నేడు మెగా ప్లాంటేషన్
సదాశివపేట: ప్రభుత్వం ప్రటిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం రెండో విడత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఎవరెస్ట్ ఎన్క్లెవ్లో, 11 గంటలకు సిద్దాపూర్ కాలనీలో శ్రీకృష్ణ మందిరం వద్ద, 11.15 సిద్దాపూర్ కాలనీలోని పాత కమ్యూనిటి హాల్ వద్ద, 11.30 గంటలకు సిద్దాపూర్ రోడ్డులోగ సాయినగర్ కాలనీలో మెగా ప్లాంటేషన్ చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ఇస్వాక్ఆబ్ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ప్రజాప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.