జూ.ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ ధరెంతో తెలుసా? | Jr NTR Blazer price in Evaru Meelo Koteeswarulu going viral | Sakshi
Sakshi News home page

జూ.ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ ధరెంతో తెలుసా?

Apr 13 2021 6:55 PM | Updated on Apr 13 2021 9:20 PM

Jr NTR Blazer price in Evaru Meelo Koteeswarulu going viral - Sakshi

తమకు నచ్చిన హీరోల విషయంలో అభిమానులు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందు ఉంటారు. తమ హీరోలకు సంబందించిన ప్రతి అప్ డేట్స్ గురుంచి అందరికంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్టీఆర్ ఏమి చేసినా కూడా అభిమానుల ప్రతి క్షణం అనుసరిస్తూ ఉంటారు. గతంలో రాజమౌళి కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు దాదాపు రూ.25 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు.

అలాగే, దర్శకుడు సుకుమార్ కూతురు వేడుకలో ఎన్టీఆర్ వేసుకున్న మాస్క్ గురించి ఆరా తీసి మరి అది యుఏ స్పోర్ట్స్ మాస్క్ అని అభిమానులు తెలిపారు. దాని ధర సుమారు రూ.2,340. ఎన్టీఆర్ ధరించిన మాస్క్ బ్రాండ్ కు సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన బ్లేజర్‌పై ఫ్యాన్స్ కన్ను పడింది. జెమిని టీవీలో వచ్చే "ఎవరో మీలో కోటీశ్వరులు" కార్యక్రమం కోసం ప్రోమోలో వేసుకున్న బ్లేజర్ గురుంచి చర్చ జరుగుతుంది. ఈ బ్లేజర్ ఖరీదు ఏకంగా 90 వేల రూపాయలు అని సమాచారం. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం మనీష్ మల్హోత్రానే క్యాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

చదవండి: 

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement