Medical Agencies
-
పల్లెపల్లెకూ ఫార్మసీ స్టోర్!
న్యూఢిల్లీ: మారిన జీవనశైలి, ఆహార నియమాలతో పట్టణం, పల్లె అని వ్యత్యాసం లేకుండా ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. దీనికితోడు వైద్య వసతులు పెరగడంతో పల్లెల్లోనూ ఔషధ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో ఫార్మసీ స్టోర్లు జోరుగా తెరుచుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఏర్పడిన అవగాహన సైతం ఔషధ వినియోగాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం, ఏటా మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో ఫార్మాసిస్టులు రావడం కూడా ఔషధ దుకాణాల సంఖ్య విస్తరణకు మద్దతుగా ఉంటున్నాయి. ఏటా 4,50,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంటే, ఇందులో 40,000–45,000 వరకు సొంతంగా దుకాణాలను తెరుస్తున్నట్టు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ తెలిపారు. దేశంలో 12 లక్షల మంది ఫార్మాసిస్టులకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘‘ఫార్మాసిస్టులు పల్లె బాట పడుతున్నారు. కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు కనీసం 1,000–2,000 మంది జనాభా ఉన్న ప్రతి ఊరులోనూ ఫార్మసీ స్టోర్ ఉంది’’అని సింఘాల్ వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు తమ ఆరోగ్య సమస్యల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారని, క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం పల్లెలు, చిన్న పట్టణాల్లో ఔషధ విక్రయాలు పెరగానికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కీలకంగా పనిచేస్తోంది. ఈ పథకం కింద 26,055 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 4.3 కోట్ల మంది చేరి వైద్యం పొందినట్టు 2022–23 ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,54,070 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రిస్కిప్షన్‌ను జారీ చేస్తే ఔషధాలను ప్రభుత్వ చానళ్ల ద్వారా లేదంటే ప్రైవేటు ఫార్మసీ స్టోర్లలో కొనుగోలు చేసుకుంటున్నట్టు సింఘాల్ తెలిపారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనూ ఔషధాలకు డిమాండ్ ఏర్పడినట్టు చెప్పారు. భారత ఫార్మా మార్కెట్లో టైర్–2 నుంచి టైర్–6 వరకు పట్టణాల వాటా 21 శాతంగా ఉంటుందని అంచనా. ఔషధాలకు డిమాండ్ ఏర్పడడంతో ఫార్మసీ కంపెనీలు సైతం మార్కెటింగ్ సిబ్బందిని చిన్న పట్టణాల్లోనూ మోహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పెంచుకుంటున్నాయి. తమకున్న విస్తృత నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటు ధరలకే నాణ్యమైన ఔషధాలను అందిస్తున్నట్టు సన్‌ఫార్మా ప్రతినిధి తెలిపారు. ‘‘నేను దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజలు, మా కంపెనీ స్టాకిస్టులు, అమ్మకాల సిబ్బందితో మాట్లాడాను. రహదారులు, ఆస్పత్రులు, విద్యుత్ తదితర సదుపాయాల విస్తరణతో ప్రజలు తమ స్వస్థలాల్లోనే ఉండాలనుకుంటున్నారు. మెట్రో పట్టణాలకు రావాలని అనుకోవడం లేదు. కరోనా తర్వాత సొంత గ్రామాల్లోనే ఉండాలన్నది వారి అభీష్టంగా ఉంది’’అని మ్యాన్ కైండ్ ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ రాజీవ్ జునేజా వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం సైతం అమ్మకాలు పెరగడానికి తోడ్పడుతున్నట్టు తెలిపారు. చిన్న పట్టణాల్లోనూ వైద్యుల అందుబాటు పెరిగినట్టు ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కృష్ణకుమార్ పేర్కొన్నారు. ‘‘మాకు 140 పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఉన్నాయి. ఒక్కోటీ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఈ పాయింట్లను 300కు పెంచుతున్నాం. దేశంలో 85 శాతం ప్రాంతాలను చురుకోగలం’’అని వివరించారు. -
ఫేక్ మెయిల్‌తో రూ.46లక్షల లూటీ
హైదరాబాద్: నగరానికి చెందిన మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ వాళ్లకు సైబర్ నేరగాళ్లు భారీ వల వేశారు. సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్‌ను చూసిన ఇక్కడి మెడికల్ ఏజెన్సీ వాళ్లు ఏ మాత్రం ఆలోచించకుండా లక్షల రూపాయిలు అప్పగించేశారు. అసలైన కంపెనీ వాళ్లు మీ డబ్బు రాలేదనే వరకు తాము మోసపోయామని తేరుకుని సిటీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సంతోష్‌నగర్‌లోని ‘సెన్స్‌కోర్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్’ మెడికల్ ఏజెన్సీ(షాప్) వాళ్లు కాలిఫోర్నియోలోని ‘ఏజీ సైంటిఫిక్’ కంపెనీతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఏడాదిలో మూడు పర్యాయాలు ‘ఏజీ సైంటిఫిక్’ నుంచి మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ను ఇక్కడి వాళ్లు కొనగోలు చేస్తుంటారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఏర్పడటంతో.. ‘ఏజీ సైంటిఫిక్’వారిని సంప్రదించారు. అదేవిధంగా “ఏజీ సైంటిఫిక్’ వాళ్లు బ్యాంక్ ఖాతా ప్రతి మూడు నెలలకు మారుస్తుంటారు. దీనిని గమనించిన సైబర్ నేరగాళ్లు పరకాయ ప్రవేశం చేశారు. ‘ఏజీ సైంటిఫిక్’ కంపెనీలో ‘ఐ’ అనే లెటర్ తీసేసి ఫేక్ మెయిల్ సృష్టించారు. ఫేక్ మెయిల్‌తో రూ.46లక్షలకు కొటేషన్‌ను పంపి బ్యాంక్ అకౌంట్‌ను కూడా పొందుపరిచారు. బ్యాంక్ అకౌంట్లను వాళ్లు మారుస్తుంటారు కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్లు అడిగిన రూ.46లక్షలకు ఆయా అకౌంట్లకు పంపారు. ఇదంతా గత ఏడాది సెప్టెంబర్ మాసంలో జరిగింది. తాజాగా రెండు రోజుల క్రితం కాలిఫోర్నియో కంపెనీ ‘ఏజీ సైంటిఫిక్’ వాళ్లు మీ డబ్బులు రాలేదు, డబ్బు పంపితే ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తామన్నారు. తాము సెప్టెంబర్‌లోనే పంపామని అకౌంట్ నంబర్‌ను, మెయిల్ ఐడీలను వాళ్లకు చెప్పగా..ఇవేవీ తమవి కాదని తేల్చారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ఇక్కడి ఏజెన్సీ యజమాని వరప్రసాద్ సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘కోవిడ్-19 ఏపీ ఫార్మసీ’ యాప్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా( కోవిడ్-19) వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించి శనివారం విడుదల చేసినట్లు తెలిపింది. జ్వరం, దగ్గు, శ్వాస వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్‌లో పొందుపర్చాలని మెడికల్ షాపు యజమాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది. ఇక మెడికల్ షాపుల యజమానులు తమ మొబైల్ నంబర్ ద్వారా ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వాలని పేర్కొంది. లాగిన్ అయ్యాక మొబైల్ నంబర్ లేదా మెడికల్ షాపు ఐడీ నంబర్ ఎంటర్ చేయాలని ఆరోగ్య శాఖ తెలిపింది. (హెయిర్ కట్కు వెళ్లి కరోనా తెచ్చుకున్నారు) గూగుల్ ప్లే స్టోర్ నుంచి Covid 19 AP Pharma యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆరోగ్య శాఖ కోరింది. కోవిడ్-19పై పోరాటంలో మెడికల్ షాపుల యజమానులు ప్రభుత్వానికి సహకరించాని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. ఇక గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దూసుకువెళుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. (అందుకే ఆ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి: కలెక్టర్ ఇంతియాజ్) -
నకిలీ మందుల మాయగాళ్లు!
జిల్లాలో నకిలీ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు వైద్యులు కాసుల కక్కుర్తితో, విదేశీ పర్యటనలపై మోజుతో నాసిరకం మందులను రోగులకు రాసిస్తున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని, ఇతర పట్టణాల్లో ఈ దందా కొనసాగుతోంది. కొన్ని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు కూడా నకిలీ మందులతో జీరో బిజినెస్ చేస్తున్నారు. దీనివల్ల ఒకవైపు రోగులకు నష్టం జరగడంతో పాటు మరో వైపు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. సాక్షి , కర్నూలు : రాయలసీమలో అత్యధికంగా మెడికల్ ఏజెన్సీలు ఉన్న ప్రాంతం కర్నూలు జిల్లా. ఇందులో కొన్ని ఏజెన్సీలు నకిలీ ఔషధ దందా సాగిస్తున్నాయి. కాంట్రాక్టు బేసిస్ మెడిసిన్ పేరుతో ఈ దందా సాగుతోంది. ఏజెన్సీలతో పాటు మందుల తయారీ కంపెనీలు కొన్ని నేరుగా వైద్యులతో సంబంధాలు పెట్టుకుని, వారు నడుపుతున్న ఆస్పత్రులకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నాయి. వీటికి ఎలాంటి బిల్లులు ఉండవు. మరికొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల నకిలీ మందులనే రాసిస్తున్నారు. ప్రతి ఫలంగా భారీ పర్సెంటేజీలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం డ్రగ్ కంట్రోల్ అధికారులకు తెలిసినా కాసుల కక్కుర్తితో దుకాణాలపై దాడులు చేయడం లేదు. భారీ నజరానాలు కాంట్రాక్ట్ బేసిస్ మందులు సిఫారసు చేసినందుకు డాక్టర్లకు కంపెనీ ప్రతినిధులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.లక్ష వరకూ ముట్టజెబుతున్నారు. అలాగే ఖరీదైన బహుమతులు అందజేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు థాయ్‌లాండ్, దుబాయ్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి విదేశీ పర్యటనలకు పంపుతున్నారు. అలాగే దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో సమావేశాల పేరుతో స్టార్ హోటళ్లలో విందులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యుల అండ కోసం కంపెనీలు ఇంత భారీగా వ్యయం చేస్తున్నాయంటే వారికి ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అవసరార్థం వచ్చే రోగుల నుంచి మెడికల్ కంపెనీలు అడ్డగోలుగా దండుకున్న సొమ్మునే ఇలా ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతోంది. సంగారెడ్డి, మెదక్ నుంచి సరఫరా నకిలీ మందులు ఎక్కువగా సంగారెడ్డి, మెదక్ కేంద్రంగా కర్నూలు జిల్లాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో డ్రగ్స్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో నకిలీ మందులు తయారు చేసి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మందులు వాడటం వల్ల రోగులకు కొత్తగా ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు. ఆరోగ్యానికి హానికరం కాని పౌడర్లను ఉపయోగించి తయారుచేస్తుండడమే ఇందుకు కారణం. ఈ నకిలీ మందుల తయారీకి అయ్యే ఖర్చు తక్కువ. కానీ ఎమ్మార్పీ మాత్రం భారీగా ఉంటుంది. ఈ మందులు వాడితే రోగికి ఉన్న జబ్బు నయం కాదు. పైగా మరింత ముదిరి రోగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. నకిలీ మందులు ఇవిగో.. నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్ మందు స్థానంలో ‘ఎ...ఆ...’అనే రెండురకాల కంపెనీల పేర్లతో ఉన్న మందులు అంటగడుతున్నారు. జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్‌న్‌స్థానంలో ఓ..సె.., ఆ.. పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాప్రిజోల్ స్థానంలో ‘ ఫా’ పేరుతో ఉండే మరో మూడు రకాల నకిలీ మందులను రాసిస్తున్నారు. ఇలా చాలా రకాల నకిలీ మందులు మెడికల్ స్టోర్ల నుంచి రోగులకు చేరుతున్నాయి. వీటిపై లాభాల శాతం అధికంగా ఉంటోంది. దీంతో మందుల దుకాణ యజమానులు భారీగా దండుకుంటున్నారు. ఇందులో కొంత పర్సెంటేజీ వైద్యులకు ముట్టజెప్పుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేసిన వారు ఆస్పత్రి కరెంటు బిల్లు, ఇతర ఖర్చులను కూడా భరిస్తున్నారు. రుగ్మతలతో డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను డాక్టర్లు, మెడికల్స్టోర్ నిర్వాహకులు కలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రం చర్యలు తీసుకోకుండా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. -
వారి ఆశయూనికిసలామ్
, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన ఆరుగురు, బీఫార్మసీ విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు అంతా కలిపి మొత్తం 12 మంది సిబ్బందితో ఆశ్రమం ఆవరణలో పది పడకల ఆస్పత్రిగా వైద్య సేవలు ప్రారంభించనున్నారు. పీజీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఆస్పత్రి రోజువారీ కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. సేవలు ఇలా వైద్య సేవలు అంటే రోగం వచ్చిన తర్వాత మందుబిళ్ల, సూదిమందు ఇవ్వడం వంటి సాధరణ సేవలకే పరిమితం కావడం లేదు. రోగాలకు మూల కారణాలను వెతికి పట్టుకుని వాటికి సైతం మందు వేసేలా పక్కాగా వైద్య సేవలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా సేవలను మూడు రకాలుగా విభజించారు. ప్రతీరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య ఆస్పత్రి పనిచేస్తుంది. ఈ సమయంలో వచ్చే రోగులను పరీక్షించి వైద్య సహాయం (ఓపీ) అందిస్తారు. ఆ తర్వాత వివిధ రోగాలకు సంబంధించిన వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. దీనితో పాటు ఫిజియోథెరపీకి సంబంధించిన వ్యాయామాలు చేయిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చుట్టు పక్కల గ్రామాలకు (ఫీల్డ్ విజిట్) వెళ్తారు. ఇలా వెళ్లిన సమయంలో అక్కడి ప్రజల ఆరోగ్య స్థితి గతులను అడిగి తె లుసుకుంటారు. అంతేకాకుండా గ్రామాల్లో పరిశుభ్రత, అంటువ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణ- పచ్చదనంపై అవగాహాన వంటి కార్యక్రమాలను చేపడతారు. వీటిలో ఓపీ, ఫీల్డ్ విజిట్ కార్యక్రమాల వేళలు రోజు విడిచి రోజు ఉదయం నుంచి సాయంత్రానికి, సాయంత్రం నుంచి ఉదయానికి మారుతాయి. వివిధ మెడికల్ ఏజెన్సీలు, ఎన్జీవోలు, ఔషధ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఉచితంగా ట్యాబెట్లు, టానిక్‌లు, ఇంజక్షన్లు ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 60 పడకలకు విస్తరిస్తాం నవ ంబర్ 10న పది పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని ప్రారంభిస్తున్నాం. అదేరోజు 60 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తాం. ఈ భవనం పూర్తయ్యేలోపు మరికొంత మంది విద్యార్థులు అందుబాటులోకి వస్తారు. దానితో పూర్తిస్థాయిలో మా సేవలు సమాజానికి అందిస్తాం. పూర్తిగా దాతల సహాకారంతోనే ఈ భవన నిర్మాణం, ఫర్నిచర్ తదితర పనులు చేపడుతున్నాం - ఇన్నారెడ్డి, ప్రజాదరణ ఆశ్రమ నిర్వహకుడు