అసంపూర్తిగా శిల్పారామం పనులు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ చెరువుకట్ట సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణం లో నిర్మాణం జరుగుతున్న శిల్పారామం పనులు అసంపూర్తిగా నిలిచాయి. దీంతో పట్టణ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శిల్పారామం పనులు పూర్తి కాకపోయి నా ఫిబ్రవరి 19న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభోత్సవం చేశా రు. 2013న నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఆర్ట్స్, క్రాఫ్ట్, కల్చరర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కల్యాణమండపం, స్మిమ్మిం గ్‌ఫూల్, డ్యాన్సింగ్ అకాడమీ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికల కోడ్ సమీపిస్తుందన్న భావనతో పను లు పూర్తికాకుండానే విప్ హోదా లో జగ్గారెడ్డి అసంపూర్తిగా ఉన్న వాటినే ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే ప్రారంభించిన మరుసటి రోజు నుంచి ఇప్పటివరకు పనులు జరుగలేదు.
దీంతో శిల్పారామం పరిధిలోని కల్యాణ మండపాల షెడ్ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మండపాల ఆవరణలో రోడ్లు, మూత్రశాలలు, వధూవరుల గదులు తదితర పనులు నేటికీ పూర్తి కాలేకపోయాయి. నిర్మాణం పూర్తై షెడ్లలో సైతం విద్యుత్ సరఫరా, ఇతర సౌకర్యాలను కల్పిం చలేకపోయారు. దీంతో పట్టణ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.