meer usman ali khan
-
ఆ రోజుల్లో స్పానిష్ ఫ్లూ, ప్లేగ్ మహమ్మారి పంజా
సాక్షి, సిటీబ్యూరో: ప్లేగ్ పాస్‌పోర్టు.. ఇప్పుడు ఈ పదం వినడానికి కొద్దిగా ఆశ్చర్యంగానే అనిపించినా ఆ రోజుల్లో విదేశీయులు హైదరాబాద్‌లో కొంతకాలం ఉండాలంటే తప్పనిసరిగా ప్లేగ్ పాస్‌పోర్టు ఉండి తీరాల్సిందే. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ రోజుల్లో స్పానిష్ ఫ్లూ, ప్లేగ్ వంటి మహమ్మారులు ప్రజలను కబలిస్తున్నాయి. అలాంటి సమయంలో బ్రిటీష్ పాలిత ప్రాంతాల నుంచి హైదరాబాద్ రాజ్యానికి వచ్చే వారికి ప్లేగ్ పాస్‌పోర్టులను అందజేసేవారు. రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం ఉండేది. విజయవాడ, మద్రాస్ వైపు నుంచి వచ్చే ప్రయాణికులకు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో వైద్యులు అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాత వారిని హైదరాబాద్‌లోకి అనుమతించేవారు. (క్వారంటైన్లో యువకుడి ఆత్మహత్య) ఈ పరీక్షల అనంతరం వారికి హైదరాబాద్‌లో తిరిగేందుకు ఈ ప్లేగ్ పాస్‌పోర్టు లభించేది. అప్పటికి హైదరాబాద్ పూర్తిగా ఒక స్వతంత్రమైన దేశం కావడంతో బ్రిటీష్ ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా దీనిని తీసుకోవాల్సి వచ్చేది. అంతేకాదు, తమ సొంత కరెన్సీని నిజాం కరెన్సీలోకి మార్చుకునేందుకు కూడా రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక సదుపాయం ఉండేది. అలా 1915 నుంచే ప్లేగ్ వంటి మహమ్మారులు విజృంభిస్తున్న రోజుల్లో ఈ ప్లేగ్ పాస్‌పోర్టును కూడా తప్పనిసరి చేశారు. (తల్లి ప్రాణం తీసిన కొడుకు క్రికెట్ గొడవ) క్వారెంటైన్ కూడా ఆ రోజుల్లోనే.. ఆ రోజుల్లో ఎలుకల ద్వారా ప్లేగు వ్యాధి ప్రబలింది. విదేశాల నుంచి వచ్చే నౌకల ద్వారా ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్లు చరిత్ర చెబుతోంది. ఇటలీలో ఇలాంటి నౌకల్లో వచ్చేవారిని 40 రోజుల పాటు ఊళ్లోకి రాకుండా నౌకలోనే ఉంచేవారు. ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో నిజాం నవాబు స్పానిష్ ఫ్లూ మహమ్మారిని అరికట్టేందుకు క్వారంటైన్ పద్ధతిని పాటించారు. అప్పట్లో నగర శివార్లలో ఉన్న ఎర్రన్నగుట్టపై గుఢారాలు వేసి వ్యాధిగ్రస్తులను అక్కడికి తరలించి చికిత్స అందించారు. స్పానిష్ ఫ్లూ బాగా వ్యాప్తి చెందుతున్న రోజుల్లో సికింద్రాబాద్ సీతాఫల్మండి, ముషీరాబాద్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఐసొలేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. (మైనర్ గర్భం తొలగింపుకు హైకోర్టు అనుమతి ) 1915లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ ఆస్పత్రి 1923 వరకు ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్‌కు ఎదురుగా ఉన్న ఎర్రన్నగుట్ట మీదే ఉండేది. ఈ ప్రాంతం ఆ రోజుల్లో హైదరాబాద్ నగరానికి చాలా దూరంగా ఉన్నట్లే లెక్క, 1923లో ఎర్రన్నగుట్ట పైన ఉన్న క్వారెంటైన్ ఆసుపత్రిని ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రికి మార్చారు. అలా క్వారంటైన్ కోసం ఉపయోగించడం వల్ల దీన్ని క్వారంటైన్ ఆస్పత్రి అనేవారు. కాలక్రమంలో కోరంటి దవాఖానాగా, ఆ తర్వాత ఫీవర్ ఆస్పత్రిగా ప్రాచూర్యంలోకి వచి్చంది. సమగ్ర వివరాలతో జారీ.. సమగ్ర వివరాలతో జారీ.. ఈ పాస్‌పోర్టులో సందర్శకుడి పూర్తి వివరాలను నమోదు చేసేవారు. అప్పట్లో హైదరాబాద్‌ను సందర్శించిన ప్రముఖ చరిత్రకారుడు రాబర్ట్ చావెలో ఇందుకు సంబంధించిన తన అనుభవాలను ఆయన 1921లో రాసిన ’మిస్టీరియస్ ఇండియా’ అనే పుస్తకంలో వెల్లడించారు. హైదరాబాద్‌లో తాను తిరిగిన ప్రాంతాలు, అనుభవాలను తెలియజేశారు. ‘రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను. ఒక పోలీస్ అధికారి వచ్చి ప్రశ్నించారు. తాను ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని రోజులు హైదరాబాద్‌లో ఉండేది, ఎక్కడెక్కడకు వెళ్లాల్సి ఉంది వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. అంతేకాదు.. తనకు మొదటి రౌండ్ ప్లేగు పరీక్ష పూర్తయినా రెండో దఫా స్క్రీనింగ్, శానిటేషన్ టెస్ట్ కోసం పంపారు.’ అని పేర్కొన్నారు. (కరోనాపై విచారణకు భారత్ ఓకే ) అప్పటికే తాను హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్లేగ్ పాస్‌పోర్టు కలిగి ఉండటం వల్ల దాన్ని పరీక్షించి తదుపరి వైద్య పరీక్షల కోసం సివిల్ హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించినట్లు చావెలో తన పుస్తకంలో ప్రస్తావించారు. అప్పట్లో ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ చేసి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, సమగ్రమైన వివరాలతో ప్లేగ్ పాస్‌పోర్టు ఇచ్చేవారు. ఇదిలేని వారిని హైదరాబాద్‌లోకి అనుమతించేవారు కాదని ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డి తెలిపారు. -
ఆ రాత్రి హైదరాబాద్‌లో ఏం జరిగింది?
1947, ఆగస్టు 14 అర్ధరాత్రి... హైదరాబాద్ సంస్థానం భారత్‌లో భాగంగా లేదు. దేశమంతటా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనతో సతమతం అవుతోంది. అటు పాకిస్తాన్‌లోనూ, ఇటు భారత్‌లోనూ భాగం కాబోమనీ, హైదరాబాద్ స్వతంత్రంగానే కొనసాగుతుందని నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించుకున్నాడు. అంతకు ముందే ఎలాగైనా దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంకేతంగా ఆగస్టు 15న హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగురవేయాలని భావించిన నాటి కాంగ్రెస్ నాయకులు రామానంద తీర్థ తదితరులు ఢిల్లీ వెళ్లారు. స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాని రామానంద తీర్థకి ఇచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చి ఆగస్టు 15న హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు రామానంద తీర్థ ఇతర కాంగ్రెస్ సభ్యులతో కలసి రహస్యంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే అప్పటికే హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలులో ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఆర్య సమాజ్ కార్యకర్తల రహస్య స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఆగస్టు 15 తెల్లవారు ఝామున 3 గంటలకు రామానంద తీర్థని అరెస్టు చేశారు. ఆ తరువాత జీ.ఎస్. మేల్కొటేని సైతం అదుపులోకి తీసుకున్నారు. కృష్ణమాచార్య జోషిని కూడా అరెస్టు చేశారు. ఇంకా హైదరాబాద్ అంతటా అరెస్టుల పర్వం కొనసాగింది. అరెస్టు చేసిన వారిని చెంచల్‌గూడ జైలులో ఉంచారు. అయితే అరెస్టయిన వారు జైలు గోడల మధ్యనుంచి సైతం నినాదాలతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆహ్వానించారు. 1947, ఆగస్టు 14న యావత్ భారతదేశం ఆ అమూల్యమైన ఘడియల కోసం ఎదురుచూస్తోంది. అర్ధరాత్రి 12 గంటలకు అన్ని రేడియోలూ ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ ఉపన్యాసం కోసం వేచి చూస్తున్నాయి. నెహ్రూ, డాక్టర్ రాధాక్రిష్ణన్ నవభారత నిర్మాణం ఆవిష్కృతమవుతోందని ప్రకటించినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాము అంటూ రామానంద తీర్థ తన పుస్తకంలో రాసుకున్నారు. -
నిజాం వారసత్వాన్ని కాపాడండి
సాక్షి, హైదరాబాద్ : నిజాం చారిత్రక కట్టడం గౌలిగూడ బస్ స్టేషన్ ఒక్క సారిగా కుప్పకూలడంపై న్యాయ విచారణ జరిపించాలని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజాఫ్ అలీఖాన్ సీఎం కేసీఆర్‌ను కోరారు. బస్ స్టేషన్ కూలిపోవడంపై పలు అనూమానాలు వ్యక్త మవుతున్నాయి, దానిపై విచారణ జరిపించాలని కేసీఆర్‌కు ఆదివారం లేఖ రాశారు. హైదరాబాద్‌లోని నిజాం అస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పలు ఆస్తులు నగరం నుంచి అదృశ్యమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రిను కూల్చీ వేయాలని ప్రభుత్వం భావిస్తోందని, చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో తెలిపారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చిన వారికి హైటెక్ సిటీ లాంటివి కాదని, తెలంగాణ సంస్కృతి, చారిత్రక కట్టడాలే చూపించాలని పేర్కొన్నారు. గౌలిగూడ బస్ స్టేషన్ కూలీపోవడంపై పలు అనూమానాలు వ్యక్తమవుతున్నా విషయం తెలిసిందే. 90 ఏళ్ల క్రితం మూసీ నది ఒడ్డున నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గౌలిగూడ బస్ స్టేషన్ నిర్మించారు. 1994లో మహాత్మ గాంధీ బస్టాండ్ నిర్మించడంతో ప్రస్తుతం దానిని సిటీ బస్ స్టేషన్ (సీబీఎస్)గా ఉపయోగిస్తున్నారు. నిజాం స్మారక చిహ్నాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్ఐఎమ్ ఛీప్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. -
నిజాం నిధి ఎవరిది?
గత 7 దశాబ్దాలుగా హైదరాబాద్ ఫండ్స్ కేసు కొనసాగుతోంది. హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఇంగ్లాండుకు తరలించిన ఒక మిలియన్ పౌండ్ల నిధులు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇంగ్లాండు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయడానికి సుముఖంగానే ఉన్నప్పటికీ భారత్, పాక్ ల మధ్య వివాదాలతో ఇవి అక్కడి బ్యాంకులోనే ఉండిపోయాయి. నిజాం వారసులు ఈ నిధులన్నీ తమకే చెందుతాయని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ నిధులకు సంబంధించి ఆధారాల కోసం హైదరాబాద్‌ను సందర్శించింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ వివాదం గురించి పూర్తి వివరాలు మీకోసం...... హైదరాబాద్ రాష్ట్రాన్ని చివరగా పరిపాలించింది ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1948 సెప్టెంబర్ 17 వ తేదీన భారత ప్రభుత్వం చేసిన సైనిక చర్యతో నిజాం రాజ్యం(హైదరాబాద్ రాష్ట్రం) భారతదేశంలో విలీనమైంది. అయితే దీనికి సరిగ్గా రెండు రోజుల ముందే(సెప్టెంబర్ 15న) నిజాం రాజ్యం నుంచి ఒక మిలియన్ పౌండ్ల(రూ. 9.29 కోట్లు) నిధులు ఇంగ్లాండులోని వెబ్ మినిస్టర్ బ్యాంకు(రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్)కు తరలించారు. ఈ నిధులను ఇంగ్లాండులో పాకిస్తాన్ హైకమిషనర్ హబిబ్ ఇబ్రహీం రహీమతుల్లా పేరిట ఉన్న అకౌంటులో డిపాజిట్ చేశారు. నిజాం ఆర్థిక మంత్రి మోయిన్ నవాజు జంగ్ ఈ నిధులను ఇంగ్లాండుకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. నిజాంకు తెలియకుండానే నవాజు జంగ్ ఈ నిధులను బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ రాజ్యం.. భారత యూనియన్‌లో విలీనం తర్వాత ఈ నిధులను తిరిగి ఇవ్వాలని పాక్ హైకమిషనర్ హబిబ్ను నిజాం సంప్రందించాడు. కాని ఫలితం లేకుండా పోయింది. 1956 వరకు ఈ నిధుల కోసం నిజాం ప్రయత్నించాడు. కాని నేటికీ ఈ నిధులు విడుదల కాలేదు. 1967 లో నిజాం మరణాంతరం ఈ నిధులపై ఆయన వారసులు కూడా స్పందించలేదు. ప్రస్తుతం ఇవి ఇంగ్లాండులోని రాయల్ బ్యాంక్ ఆప్ స్కాట్లాండ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువరూ.310కోట్లు. ఆర్టీఐ కింద కేసు నమోదు... హైదరాబాద్ ఫండ్స్ కేసులో గత 67 ఏళ్లుగా వివాదం కొనసాగడానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే 1948లోనే ఇంగ్లాండ్ నుంచి ఈ నిధులన్నీ పాకిస్తాన్ హైకమిషనర్ హబిబ్ ఇబ్రహీం రహీమతుల్లాకు బదిలీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కాని బదిలీ అయినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వివాదం పెరిగిపోతూ వచ్చింది. కోర్టులతో సంబంధం లేకుండా ఈ వివాదాన్ని భారత్, పాక్‌లు చర్చించుకోవాలని భారత కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్లు 2008లో వార్తలొచ్చాయి. అయితే ఈ నిధులకు సంబంధించి 1948, సెప్టెంబర్ 20న డిపాజిట్ వివరాలను అందించాలంటూ ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) కింద అక్బర్ అలీ ఖాన్ అనే వ్యక్తి న్యాయ మంత్రిత్వ శాఖను కోరుతూ దరఖాస్తు చేశాడు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావడంతో నిజాం ఆస్తులపై మరాఠా ప్రజలకు హక్కు ఉందనీ, అందులో తమ వాటా ఎంతనేది తేల్చాలని కోరాడు. దీంతో కేంద్ర సమాచార కమిషన్ భారత్,పాక్‌ల మధ్య వివాదాన్ని వెంటనే తేల్చాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ నిధులతో పాక్‌కు సంబంధం ఎక్కడిదీ? ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు పాకిస్తాన్‌కు చెందిన హబిబ్ ఇబ్రహీం రహీమతుల్లా సన్నిహితంగా ఉండేవాడు. అయితే 1948లో ఇబ్రహీం ఖాన్ బ్రిటన్‌లో పాకిస్తాన్‌కు హైకమిషనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నిజాంకు చెందిన ఒక మిలియన్ పౌండ్ల నిధులను ఇబ్రహీం పేరిట బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఈ నిధులన్ని నిజాం వద్ద ఆర్థిక మంత్రి మోయిన్ నవాజు జంగ్ స్వయంగా బ్రిటన్‌కు పంపించాడు. అనంతరం భారత్‌లో నిజాం రాజ్యం విలీనమైంది. దీంతో నిజాం ఈ నిధులను తిరిగి ఇవ్వాలని ఇబ్రహీంను ఎన్ని సార్లు అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. ఇబ్రహీం పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి కావడంతో ఈ నిధులపై పాక్ తనకూ హక్కులున్నాయని డిమాండ్ చేస్తోంది. ఈ నిధులు మాకే చెందుతాయి: నిజాం వారసులు భారత్, పాక్‌లకు ఈ నిధులపై ఎటువంటి హక్కు లేదని నిజాం వారసుడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ 2016 జూన్ 23న ప్రకటించారు. ఇవి నిజాం వ్యక్తిగత నిధులనీ, వీటిపై ఇరుదేశాలకూ హక్కులేదని అన్నారు. నిజాంకు 16 మంది కుమారులు, 18 మంది కుమార్తెలు ఉండేవారు. వీరంత ప్రస్తుతం చనిపోయినప్పటికీ ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు మిగిలారు. కాని వారి వారసులు 120 మంది ఉన్నారు. వీరందరి తరఫున నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా నజాఫ్ అలీఖాన్ వ్యవహరిస్తున్నారు. కాగా నిజాం ఆభరణాలపై 1995లో సుప్రీం కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసుపై సుప్రీం తీర్పునిస్తూ...నిజాం రాజ్య ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులను వేరుగా చూడాలి. ఈ ఆభరణాలు నిజాం వారసులకు చెందుతాయని తెలిపింది. ఇంకా కోర్టులోనే వివాదం... ఈ నిధులని విడుదల చేయాలని ఇంగ్లాండు ప్రభుత్వం మొదటి నుంచి సుముఖంగానే ఉంది. నిధులన్నీ తమకే చెందుతాయంటూ... భారత్, పాక్, నిజాం వారసుల మధ్యే వివాదం కొనసాగుతూ వచ్చింది. 1958 నుంచి పాకిస్తాన్‌తో భారత్ పలుమార్లు చర్చలు జరిపింది. కాని పాక్ నిధులు తమకే చెందుతాయని పట్టుబట్టింది. చివరగా 2012 జూలై 5న నిధులపై రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. మరో వైపు నిజాం వారసులు 2004 నుంచి ఈ నిధులపై పూర్తి హక్కు తమకే ఉందంటూ రంగంలోకి దిగారు. నిజాం మనవడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ దీనిపై ఇంగ్లాండు కోర్టు ఇచ్చే తీర్పుకే కట్టుబడి ఉంటామని ప్రకటించాడు. అయితే 2013 ఏప్రిల్ 3న పాక్ హైకమిషన్ నిధులను విడుదల చేసేలా బ్యాంకుపై చర్యలు తీసుకోవాలంటూ ఇంగ్లాండు కోర్టును ఆశ్రయించాడు. అయితే 2015 జనవరి 16న కోర్టు తీర్పునిస్తూ ‘ పాకిస్తాన్ కోర్టును దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు నిధులను విడుదల చేయడానికి సిద్దంగానే ఉంది. కాని నిధులు ఎవరికి చెందుతాయనే సందిగ్దంలోనే నిలిపివేసింది. అనవసరంగా బ్యాంకుపై చర్య తీసుకోవాలని పాక్ ప్రయత్నించడం సరైంది కాదు.’ అని వెల్లడించింది. తెలంగాణకూ హక్కుంది.... హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉన్నందును తెలంగాణాకూ ఈ నిధులపై హక్కు ఉందని విదేశాంగ అధికారులు ప్రకటించారు. నిధులకు సంబంధించి ఆధారాలను సేకరించేందుకు వీరు హైదరాబాద్‌ను మూడుసార్లు సందర్శించారు. ఇటీవల విదేశాంగ అధికారులు తార్నాకాలోని ఆర్కైవ్స్‌లో వీటికి సంబంధించిన ఆధారాల కోసం శోధించారు. కాని ఏ ఆధారాలు లభ్యమవ్వలేదు.