MEO Office
-
భోజనం తినలేకపోతున్నాం
చౌటుప్పల్ : మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని, నాసిరకంగా ఉండడంతో తినలేకపోతున్నామంటూ మండలంలోని తంగడపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించారు. ఖాళీ ప్లేట్లతో ఆందోళనకు చేపట్టారు. నాణ్యత లేకపోవడంతో కడుపునిండా తినలేకపోతున్నామని, తిండి విషయంలో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనంతోపాటు కూరగాయలు, గుడ్లు, సాంబారు కూడా పూర్తి నాణ్యత లోపించి ఉంటుందని వాపోయారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అనంతరం ఈ విషయాన్ని ఎంఈఓకు దృష్టికి తీసుకెళ్లారు. -
ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
ఆత్మకూరు : భారతీయ జనతా యువమోర్చా ఆత్మకూరుశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మండల విద్యావనరుల కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆళ్ల మధుసూదన్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కామన్‌ఫీజు విధానాన్ని అమలుచేయాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఉదయగిరి ప్రతాప్, ఉపాధ్యక్షుడు కొల్లి హరినాయుడు, కార్యవర్గసభ్యులు దేవరపాటి మాధవ్, ఎస్డీ ఖాజారంతుల్లా, నాయకులు పూనపాటి రాజేష్, ఓబుల పవన్, బి.మారుతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
జిల్లాలో ‘పడే భారత్.. బడే భారత్’
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు * రూ.2 కోట్ల నిధుల మంజూరు * సర్వశిక్షా అభియాన్ ఏఎంవో సర్వేశ్వరరావు వెల్లడి ఆకివీడు: జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘పడే భారత్-బడే భారత్’ పథకాన్ని అమలు చేయనున్నట్టు సర్వశిక్షఅభియాన్ ఏఎంవో ఈ.సర్వేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎంఈవో కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాల్ని మరింత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని చెప్పారు. పథకం అమలు చేసేందుకు జిల్లాకు రూ.2 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. పథకం అమలులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఏడు రోజులపాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్‌లు నిర్వహిస్తామని చెప్పారు. నెలకు ఒకటి చొప్పున ఎనిమిది కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. టీఎల్ఎం గ్రాంట్ పెంపు తెలుగు, ఇంగ్లిష్ భాషలపై జిల్లా, మండల, కాంప్లెక్స్, స్కూల్ స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తామని ఏఎంవో తెలిపారు. చదవడం, రాయడంతో పాటు లెక్కల్లో నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి టీచర్ గ్రాంట్ మంజూరు కానుందని చెప్పారు. గతంలో టీఎల్‌ఎంకు రూ.500 ఇచ్చేవారని రూ.1,000కు పెంచాలని ప్రతిపాదించామన్నారు. వచ్చే ఏడాది నుంచి టీఎల్ఎం గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏఎంవో పేర్కొన్నారు. 23 వరకు బడిబాట సంకల్పం-బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్టు ఏఎంవో తెలిపారు. జిల్లాలో ఐదేళ్లు పైబడిన 25 వేల మందిని బడిలో చేర్పించడమే లక్ష్యంతో సాగుతున్నామని ఆయన చెప్పారు. -
ఎంఈవో ఆఫీసులో అవినీతిపై డీఈవో విచారణ
వేములవాడ అర్బన్ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన అవినీతి వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం విచారణ నిర్వహించారు. అక్కడ పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి కె.శ్రీనివాస్ ముగ్గురు రిటైర్డ్ టీచర్ల పేరిట ఐడీలు సృష్టించి వారి పేరు మీద రూ.17.88 లక్షలను డ్రా చేసుకున్న వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. 2015 ఏప్రిల్ నుంచి 2016 జనవరి వరకు ఈ వ్యవహారం నడిచింది. దీంతో డీఈవో శ్రీనివాసాచారి మంగళవారం వేములవాడలోని ఎంఈవో కార్యాలయానికి వచ్చి విచారణ నిర్వహించారు. రికార్డులను సీజ్ చేశారు. అలాగే, ఈ నిధులను ఎస్బీహెచ్ శాఖలోని రెండు ఖాతాల పేరిట డ్రా చేసుకున్నట్టు గుర్తించడంతో బ్యాంకు అధికారులతో మాట్లాడి వాటిని ఫ్రీజ్ చేయించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీఈవో శ్రీనివాసచారి తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఎంఈవో శోభన్‌రావు, అవినీతికి సూత్రధారి అయిన కె.శ్రీనివాస్, డబ్బులు డ్రా చేసుకోవడానికి సహకరించిన అరుణ్‌కుమార్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.