medical authority
-
వ్యాయామమే మంచి మందు
సాక్షి, అమరావతి: ప్రతి రోజూ అర గంటపాటు నడక, పరుగు, సైక్లింగ్, ఈత.. ఇలా ఏదో ఒకదాన్ని నిత్యకృత్యంగా చేసుకున్నవారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా వరకు వ్యాధులను దరి చేరకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి సైతం వ్యాయామాన్ని మించిన మందు లేదని వివరిస్తున్నారు. ఈ మేరకు అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. మందుల కంటే కూడా వ్యాయామంతోనే 1.5 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శారీరకంగా చురుకుగా ఉంటే విచారం, ఆందోళన, బాధ తదితరాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు సౌత్ ఆ్రస్టేలియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా 1.28 లక్షల మందిని పరిశీలించారు. ఆయా మానసిక సమస్యలను అధిగమించడానికి మందులు, కౌన్సెలింగ్ కంటే కూడా శారీరక శ్రమ చేస్తే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటోందని వెల్లడించారు. ఈ అధ్యయనం ఆధారంగా గుర్తించిన అంశాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో తాజాగా ప్రచురించారు. మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, నిరాశ, ఆందోళన, ఆత్మన్యూనతతో బాధపడేవారిని పరిశీలించారు. ఈ క్రమంలో శారీరక శ్రమ/వ్యాయామం చేసేవారిలో నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుముఖం పట్టాయని గుర్తించారు. తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్న గర్భిణులు, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వ్యాయామంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నట్టు స్పష్టమైంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్ల వ్యయం చేస్తున్నారు. ఈ వ్యయం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. మంచి హార్మోన్లు పెరుగుతాయి నడక, వ్యాయామం, పరుగు, ఏరోబిక్స్ వంటివాటితో శరీరానికి మంచి చేసే హార్మోన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని అడ్రినాలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించే ఎండారి్ఫన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటున్నారు. రోజూ అరగంట చేసినా మంచి ఫలితాలు.. ప్రస్తుతం అన్ని వయసులవారు తీవ్ర ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రోజూ కనీసం అరగంట పాటు నడక, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, ఏరోబిక్స్ వంటి వాటికి సమయం కేటాయించాలి. ఈ వ్యాయామం బీపీ, షుగర్, ఊబకాయం వంటివి రాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాలకు మేలు చేకూరుస్తుంది. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి దూరం కావచ్చు. – డాక్టర్ రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, విజయవాడ -
కేంద్ర నిధులపై దృష్టి సారించండి
వైద్యాధికారులకు మంత్రి లక్ష్మారెడ్డి దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రాయోజిత నిధు లపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదే శించారు. నిజాయితీ, నిబద్ధతతో పని చేయా లని సూచించారు. శనివారం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రం అనేక పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నదని, ఆ కార్య క్రమాల అమలు, నిధులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశీలించాలని ఆదేశిం చారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న పనులకు అదనంగా కేంద్ర నిధులు తోడైతే పేదలకు మరింత మెరుగైన, సమర్థ మైన సేవలు అందజేయొచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు ప్రసూతి కేంద్రాలను తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. కొత్తగా నిర్మించే ఆస్పత్రులు, దవాఖానాల అప్గ్రేడేషన్లలోనూ కనీసం 50 పడకలకు తగ్గకుం డా ప్రసూతికి కేటాయి స్తున్నామని తెలిపారు. అనవసర ఆపరేషన్లని నిరోధించాల్సిన అవస రం ఉందన్నారు. విధుల్లోకి ‘గాంధీ’ నర్సులు... గాంధీ ఆస్పత్రిలో గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న ఔట్సోర్సింగ్ నర్సులతో లక్ష్మారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలను సానుభూతితో పరిశీలి స్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళనను విరమించనున్నట్లు తెలి పారు. శనివారం లక్ష్మారెడ్డిని గాంధీ ఆస్పత్రి లో ఆందోళన చేస్తున్న నర్సులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక పద్ధతులు వేర్వేరని, అయినా సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
ప్రాణాలు తీస్తున్న రక్తహీనత
మహిళలకు మాతృత్వం దేవుడిచ్చిన గొప్ప వరం. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వారు మాతృత్వం కోసం పరి తపిస్తుంటారు. అమ్మతనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని ఆరాటపడుతారు. అలాంటి మాతృత్వం జిల్లా ఏజెన్సీలోని మహిళలకు శాపంగా మారుతోంది. గిరి సీమలో సరైన పోషకాహారం లభించక రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు మృత్యు ఒడికి చేరుతున్నారు. కొంతకాలంగా ఏజెన్సీలో ఎక్కడో ఓ చోట గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం లోపించి రక్తహీనతతో చనిపోతూనే ఉన్నారు. గత నెలలో సమస్యాత్మక మండలాల్లో ముగ్గురు బాలింతలు రక్తహీనతతో మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఉట్నూర్ : సాధారణంగా మనిషి శరీరంలో 14 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. 12 నుంచి 16 గ్రాముల వరకు ఉంటే ఆరోగ్యవంతులుగా భావిస్తారు. ఏజెన్సీలోని గర్భిణి, బాలింతల్లో 15 నుంచి 18 గ్రాముల వరకు, చిన్నారుల్లో 9 నుంచి 12 గ్రాముల వరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. దీనికితోడు ఏజెన్సీలోని బాలింతలు, గర్భిణుల్లో ఏడు గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ ఉంటోంది. ఏజెన్సీలోని పీహెచ్‌సీల పరిధిలో ఆగస్టు నెల వరకు 4,999 మంది గిరిజన గర్భిణులు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. వీరిలో 75 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్న వారే కావడం గమనార్హం. వీరికి సరైన పోషకాహారం దొరక్క పరిస్థితి ఇలా ఉంది. వీరిలో చాలామంది నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకోకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో చాలామందిలో రక్తహీనత సమస్య రావడంతో ప్రసవ సమయంలో రక్తస్రావం అధికమై చనిపోతున్నారు. శాపంగా పోషకాహారం లోపం.. ఏజెన్సీలో పోషకాహార లేమి గిరిజనుల పాలిట శాపంగా మారుతోంది. సరిపడా ఆహారం దొరక్క.. దొరికిన దాంట్లో పోషక విలువలు కొరవడడంతో శ రీరంలో హిమోగ్లోబిన్ శాతం వేగంగా తగ్గుతోంది. ఎర్ర రక్తకణాల సంఖ్య పడి పోతూ రక్తహీనతకు గురవుతున్నారు. రక్తహీనతను నివారించడానికి గర్భిణి, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఉట్నూర్‌లో 2008లో ఏర్పాటుచేసిన పోషక ఆహార పునరావాస కేంద్రం మూతపడింది. సమస్యాత్మక మండలాలైన నార్నూర్, జైనూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిర్పూర్(యు)లోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన 170 సంపూర్ణ గ్రామ ఆరోగ్య కేంద్రాల్లో సగానికి పైగా మూతపడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆశయం నీరుగారుతోంది. ఏజెన్సీలోని మహిళల మరణాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఆహార భద్రత కార్యక్రమం చేపట్టినా.. ఐటీడీఏ మధ్యలోనే చేతులెత్తేసింది. ఏజెన్సీలో 2007లో 35,402 గిరిజన కుటుంబాలు, 2008లో 28,217 కుటుంబాలు, 2009లో 11,667 కుటుంబాలు, 2011లో 13,269 కుటుంబాలకు ఈ పథకం ద్వారా పోషకాహారం అందించారు. తదుపరి నాలుగేళ్లుగా ఆ ఊసే లేదు. అవగాహన కరువు.. ఏజెన్సీలో మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి తీసుకోవాల్సిన పౌష్టికాహారం, జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన వైద్య సిబ్బంది ఆ దిశగా చర్యలు చేపట్ట డం లేదు. ఫలితంగా క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలకు వారు దూరంగా ఉంటున్నారు. ప్రసూతి సమయంలో ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే సాధారణ ప్రసూతి చేసుకోవాలని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భిణులుగా ఉన్న సమయంలో పేర్లు నమోదు చేసుకునే సిబ్బంది.. తర్వాత వారిని విస్మరిస్తున్నారు. ఏజెన్సీ వాసులు వైద్యం కోసం డివిజన్ కేం ద్రంలోని ఉట్నూర్‌లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. ప్రసూతి సమయంలో గర్భిణులను ఈ కేంద్రానికి తీసుకువద్దామంటే సీహెచ్‌సీలో రెండు గైనకాలజిస్టు పోస్టులు, అనస్థీషియా, ప్రిడియాస్ట్రీషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఐటీడీఏ ద్వారా నెలసరి వేతనం రూ.లక్షన్నర ఇస్తామని ప్రకటనలు ఇచ్చినా.. ఇక్కడ విధులు నిర్వర్తించేందుకు ఎవ రూ రా లేదు. దీంతో సీహెచ్‌సీలో గైనకాలజిస్టులు లేక ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కొందరు అక్కడికి వెళ్లలేక.. ఆర్థిక స్థోమతకు నోచుకోక ప్రాణాలు కోల్పోతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు మృతిచెందకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం అయ్యేలా అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వివరిస్తున్నాం. - ప్రభాకర్ రెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి గత నెలలో మృత్యువాత పడిన బాలింతలు.. - జైనూర్ మండలం పుల్లారాకు చెందిన ఆత్రం లలిత(48). నెలలు నిండడంతో నెల రోజుల ముందుగానే ప్రసవం కోసం తల్లిగారిళ్లు గూడమామడకు వచ్చింది. ఆగస్టు 17న పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఉట్నూర్ సీహెచ్‌సీకి ఆటోలో తరలిస్తుండగా రక్తహీనతకు తోడు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో తల్లి, పుట్టిన బిడ్డ మృతిచెందారు. - నార్నూర్ మండలం శివనారాకు చెందిన సిడాం రాంబాయి(22) గత నెల 25న రక్తహీనతతో మృతిచెందింది. 20 రోజుల క్రితం మగశిశువుకు జన్మనిచ్చిన రాంబాయి రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి తోడు జ్వరం రావడంతో గాదిగూడ పీహెచ్‌సీకి వైద్యం కోసం తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమించిందని.. రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. - కెరమెరి మండలం కోలాంగూడ(డి)కు చెందిన ఆత్రం మారుబాయి(25) గత నెల 21న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మరుసటి రోజు వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు. మూడు రోజులు చికిత్స పొంది మృతిచెందింది. రక్తహీనతతో బాధపడుతూ మృతి చెందిందని కుటుంబీకులు పెర్కొన్నారు. - వాంకిడి మండలం ఖిర్ది గ్రామానికి చెందిన ఈశ్వరిబాయి గత నెల 25న ఇంట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం జరగడంతో కొద్ది గంటల్లోనే మృత్యువాత పడింది.