* వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
* రూ.2 కోట్ల నిధుల మంజూరు
* సర్వశిక్షా అభియాన్ ఏఎంవో సర్వేశ్వరరావు వెల్లడి
ఆకివీడు: జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘పడే భారత్-బడే భారత్’ పథకాన్ని అమలు చేయనున్నట్టు సర్వశిక్షఅభియాన్ ఏఎంవో ఈ.సర్వేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎంఈవో కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాల్ని మరింత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని చెప్పారు. పథకం అమలు చేసేందుకు జిల్లాకు రూ.2 కోట్ల నిధులు కేటాయించిందన్నారు.
పథకం అమలులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఏడు రోజులపాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్‌లు నిర్వహిస్తామని చెప్పారు. నెలకు ఒకటి చొప్పున ఎనిమిది కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు.
టీఎల్‌ఎం గ్రాంట్ పెంపు
తెలుగు, ఇంగ్లిష్ భాషలపై జిల్లా, మండల, కాంప్లెక్స్, స్కూల్ స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తామని ఏఎంవో తెలిపారు. చదవడం, రాయడంతో పాటు లెక్కల్లో నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి టీచర్ గ్రాంట్ మంజూరు కానుందని చెప్పారు. గతంలో టీఎల్‌ఎంకు రూ.500 ఇచ్చేవారని రూ.1,000కు పెంచాలని ప్రతిపాదించామన్నారు. వచ్చే ఏడాది నుంచి టీఎల్‌ఎం గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏఎంవో పేర్కొన్నారు.
23 వరకు బడిబాట
సంకల్పం-బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్టు ఏఎంవో తెలిపారు. జిల్లాలో ఐదేళ్లు పైబడిన 25 వేల మందిని బడిలో చేర్పించడమే లక్ష్యంతో సాగుతున్నామని ఆయన చెప్పారు.
జిల్లాలో ‘పడే భారత్.. బడే భారత్’
Published Tue, Apr 19 2016 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM
Advertisement