కేంద్ర నిధులపై దృష్టి సారించండి | focus on central govt funds said : laxma reddy | Sakshi
Sakshi News home page

కేంద్ర నిధులపై దృష్టి సారించండి

Published Sun, Feb 5 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

కేంద్ర నిధులపై దృష్టి సారించండి

కేంద్ర నిధులపై దృష్టి సారించండి

వైద్యాధికారులకు మంత్రి లక్ష్మారెడ్డి దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రాయోజిత నిధు లపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదే శించారు. నిజాయితీ, నిబద్ధతతో పని చేయా లని సూచించారు. శనివారం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రం అనేక పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నదని, ఆ కార్య క్రమాల అమలు, నిధులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశీలించాలని ఆదేశిం చారు.

రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న పనులకు అదనంగా కేంద్ర నిధులు తోడైతే పేదలకు మరింత మెరుగైన, సమర్థ మైన సేవలు అందజేయొచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు ప్రసూతి కేంద్రాలను తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. కొత్తగా నిర్మించే ఆస్పత్రులు, దవాఖానాల అప్‌గ్రేడేషన్‌లలోనూ కనీసం 50 పడకలకు తగ్గకుం డా ప్రసూతికి కేటాయి స్తున్నామని తెలిపారు. అనవసర ఆపరేషన్లని నిరోధించాల్సిన అవస రం ఉందన్నారు.

విధుల్లోకి ‘గాంధీ’ నర్సులు...
గాంధీ ఆస్పత్రిలో గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ నర్సులతో లక్ష్మారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలను సానుభూతితో పరిశీలి స్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళనను విరమించనున్నట్లు తెలి పారు. శనివారం లక్ష్మారెడ్డిని గాంధీ ఆస్పత్రి లో ఆందోళన చేస్తున్న నర్సులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామక పద్ధతులు వేర్వేరని, అయినా సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Advertisement
Advertisement