'అదంతా దేవుడి లీల'
మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో జరిగిన ప్రమాదం 'దేవుడి లీల' అని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ ఒకరు వ్యాఖ్యానించారు. సాంకేతిక లోపంతో ఈ దుర్ఘటన జరగలేదని పేర్కొన్నారు.
'తామే అత్యంత శక్తివంతుమని మనుషులు అతిగా ఊహించుకోవడం వల్లే ప్రమాదం జరిగింది. ఇదంతా దేవుడి లీల. నాకు తెలిసినంతవరకు మానవ తప్పిందం వల్ల ఈ దుర్ఘటన జరగలేద' ని సౌదీ బిన్ లాడెన్ నిర్మాణ సంస్థకు చెందిన ఇంజనీర్ వ్యాఖ్యానించారు. అయితే అతడి పేరు వెల్లడించలేదు. ప్రమాదానికి కారణమైన భారీ క్రేన్ ను నాలుగేళ్లుగా ఇతర ప్రాజెక్టుల్లో వినియోగించినా ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలి 107 మంది మృతి చెందగా, 238 మంది గాయపడ్డారు.