men murder
-
మందలించడమే శాపమైంది!
కామారెడ్డి క్రైం: తనను మందలించాడనే కోపంతో నిద్రిస్తున్న మామపై గొడ్డలితో అల్లుడు దాడి చేశాడు. తలపై బలంగా మోదడంతో మామ అక్కడికక్కడే చనిపోయిన సంఘటన లింగాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం విచారణ జరిపారు. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాజలింగం (70)కు ఒక్కగానొక్క కుమార్తె భీమవ్వ. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఇనుగుర్తి లక్ష్మణ్‌ను 30యేళ్ల క్రితం భీమవ్వతో వివాహాం జరిపించి ఇల్లరికం తెచ్చుకున్నాడు. భీమవ్వ–లక్ష్మణ్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం రాత్రి వారి పక్కింట్లో వివాహా విందు జరుగుతోంది. విందుకు హాజరయ్యే జనం రాజలింగం ఇంటి ముందు వాహనాలు పార్కింగ్ చేశారు. లక్ష్మణ్ తన ఇంటి ముందు వాహనాలను నిలుపవద్దని వారించగా అతని భార్య భీమవ్వ అక్కడికి వచ్చింది. వాహనాల పార్కింగ్ విషయంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. భార్య, కూతురుపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడకు వచ్చిన మామ రాజలింగం లక్ష్మణ్‌పై మండిపడ్డాడు. వారి మధ్య మాటలు పెరిగి వివాదం పెద్దదైంది. ఆ తర్వాత రాజలింగం ఇంటిలోకి వెళ్లి పడుకున్నాడు. మామపై ఆగ్రహంతో ఉన్న లక్ష్మణ్ గొడ్డలితో తలపై బలంగా దాడి చేశాడు. దీంతో రాజలింగం అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత లక్ష్మణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఓకుర్తిలో యువకుడి దారుణ హత్య
రాజవొమ్మంగి (రంపచోడవరం) : మండలంలోని వాతంగి పంచాయతీ పరిధిలోని లోతట్టు గ్రామం ఓకుర్తిలో శుక్రవారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి 10 గంటల తరువాత ఈ సంఘటన వెలుగులోకి రావడంతో జడ్డంగి, రాజవొమ్మంగి ఎస్సైలు నాగార్జున, రవికుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఓకుర్తి గ్రామానికి చెందిన గోము వెంకటరమణ గ్రామ నడిబొడ్డున కోనేటి ప్రసాద్‌బాబును (27) కత్తితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటనలో ప్రసాద్‌బాబు ఎడమ చేయి మణికట్టు వద్ద తెగిపోయింది. అరచేతిపై, భుజాలపై బలమైన గాయాలయ్యాయి. అలాగే గొంతుముడి తెగిపోవడంతో ప్రసాద్ సంఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో కుప్పకూలాడని జడ్డంగి ఎస్సై నాగార్జున తెలిపారు. తన భార్యతో ప్రసాద్ అతి చనువుగా మసలుతున్నాడన్న అక్కసు, అనుమానంతో వెంకటరమణ ఈ దారుణానికి పాల్పడాడని తమ ప్రాథమిక విచారణలో తెలిందని ఎస్సై చెప్పారు. వెంకటరమణది మండలంలోని కరుదేవపాలెం గ్రామం కాగా ఓకుర్తి గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకుని అదే గ్రామంలో ఉంటున్నాడు. ప్రసాద్బాబుది ప్రత్తి పాడు మండలం కిత్తమూరుపేట గ్రామం కాగా ఓకుర్తి గ్రామానికి చెం దిన యువతితో వివాహం కుదిరింది. నిశ్చితార్థం కావడంతో ప్రసాద్‌బాబు ఓకుర్తి గ్రామంలోనే కాబోయే భార్య కుటుంబీకులతో ఏడాదిన్నరగా ఉంటున్నాడు. ప్రసాద్‌బాబుపై కక్షపెంచుకున్న వెంకటరమణ అదనుదొరకడంతో అతనిని హత్య చేశాడని ఎస్సై తెలిపారు. అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రసాద్ కుటుంబీకులకు అప్పగించారు. -
ఎస్.అన్నవరంలో వ్యక్తి హత్య
రంగంలోకి దిగిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లు తుని రూరల్ (తుని) : ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మండలంలోని ఎస్.అన్నవరం.. బోణం బాబ్జీ (36) దారుణ హత్యతో ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న బాబ్జీ మృతి చెందినట్టు గుర్తించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై ఎం.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాబ్జీ హత్యకు గురైనట్టుగా నిర్ధారణకు వచ్చిన పెద్దాపురం డీఎస్పీ సూచనల మేరకు కాకినాడ నుంచి డాగ్ స్క్యేడ్, వేలు ముద్రల నిపుణులకు రప్పించారు. సిమెంట్, కంకర రాతికి ఉన్న రక్తపు మరకలు, తలవెంట్రుకల ఆధారంగా డాగ్ స్క్వాడ్ మొదట (ఫస్ట్ ట్రాక్) గ్రామ శివారు కనకదుర్గమ్మ ఆలయ శివారు ఇనుప గేటు వద్దకు వెళ్లి నిలిచిపోయింది. డాగ్ స్క్వాడ్ (రెండవ ట్రాక్) మృతుడి ఇంటికి వద్ద నిలిచిపోయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో డాగ్ స్వా్యడ్ వెనుతిరిగింది. అక్కడికి సమీపంలో కల్లు దుకాణం ఉండడంతో అక్కడికి నిందితులు ఎవరైనా వెళ్లారా అన్న కోణంలో విచారణ చేపట్టారు. మృతుడు స్థానిక మద్యం బెల్టు దుకాణం వద్ద వెళ్లినట్టు సమాచారం ఉంది. అదేవిధంగా హతుడి సమీపంలో ఖాళీ సారా ప్యాకెట్లను గుర్తించారు. హతుడి నివాసానికి సమీపంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. వేలిముద్రల నిపుణులకు ఆధారాలు లభించలేదు. బాబ్జీ హత్య కేసును ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తామని సీఐ చెన్నకేశవరావు తెలిపారు. కూలి పనులకు వెళ్లొచ్చాడు.. పాత సంచుల మరమ్మతు పనులు చేస్తుంటే బాబ్జీ తరుచూ గొల్లప్రోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుని వారానికి ఒకసారి ఇంటి వస్తుంటాడు. ఒకటి, రెండు రోజులు గ్రామంలో ఉండే అతడు మద్యం సేవిస్తుంటాడని, ఎవరితో పాత కక్షలు, తగాదాలు లేవని స్థానికులు తెలిపారు. గుంటూరు నుంచి శనివారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే భార్య పుట్టింటికి వెళ్లడంతో రోజుంతా దుకాణాల చుట్టూ తిరుగుతూ మద్యం తాగి తెలిసింది. మద్యం సేవించిన తర్వాత ఎవరితోనైన గొడవ పడి హత్యకు గురై ఉంటాడన్న అనుమానం వ్యక్తమవుతోంది. హతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. బాబ్జీ హత్యకు గురైన సమాచారం తెలియడంతో ఆదివారం ఉదయం పుట్టింటి నుంచి అతని భార్య, కుమార్తె గ్రామానికి చేరుకుని బోరున విలపించారు. -
బ్లేడ్ బ్యాచ్ చేతిలో యువకుడి హత్య
రాజమహేంద్రవరం క్రైం : నగరంలో ఆదివారం రాత్రి హత్యకు గురైన యువకుడి ఆచూకీ లభించింది. బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన యువకులే ఈ హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్యాపురం మూలగొయ్యి ప్రాంతానికి చెందిన పందిరి శివ (25) పాత నేరస్తుడు. అతనిపై అనేక కేసులు ఉన్నాయి. కోటగుమ్మం సెంటర్లో జరిగిన గొడవల్లోను, కొన్ని ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో శివను ఆదివారం సాయంత్రం ఐదుగురు స్నేహితులు ఇంటికి వచ్చి బయటకు తీసుకుÐð ళ్లారు. మల్లయ్యపేట పెట్రోల్ బంక్ వెనుక వైపు ఉన్న నిర్జన ప్రదేశానికి శివను తీసుకువెళ్లి రాడ్లతో తలపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ దాడిలో పది మంది పాల్గొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం త్రీటౌన్ పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మందిని చంపుతారు బ్లేడ్ బ్యాచ్ కు చెందిన వ్యక్తులు ఒకరినొకరు దారుణంగా చంపుకోవడం ఎక్కువ అయిందని శివ తండ్రి రాజు, తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యలకు రాజేంద్ర నగర్‌కు చెందిన ఒక వ్యక్తి కారణమని ఆరోపించారు. హంతకులపై, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని హత్యలు జరగవచ్చని అన్నారు. బ్లేడ్ బ్యాచ్ కు చెందిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.