Mehdi masrur Biswas
-
ఆ డబ్బులెక్కడివి?
‘మెహ్దీ’ అకౌంట్ నుంచి కోట్లలో లావాదేవీలు వివిధ బ్యాంక్‌ల్లో మొత్తం 18 అకౌంట్లు చేతులు మారిన డబ్బుపై ఆరా తీస్తున్న పోలీసులు బెంగళూరు : ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ట్వీట్ల ద్వారా మద్దతు తెలుపుతున్నాడనే ఆరోపణలపై అరెస్టైన మెహ్దీ మస్రూర్ బిశ్వాస్‌ను విచారిస్తున్న పోలీసు అధికారులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటున్నారు. ఇందులో దక్షిణ భారత్‌ను ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో మెహ్దీకి కోట్ల రూపాయల డబ్బు వచ్చి చేరిందని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు గాను రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు సైతం మెహ్దీని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మెహ్దీకి వివిధ బ్యాంకుల్లో మొత్తం 18 అకౌంట్లున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అకౌంట్లలో కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు సైతం జరిగిన విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక మెహ్దీకి సంబంధించిన వివరాలపై లండన్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఛానల్ కథనాన్ని ప్రసారం చేసే వరకు ఈ అకౌంట్లన్నింటి నుంచి లావాదేవీలు జరగగా, ఆ కథనం ప్రసారం అయిన వెంటనే అకౌంట్లన్నింటిలోని డబ్బులు పూర్తిగా డ్రా అయ్యాయి. ప్రస్తుతం మెహ్దీ పేరిట ఉన్న 18 అకౌంట్లలోనూ బ్యాలెన్స్ జీరోగానే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా మెహ్దీ అకౌంట్ల నుండి వెళ్లిన డబ్బులు ఎవరెవరికి వెళ్లాయి అనే కోణంలో పోలీసులు విచారణను ప్రారంభించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి దక్షిణ భారత్ మొత్తానికి మెహ్దీ కమాండర్‌గా వ్యవహరించాడని, అతని ద్వారా ఐఎస్ఐఎస్ సంస్థలో చేరిన వ్యక్తుల కుటుంబాలకు ధన సహాయం చేసేందుకే మెహ్దీ అకౌంట్లలోకి భారీ మొత్తంలో డబ్బు వచ్చి చేరేదని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. కాగా, ఈ విధంగా ఎవరెవరి కుటుంబాలకు ఎంతెంత డబ్బు చేరింది, వీరంతా ఎక్కడుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి మాత్రం పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఐఎస్ మద్దతుదారుడి అరెస్ట్
‘ట్వీటర్ ఖాతా’ మెహ్దీని పట్టుకున్న పోలీసులు ఐటీసీ ఫుడ్స్‌లో ఏటా 5.3 లక్షల వేతనంతో ఉద్యోగం చేస్తున్న మెహ్దీ సాక్షి, బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు వినియోగించే ట్వీటర్ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన మెహ్దీ మస్రూర్ బిస్వాస్(24) గత కొన్నేళ్లుగా ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఇతడు ఐటీసీ ఫుడ్స్ సంస్థలో ఏటా రూ.5.3 లక్షల వేతన ప్యాకేజీతో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. బెంగళూరులో అద్దె నివాసం నుంచి అతడిని అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ లాల్‌రుకుం పచావో శనివారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. ఐఎస్ఐఎస్ ఖాతాను తానే నిర్వహిస్తున్నట్లు మెహ్దీ అంగీకరించాడని తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదుల ట్వీటర్ ఖాతాను ‘షామీ విట్నెస్’ పేరుతో బెంగళూరుకు చెందిన మెహ్దీ నిర్వహిస్తున్నాడని, బ్రిటన్‌కు చెందిన చానల్ ‘4 న్యూస్’ బయటపెట్టిన సంగతి తెలిసిందే. అరెస్టు చేస్టున్న సమయంలో మెహ్దీ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. ‘బిశ్వాస్‌పై ఐపీసీ సెక్షన్ 125 (వ్యక్తిగతంగాగానీ సమూహంగాగానీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం లేదా అందుకు యత్నించడం), సెక్షన్ 18, సెక్షన్ 39లతోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేశాం. అతడి నుంచి రెండు ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, మన దేశం వరకైతే ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి ప్రమేయం లేదని అన్నారు. ఐఎస్ ఉగ్రవాద సంస్థలో బిశ్వాస్ ఇప్పటివరకు ఎవరినీ చేర్చలేదని. విదేశాలకు కూడా ఎప్పుడూ వెళ్లలేదని అన్నారు. పగలు ఉద్యోగం.. రాత్రి ఇంటర్నెట్లో.. బిశ్వాస్ పగలంతా ఉద్యోగం చేస్తూ రాత్రి వేళలో ఇంటర్నెట్ ముందు గడిపేవాడని డీజీపీ పచవ్ తెలిపారు. ఐఎస్ఐఎస్/ఐఎస్ఎల్ వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 60 జీబీ డేటా సామర్థ్యంగల ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడుతున్నాడని వివరించారు. బిశ్వాస్కు ఇద్దరు అక్కలు ఉన్నారని, ఇతడి తండ్రి పశ్చిమబెంగాల్ విద్యుత్ బోర్డులో పనిచేసి రిటైర్డ్ అయ్యారని వివరించారు. నమ్మను: బిశ్వాస్ తండ్రి కోల్‌కతా: బిశ్వాస్కు ఐఎస్‌తో సంబంధాలున్నాయని నమ్మడం లేదని ఆయన తండ్రి శ్వాస్ చెప్పారు. కుమారుడి ఇంటర్నెట్ అకౌంట్‌ను ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చని అన్నారు. ‘‘ఈ విషయం తెలియగానే శుక్రవారం ఫోన్ చేసి అడిగాను. ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదని చెప్పాడు’ అని తెలిపారు. -
పట్టుబడ్డ మెహ్దీ
ఐఎస్ఐఎస్ కార్యకలాపాలపై మక్కువ ఐటీసీ ఫుడ్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఏడాదికి రూ. 5.3 లక్షల వేతనం వివరాలు వెల్లడించిన డీజీపీ లాల్ రుకుమ్ పచావో బెంగళూరు : సామాజిక అనుసంధాన వేదికల (సోషియల్ నెట్‌వర్క్‌ంగ్ వెబ్‌సైట్స్) ద్వారా యువతను ఉగ్ర వాద కార్యకలాపాల వైపు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న యువకుడిని శనివారం తెల్లవారుజామున బెంగళూరులోని జాలహళ్లి ప్రాంతంలో అరెస్టు చేశారు. వివరాలను నగర కమిషనర్ ఎం.ఎన్ రెడ్డితో కలిసి రాష్ట్ర డీజపీ లాల్ రుకుమ్ పచావో శనివారమిక్కడ మీడియాకు వెళ్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని గోపాల్‌పురకు చెందిన మెహ్దీ మస్రూర్ బిశ్వాస్(24) అక్కడి గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మెహ్దీ తండ్రి ఇంధనశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. మొదటి నుంచి ఇస్లామిక్ సిద్ధాంతాల పట్ల విపరీతంగా స్పందించే మెహ్దీ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా తన మనోభావాలను వెళ్లడించేవాడు. 2012లో బెంగళూరుకు చేరుకున్న మెహ్దీ ఐటీసీ ఫుడ్స్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా ఏడాదికి రూ.5.3 లక్షల వేతనాన్ని ఆర్జిస్తున్నాడు. పగలంతా కంపెనీలో ఉద్యోగం చేసి రాత్రి సమయాల్లో ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థతోపాటు, సిరియా, లిబియా తదితర దేశాల్లో (ఎలెవన్ రీజియన్ కంట్రీస్) జరుగుతున్న రాజకీయ, సామాజిక, మత సంబంధ విషయాల పై ఎక్కువ ఆసక్తి చూపేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం ఇంటర్నెట్పై ఎక్కువగా ఆధారపడేవాడు. ప్రముఖ సర్చ్ఇంజన్లలో సమాచారం సేకరించి అందుకు తన భావాలను చేర్చి ‘షమీ విట్నెస్’ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెళ్లడించేవాడు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలపై టర్కీ, అరబిక్ తదితర భాషల్లో ఉన్న సమాచారాన్ని ఇంగ్లీషుకు అనువాదం చేసేవాడు. ఇతని ట్విట్టర్‌కు నెలకు దాదాపు 20 లక్షల మంది వీక్షకులు ఉండగా అందులో 17 వేల మందికి పైగా ఫాలోయర్స్‌ని తెలిపారు. వీరిలో ఎక్కువ భాగం బ్రిటన్‌కు చెందినవారేనని ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తులో తేలింది. ఇతని కార్యకలాపాలు ఎక్కువగా ఇంటర్నెట్ పై సాగుతుండటంతో అందుకు అనుగుణంగా నెలకు 60 జీబీ సామర్థ్యం కలిగిన డాటా కార్డును వినియోగించేవాడు. ప్రస్తుతం మహ్దీ పై బెంగళూరులోని గంగమ్మగుడి పోలీస్స్టేషనల్లో ఐపీసీ 125, 18, 39తోపాటు ఐటీ యాక్ట్ -2000 సెక్షన్ (66) (సైబర్ టైజం) ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా... ఏడాదిన్నరగా బెంగళూరులోని జాలహళ్లి ప్రాంతంలోని అయ్యప్ప నగర్లో ఓ రెండంతస్తుల భవనంలో ఒంటరిగా ఉంటున్న మెహ్దీ ఉదయం పూట విధులకు వెళ్లి రాత్రికి తిరిగి తన గదికి చేరుకునేవాడు. అప్పుడప్పుడు ఇతని ఇంటికి సొంతూరులో ఉంటున్న తల్లిదండ్రులు వచ్చివెళ్లేవారు. చుట్టు పక్కల వారితో మామూలుగా ప్రవర్తించేవాడు. ఇలా చిక్కాడు... విశ్వసనీయ సమాచారం మేరకు ట్విట్టర్ అకౌంట్ కోసం తనకు సంబంధించిన (పేరు, ఈ మెయిల్ తదితర) అసలు సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. అయితే ‘షమీ విట్నెస్’ ట్విట్టర్‌ను నిర్వహిస్తున్న వ్యక్తే ఎ ఎల్ సాల్టడోర్ పేరుతో మరో ట్విట్టర్‌ను నిర్వహించేవాడు. ఈ ట్విట్టర్ జీ మెయిల్‌కు అనుసంధానం అయి ఉండేది. ఇదే మెయిల్ ఐడీకు గూగుల్ ప్లస్, పేస్బుక్ అకౌంట్‌తో సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మెహ్దీ తన స్మార్ట్ ఫోన్ నుంచి షమీ విట్నెస్ ద్వారా ట్విట్లను నిర్వహించేవాడు. మరోవైపు బ్రిటన్‌కు చెందిన ఛానల్ 4 కూడా మెహ్దీ పై ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ విషయాలన్నీ గమనించిన పోలీసులు పక్కా సమాచారం మేరకు మెహ్దీ ఉంటున్న గది పై దాడి చేసి అరెస్టుచేశారు.