meelo evaru koteswarudu
-
జూ.ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ ధరెంతో తెలుసా?
తమకు నచ్చిన హీరోల విషయంలో అభిమానులు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందు ఉంటారు. తమ హీరోలకు సంబందించిన ప్రతి అప్ డేట్స్ గురుంచి అందరికంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్టీఆర్ ఏమి చేసినా కూడా అభిమానుల ప్రతి క్షణం అనుసరిస్తూ ఉంటారు. గతంలో రాజమౌళి కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు దాదాపు రూ.25 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు. అలాగే, దర్శకుడు సుకుమార్ కూతురు వేడుకలో ఎన్టీఆర్ వేసుకున్న మాస్క్ గురించి ఆరా తీసి మరి అది యుఏ స్పోర్ట్స్ మాస్క్ అని అభిమానులు తెలిపారు. దాని ధర సుమారు రూ.2,340. ఎన్టీఆర్ ధరించిన మాస్క్ బ్రాండ్ కు సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన బ్లేజర్‌పై ఫ్యాన్స్ కన్ను పడింది. జెమిని టీవీలో వచ్చే "ఎవరో మీలో కోటీశ్వరులు" కార్యక్రమం కోసం ప్రోమోలో వేసుకున్న బ్లేజర్ గురుంచి చర్చ జరుగుతుంది. ఈ బ్లేజర్ ఖరీదు ఏకంగా 90 వేల రూపాయలు అని సమాచారం. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం మనీష్ మల్హోత్రానే క్యాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో -
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో గెలిచినదంతా..
ఎల్లారెడ్డి: ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో గెలుచుకున్న రూ.25 లక్షల్లోని రూ. 20 లక్షలను స్వచ్ఛంద సంస్థలపై ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రావణ శర్మ. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి కొన్నేళ్ల క్రితం వచ్చిన శర్మ ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిలో స్థిరపడ్డారు. శర్మ రిటైరయ్యాక పింఛన్‌గా వచ్చిన డబ్బులు అప్పులకు, గృహావసరాలకు ఖర్చుకాగా.. అయినవారు ఆదరించకపోవడంతో స్నేహితుల సహకారంతో ఇక్కడికి వచ్చి ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. తన ప్రతిభతో మా టీవీ ప్రసారం చేస్తున్న రియాల్టీ షోలో గతనెల 18న రూ.25 లక్షలను గెలుచుకున్నారు శర్మ. వచ్చిన మొత్తం నుంచి రూ. 10 లక్షలు హైదరాబాద్‌కు చెందిన నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ సంస్థ , మరో రూ. 10 లక్షలు శ్రీ విద్యా సెంటర్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ సంస్థపై డిపాజిట్ చేశారు. ఆయన బతికున్నంత వరకు బ్యాంకు వడ్డీ వస్తుంది. ఆయన మరణానంతర అసలు, వడ్డీ స్వచ్ఛంద సంస్థలకు వెళ్తుంది. వీటితోపాటు తాను కష్టాల్లో ఉన్న నాడు తనను మనిషిగా గుర్తించి సహాయం చేసిన ఒక మాతృమూర్తి పేరిట రూ. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.