to meet
-
ఆ పథకాలపై ఫోకస్.. పీఎస్‌యూ బ్యాంకులతో ఆర్థిక శాఖ సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 13న సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన ముద్రా యోజన, జన సురక్షా తదితర పథకాలపై సమీక్ష నిర్వహించనున్నట్టు చెప్పాయి. (జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి పథకాలపై చర్చించనున్నట్టు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాల పరిధిలో సంతృప్త స్థాయికి చేరుకునే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక శాఖ మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. ఇదీ చదవండి: త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్! -
జిన్‌పింగ్‌తో సై.. ఇమ్రాన్‌కు నై
బీజింగ్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల భేటీకి మరోసారి ము హూర్తం ఖరారైంది. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో జూన్ 12–14 మధ్య జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా వీరిద్దరూ సమావేశమవుతారని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రి తెలిపారు. షాన్డాంగ్ ప్రావిన్సులో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మిస్రి మాట్లాడుతూ..‘ఇటీవలికాలంలో భారత్, చైనాలు సుస్థిరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో సఫలమయ్యాయి. గతేడాది మోదీ, షీ జిన్‌పింగ్‌లు నాలుగుసార్లు సమావేశమయ్యారు. వుహాన్‌లో 2018లో జరిగిన చరిత్రాత్మక భేటీతో ఇరుదేశాల మధ్య సంబంధాలు సరికొత్త ఎత్తుకు చేరుకున్నాయి. భారత్–చైనాల మధ్య గతేడాది ద్వైపాక్షిక వాణిజ్యం రూ.6.57 లక్షల కోట్ల(95 బిలియన్ డాలర్లు)కు నమోదుకాగా, ఈ ఏడాది రూ.6.92 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు)కు చేరుకోనుంది’ అని పేర్కొన్నారు. ఇమ్రాన్‌తో భేటీకి నో.. షాంఘై సదస్సు సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మోదీ సమావేశం కాబోరని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పాక్ విదేశాంగ కార్యదర్శి సోహైల్ మహమూద్ ఇటీవల భారత్‌లో ప్రైవేటుగా పర్యటించిన నేపథ్యంలో మోదీ–ఇమ్రాన్ సమావేశమవుతారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కుమార్ స్పందిస్తూ.. ‘ఇమ్రాన్, మోదీల మధ్య ఎలాంటి భేటీ ఖరారు కాలేదు. పాక్ కార్యదర్శి సోహైల్ తన వ్యక్తిగత హోదాలో మూడ్రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటనకు, ఇరుదేశాల ప్రధానుల మధ్య భేటీకి ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, ప్రతీకారంగా భారత్ చేసిన వైమానిక దాడులతో పాక్–ఇండియాల మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారిన సంగతి తెలిసిందే. ఇటీవల రెండోసారి ప్రధానిగా మోదీ ఎన్నికైన అనంతరం ఫోన్‌చేసిన ఇమ్రాన్‌ఖాన్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. -
కాసులు ఖాళీ
ఖజానాలో నిధుల్లేక నిలిచిన బిల్లులు దహన సంస్కారాల బిల్లూ చేయలేదు ఆంక్షలతో పెన్షనర్లు, ఉద్యోగుల సతమతం జీపీఎఫ్, టీఏ, అభివృద్ధి నిధులు ఎక్కడివక్కడే.. lబ్లీచింగ్, పారిశుద్ధ్యం బిల్లులూ అంతే.. ఖమ్మం జెడ్పీసెంటర్: ‘ఖమ్మం డివిజనల్ పంచాయతీ అధికారి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన దహన సంస్కారాల కోసం రూ.20 వేల తక్షణ సాయం అందించేందుకు అధికారులు ఖజానాకు బిల్లు పెట్టారు. ఫ్రీజింగ్ నెపంతో అత్యవసర సేవలకు సైతం విఘాతం కలిగింది. జిల్లా ఖజానా అధికారులు మాత్రం తమ చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వ నిబంధనల మేరకు తాము బిల్లులు క్లియర్ చేస్తామని చెబుతున్నారు. ఆంక్షల కారణంగా ఆ ప్రభుత్వోద్యోగి కుటుంబం సాయం పొందలేకపోయింది.’ ఎక్కడివక్కడే.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం తగ్గింది. ఖజానాలో కాసులు లేక ఖాళీ అయింది. వివిధ శాఖలకు అందించే ఖర్చులు, పాలనకు సరిపడా నిధులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆంక్షల ప్రభావంతో జిల్లాలోని పలు శాఖల బిల్లులు నిలిచిపోయి ఆర్థిక అంతరాయం ఏర్పడింది. ప్రతి నెలా జీతాల బిల్లులు 22 తేదీలోపు ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తారు. కానీ నెలాఖరులో పంపిన బిల్లులు సైతం నిలిచాయి. జీపీఎఫ్, టీఏ బిల్లులు కూడా క్లియర్ చేసేందుకు ఆర్థిక పరమైన ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలతో చెల్లింపుల్లో ఆటంకం ఏర్పడటంపై పలు శాఖల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీజింగ్‌ను ఎత్తివేయకపోవడంతో పలు అభివృద్ధి పనుల బిల్లులు నిలిచిపోయాయి. ఈ ఆంక్షలతో పోలీస్‌శాఖతో పాటు పలు శాఖల ఉద్యోగులకు రావాల్సిన రూ. కోట్ల టీఏ బిల్లులు ఆగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఈ జాప్యంతో మొదటి తేదీన వేతనాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. గత నెల 25వ తేదీ వరకు తీసుకున్న పలు రకాల బిల్స్, 20 వరకు తీసుకున్న టీఏ బిల్స్‌ను క్లియర్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 20వ తేదీ తరువాత వచ్చిన బిల్లులు ఇప్పట్లో చేసే అవకాశం లేదంటున్నారు. ప్రదక్షిణలు.. ట్రెజరీ నుంచి బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఖజానా, ఎస్టీఓ కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు, పెన్షనర్లు, పలు అభివృద్ధి పనుల కాంట్రాక్టర్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్, ఎయిడెడ్ ఉద్యోగులు, పోలీస్‌శాఖ ఉద్యోగులు బారులు తీరారు. ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయకపోతే మురిగిపోతాయని, ఇప్పట్లో ఆ బిల్లులు వచ్చే అవకాశం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు కూడా అందడం కష్టంగా ఉంది. హాస్టల్ విద్యార్థుల సోప్ అండ్ ఆయిల్, డైట్ బిల్లులు, భవనాల అద్దెలు, సరెండర్ లీవ్, ఈజీఎల్, ఫ్యామిలీ బెనిపిట్ ఫండ్, ఎప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్, ఇతర ఖర్చులు నిలిచిపోయాయి. ప్రభుత్వ వాహనాలకు డీజిల్, పెట్రోల్ బిల్లులు కూడా రాకపోవడంతో అధికారుల జేబుల నుంచి, ఇతర శాఖల నుంచి అప్పు చేసే పరిస్థితి నెలకొంది. అధికారులు వాడే పలు ప్రైవేట్ వాహనాలకు బిల్లులు చెల్లించకపోవడంతో డ్రైవర్లకు వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, బ్లీచింగ్, పారిశుద్ధ్యం బిల్లులు కూడా నిలిచిపోయాయి. దీనిపై కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఆదాయ వనరులు, ఖర్చు, ద్రవ్య వినియోగబిల్లులపై స్పష్టత లేకుండా పోయిందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. -
వచ్చే నెల 4న ఏపీ, కర్ణాటక సీఎంల భేటీ!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, సిద్దరామయ్యలు వచ్చే నెల 4న సమావేవశమయ్యే అవకాశముంది. చంద్రబాబు బెంగళూరులో సిద్ధరామయ్యను కలసి కృష్ణా నదీజలాల విషయం చర్చించనున్నట్టు సమాచారం. మంగళవారం సాయంత్రం చంద్రబాబు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దు రాష్ట్రాలతో నదీజలాల అంశం గురించి చర్చించారు. తుంగభద్ర హెచ్ఎల్సీ నీటి నుంచి 32 టీఎంసీలను ఏపీ వినియోగించుకునేలా సిద్ధరామయ్యను ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించనున్నారు. అలాగే ఇతర నదీ జలాల అంశాలను చంద్రబాబు చర్చించనున్నారు.