్ : ‘కౌన్సిల్లో హడావుడిగా తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇందులో ఏదో తేడా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిల్‌ను అప్రదిష్టపాలు చేశారు’ అంటూ సెంట్రల్ నియోజక వర్గ టీడీపీ కార్పొరేటర్లు మేయర్ కోనేరు శ్రీధర్‌తో వాదనకు దిగారు. దీంతో ఆయన అవాక్కయ్యారు. బుధవారం రాత్రి చాంబర్లో మేయర్‌ను కలిసిన పలువురు మహిళా కార్పొరేటర్లు కనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్‌బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ రిలీజ్‌కు సంబంధించి చేసిన తీర్మానంపైప్రశ్నించారు. కౌన్సిల్లో ఏం జరుగుతోందో తెలియకుండా తీర్మానం చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. ఈ వ్యవహారంపై తమకు అవగాహన లేదని, ఆఖరి నిమిషంలో పెట్టి తీర్మానం చేశారని పేర్కొన్నారు. దీనివల్ల పార్టీ ప్రతిష్టదెబ్బతిందని, వెంటనే తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము అధిష్టానం వద్దే తేల్చుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. మేయర్ వర్గానికి చెందిన కొందరు కార్పొరేటర్లు సర్దిచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చాంబర్లో పెద్దగా అరుపులు వినిపించడంతో అక్కడున్న సిబ్బంది విస్మయం వ్యక్తంచేశారు. -
డూడూ బసవన్నలు అనుకుంటున్నారా..!
గ‘లీజు’ నిర్ణయాలు మంచిది కాదు అంతా మీరే చేస్తే మేం ఎందుకు? కార్పొరేషన్ అధికారులకు మేయర్ క్లాస్ వాడీవేడిగా స్టాండింగ్ కమిటీ సమావేశం విజయవాడ సెంట్రల్ : ‘ప్రజాప్రతినిధులను డూడూ బసవన్నలు చేయొద్దు. నిర్ణయాలన్నీ మీరే తీసుకుంటే మేం ఎందుకు? లీజుల విషయంలో కమిషనర్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరేం చేద్దామనుకుంటున్నారో మాతో చెప్పండి. చర్చిద్దాం..’ అంటూ మేయర్ కోనేరు శ్రీధర్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశం శనివారం స్టాండింగ్ కమిటీ హాల్లో మేయర్ అధ్యక్షతన జరిగింది. నగరంలోని కల్యాణ మండపాలు, పార్కింగ్ లీజులపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాజధాని నేపథ్యంలో ప్రయివేటు షాపుల అద్దెలు అనూహ్యంగా పెరుగుతున్నాయని, కార్పొరేషన్ ఆస్తులకు సంబంధించి మాత్రం 33.5 శాతం మొక్కుబడిగా పెంచి చేతులు దులుపుకోవడం సరైన విధానం కాదన్నారు. ఓపెన్ టెండర్ పిలిస్తే ఎంత మొత్తం వస్తుందో తేలుతోందని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ పార్కు వద్ద పార్కింగ్ స్థలం లీజును ఏడాదికి రూ.4.10 లక్షలకు ఇవ్వడంపై మేయర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. లీజుల్ని ఇష్టారాజ్యంగా ఖరారు చేయడం సరికాదని ఎస్టేట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదుగురితో కమిటీ షాపుల లీజులకు సంబంధించి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసుకునేందుకు చీఫ్ ఇంజినీర్, సిటీప్లానర్తో పాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటుచేయాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీ ధరను సూచించిన తరువాతే టెండర్లు పిలిచి రింగ్ కాకుండా పారదర్శకంగా నిర్వహించాలని సభ్యులు సూచించారు. లీజు పూర్తయ్యే నెలరోజుల ముందు ఆ విషయాన్ని స్టాండింగ్ కమిటీ దృష్టికి తేవాల్సిందిగా మేయర్ ఆదేశించారు. గడువు పూర్తయ్యాక హడావుడిగా టెండర్లు పిలిచి లీజులు కేటాయిస్తున్నారని, అంతా అయ్యాక స్టాండింగ్ కమిటీకి పెట్టి ఏం ప్రయోజనమని నిలదీశారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. కాంట్రాక్ట్ మూడు నెలలే.. నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు, వెహికిల్ డిపోలో పనిచేస్తున్న మెకానిక్‌లు, హెల్పర్ల కాంట్రాక్ట్ కాలపరిమితిని మూడు నెలలు పాటు మాత్రమే పెంచేందుకు స్థాయీ సంఘం ఆమోదించింది. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థుల్ని అప్రంటీస్ విధానంలో నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు సీనియర్లు కావడంతో జీతాలు చాలడం లేదని ఆందోళనలు చేస్తున్నారని, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జీతాలు పెంచే అవకాశం లేదు కాబట్టి విద్యార్థుల్ని అప్రంటీస్ పద్ధతిపై నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్‌తో మాట్లాడే బాధ్యతను కమిషనర్, సీఈలకు అప్పగించారు. డ్రెయినేజీ, వాటర్ వర్క్స్‌లో కాంట్రాక్ట్ కార్మికుల్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. -
కాంగ్రెస్ దొంగల పార్టీ
ధ్వజమెత్తిన మేయర్ శ్రీధర్ విజయవాడ సెంట్రల్ : కాంగ్రెస్ ఓ దొంగల పార్టీ అని, దొంగలకు కొమ్ముకాసేందుకే ధర్నా చేస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని మేయర్ కోనేరు శ్రీధర్ ధ్వజమెత్తారు. కార్పొరేషన్ చాంబరులో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. నగరపాలక సంస్థను లూటీ చేసిన కాంగ్రెస్ నాయకులు పన్ను భారాల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సమగ్ర సర్వేను తప్పుబడుతూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధర్నా చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. నగరపాలక సంస్థ ఆదాయ, వ్యయాలను తెలియజేస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. 010 పద్దు కింద జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే విష్ణులు ఉద్యోగుల్ని దగా చేశారన్నారు. కమిషన్ల కోసం అవసరం లేకున్నా వాహనాలను కొనుగోలు చేశారన్నారు. కార్పొరేషన్ పాలక మండలి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.180 కోట్లు నిధులు తీసుకువచ్చినట్లు వివరించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల జీతాలు చెల్లించడంతో పాటు, కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు పాల్గొన్నారు. -
టార్గెట్ మేయర్!
శ్రీధర్‌పై టీడీపీ పెద్దల గుర్రు అత్యవసర సమావేశంలో ‘క్లాస్’ కుర్చీ లాగేసేందుకు కుట్ర? పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మేయర్ కోనేరు శ్రీధర్‌కు ఇంటా బయటా ముచ్చెమటలు పడుతున్నారుు. అసలే కార్పొరేషన్ ఉద్యోగులతో ఘర్షణకు దిగి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోరుున ఆయనపై తాజాగా సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు భారీగానే విమర్శలు గుప్పించినట్టు తెలిసింది. ఇటీవల ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించి మేయర్‌కు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఏకపక్షం కుదరదని, ఏదైనా కలిసే నిర్ణయం తీసుకోవాలని పలువురు పార్టీ పెద్దలు ఆయనకు సూచించారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మేయర్‌ని టార్గెట్ చేసి ఆయన కుర్చీకి ఎర్త్ పెట్టే కుట్ర నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ వ్యవహారాలు టీడీపీలో గుబులు రేపుతున్నాయి. మేయర్ శ్రీధర్ అనుకూల, వ్యతిరేక వర్గాల కీచులాటల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని హైకమాండ్ గుర్తించింది. ఈ క్రమంలో ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కార్యాలయంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి నాగుల్‌మీరా, నగర కన్వీనర్ బుద్దా వెంకన్నలు మేయర్, డెప్యూటీ మేయర్లతో ఇటీవల అత్యవసర సమావేశం నిర్వహించారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. కౌన్సిల్లో ప్రతిపక్ష సభ్యుల మాదిరిగా తమతో వ్యవహరిస్తున్నారని, ముఖ్యమైన విషయాలపై సమగ్రంగా మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఒక కార్పొరేటర్ పేర్కొన్నట్లు తెలిసింది. 200 పైచిలుకు అంశాలతో అజెండా రూపొందించి రెండు రోజుల్లో హడావుడిగా కౌన్సిల్ సమావే శాలు ముగించాలనుకోవడం వల్లే అప్రదిష్టపాలవుతున్నామని మరో కార్పొరేటర్ గట్టిగానే నిలదీశారని సమాచారం. ‘అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. అధికారులతో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నింటినీ వివాదాలుగా మార్చడం మంచిది కాదు. వీటిని ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.’ అని పలువురు సభ్యులు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తే కుదరదు ‘పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రజలు మనల్ని నమ్మి అధికారం ఇస్తే గ్రూపు రాజకీయాలతో కీచులాడుకోవడం మంచిది కాదు.’ అని ఎమ్మెల్యేలు మందలించినట్లు తెలుస్తోంది. దర్గా భూముల తీర్మానంలో మార్పు, ఇటీవల అధికారులతో వివాదాల విషయూల్లో మేయర్ తీరును ఒక ఎమ్మెల్యే తప్పుబట్టారని సమాచారం. కార్పొరేషన్ వ్యవహారాలకు సంబంధించి పార్టీలో అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందామని గతంలో అనుకున్నప్పటికీ అలా ఎందుకు జరగడం లేదని పలువురు పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఇకపై ఏక పక్షంగా వ్యవహరిద్దామనుకుంటే కుదరదని, ఇలా అయితే నిండా మునిగిపోతామని, సమష్టిగానే నిర్ణయూలు తీసుకుందామని ఓ ఎమ్మెల్యే చెప్పినట్టు పార్టీశ్రేణుల ద్వారా తెలిసింది. మేయర్‌పై వ్యతిరేకత.. అనూహ్యంగా మేయర్ పదవి దక్కించుకున్న కోనేరు శ్రీధర్‌కు పార్టీలో వ్యతిరేకవర్గం గట్టిగానే ఉంది. నగరపాలక సంస్థ వ్యవహారాల్లో ఒక ఎమ్మెల్యే జోక్యాన్ని మేయర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టినట్టు సమాచారం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను అంతర్గత బదిలీలు చేయాలని ఇరవై రోజుల కిందట మునిసిపల్ కమిషనర్ హరికిరణ్ నిర్ణయించారు. అధికారులు ఫైల్ కూడా సిద్ధం చేశారు. బదిలీలకు సంబంధించి మేయర్ ఒక నివేదిక ఇవ్వగా, ఎమ్మెల్యే మరో జాబితా ఇచ్చినట్లు తెలిసింది. నగరపాలక సంస్థ వ్యవహారాలకు సంబంధించి మేయర్ సిఫారసులకే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు కమిషనర్‌కు చెప్పారని, దీన్ని దృష్టిలో పెట్టుకున్న సదరు ఎమ్మెల్యే ఈ సమావేశంలో మేయర్‌ను టార్గెట్ చేశారని వినికిడి. కాగా, పలువురు కార్పొరేటర్లు తరచూ రహస్య సమావేశాలు నిర్వహించి మేయర్ వైఖరి, భవిష్యత్ వ్యూహాలపై వాడివేడిగా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలే భేటీ నిర్వహించడంతో తమ ఆక్రోశాన్ని మొత్తం వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.