చైనాలో 28 మందిని బలితీసుకున్న 'మొరాంతి'
బీజింగ్: తైవాన్ ను అతలాకుతలం చేసిన మొరాంతి తుపాన్ చైనాపై తన పంజా విసిరింది. 28 మందిని బలితీసుకుంది. వరదలకు 15 మంది గల్లంతయ్యారని ఓ వార్తా సంస్థ తెలిపింది. చైనా 70 ఏళ్ల చరిత్రలో ఇంత పెద్దతుపాన్ సంభవించడం ఇదే ప్రథమమని వాతావరణ శాఖ ప్రకటించింది.
గంటకు 107 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. తుపాన్ దాటికి 3000 చెట్లు కూలిపోయాయి. వెయ్యి మంది వర్కర్లు పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నారు. యుంగ్ చున్ లోని 871 ఏళ్ల పురాతన బ్రిడ్జ్ కూలిపోయింది. దాదాపు 30 లక్షల కుటుంబాలకు విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయిందని వార్తా సంస్థ తెలిపింది.