డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ
కొవ్వూరు రూరల్: జిల్లాలో 9 పురపాలక సంఘాల్లోని డ్వాక్రా మహిళలకు చిరు వ్యాపారాలు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు శిక్షణ ఇస్తామని మెప్మా పీడీ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది డ్వాక్రా రుణాలకు సంబంధించి రూ.90 కోట్ల పెట్టుబడి నిధిని వారి ఖాతాల్లో జమచేశామని చెప్పారు. బుధవారం స్థానిక లిటరరీ క్లబ్ ఆవరణలో పురపాలక సంఘ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 494 స్వయం సహాయ సంఘాలకు రెండో విడత పెట్టుబడి నిధి సొమ్ము రూ.కోటి 47 లక్షల 45 వేల చెక్కును ఎమ్మెల్యే కేఎస్ జవహర్ చేతులమీదుగా అందజేశారు. చంద్రన్న బీమాలో నాలుగు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున బీమా సొమ్ము అందజేశారు. ఎమ్మెల్యే కేఎస్ జవహర్, ఆర్డీవో బి. శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ జొన్నలగడ్డ రాధారాణి, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి తదితరులు మాట్లాడారు.