హిల్ కౌంటీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు రద్దు
* హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: మేటాస్ హిల్ కౌంటీ అపార్ట్మెంట్లకు నిజాంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి జారీచేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
హిల్ కౌంటీ అపార్ట్మెంట్లకు హెచ్ఎండీఏ ఇవ్వాల్సిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను.. నిజాంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చారని, అలాంటి అధికారం అతనికి లేదంటూ శ్రీనివాస్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ రామచంద్రరావు పంచాయతీ కార్యదర్శి జారీచేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.