పురుషులకు పాతికేళ్ల తర్వాతే పెళ్లి మంచిది
లాస్ ఏంజెలెస్: పాతికేళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవడం పురుషులకు ఎముకల ఆరోగ్య రీత్యా మంచిదని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పాతికేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే, పాతికేళ్ల లోపే పెళ్లి చేసుకున్న పురుషుల్లో ఎముకల బలం తక్కువగా ఉంటోందని వారు తమ పరిశోధనలో గుర్తించారు.
అవివాహితులతో పోలిస్తే విడిపోకుండా స్థిరమైన వైవాహిక సంబంధాలు లేదా సహజీవన సంబంధాలు సాగిస్తున్న పురుషుల్లోనూ ఎముకల దారుఢ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే, సానుకూల భాగస్వాములు గల మహిళల్లోనూ ఎముకల దారుఢ్యం ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది.