merged villages
-
విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలి!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ.. విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామాకు డెడ్‌లైన్ విధించింది. మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో గురువారం సమావేశమైన రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా విలీన గ్రామాలకు చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానించింది. ఈ నెల 20 లోపు రాజీనామా చేయాలని డెడ్‌లైన్ విధించింది. అలాగే సంక్రాంతి పండుగ రోజున రైతులంతా కుటుంబ సమేతంగా కామారెడ్డి పట్టణంలోని ప్రధాన రోడ్లపై ముగ్గులు వేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈనెల 17న పాతరాజంపేట గ్రామంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ ద్వారా ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లతో పాటు వంద ఫీట్ల రోడ్ల పేరుతో భూములను కొల్లగొట్టే ప్రయత్నాలను నిరసిస్తూ రైతులంతా నెల రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాగా, మాస్టర్‌ప్లాన్ పై అభ్యంతరాలకు ఈ నెల 11న గడువు ముగిసింది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయడానికి మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని కోరుతూ 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి రైతులు వినతిపత్రాలు అందజేశారు. అయితే మున్సిపల్ తీర్మానంపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామాల ద్వారా కౌన్సిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కాగా విలీన గ్రామాలకు చెందిన బీజేపీ కౌన్సిలర్లు కాసర్ల శ్రీనివాస్, సుతారి రవిలు రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ తరువాత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు చెప్పారు. -
ఏపీ: విలీన గ్రామాల్లోని టీచర్ల బదిలీల షెడ్యూల్
సాక్షి, అమరావతి: మునిసిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 6 నుంచి 21వ తేదీ మధ్య వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు సిద్ధం కావాలన్నారు. గత ఏడాది ఉపాధ్యాయుల సాధారణ బదిలీల సమయంలో మునిసిపాలిటీల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్నందున తమను మునిసిపల్ ఉపాధ్యాయులుగా పరిగణించాలని 400 మందికిపైగా జెడ్పీ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో వీరి బదిలీలు నిలిచిపోయాయి. కోర్టు ఉపాధ్యాయుల కేసులను కొట్టేసి, బదిలీలు చేపట్టాలని పాఠశాల విద్య అధికారులను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరి బదిలీలకు షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ఇలా.. 6వ తేదీ: యాజమన్య, కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఖాళీల ప్రదర్శన 7వ తేదీ: తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రదర్శన 8, 9 తేదీలు: ప్రకటించిన జాబితాలో అభ్యంతరాల అప్లోడ్, ఆధారాలు విద్యాశాఖ అధికారులకు అందజేత 13, 14 తేదీలు: అభ్యంతరాల పరిశీలన, ఆమోదం 15వ తేదీ: తుది సీనియారిటీ జాబితా ప్రకటన 16, 17 తేదీలు: వెబ్ ఆప్షన్ల స్వీకరణ 21వ తేదీ: వెబ్సైట్లో బదిలీ ఆర్డర్ల ప్రదర్శన, డౌన్లోడింగ్. ఇవీ చదవండి: ఏపీ: ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు లక్షా 75 వేల ఆవు దూడ.. వింత చేప..! -
పెరుగనున్న బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ (బుడా) పరిధి పెరగనుంది. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 6 మండలాల్లోని 169 పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బొబ్బిలి అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు విజయనగరం జిల్లాలోని 11 మండలాల్లోని 572 గ్రామాలు ఉన్నాయి. చదవండి: 'వైఎస్ఆర్ చేయూత' రెండో విడత ప్రారంభం కొత్తగా బుడా పరిధిలోకి తెర్లా, బలిజపేట, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి గ్రామాలు, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని 833 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో 3080 చదరపు కిలో మీటర్లు బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెరగనుంది. మొత్తంగా 7.52లక్షల జనాభా పరిధిలో బుడా తన సేవలను ప్రారంభించాల్సి ఉంది. -
విలీన గ్రామాల్లో ఉచితంగా క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్ 10 వరకు పొడిగించింది. సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్‌ను ఈ అంశంపై ప్రజా ప్రతినిధులు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఆ వెంటనే ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
కొత్తగా 28 పురపాలికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పురపాలికల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. 28 కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుతో పాటు ప్రస్తుత పురపాలికల్లో 199 శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉండటం తో కొత్త పురపాలికలు, విలీన గ్రామ పంచాయతీల సంఖ్య పెరగనుంది. సమీపంలోని రెండు, మూడు గ్రామ పంచాయతీలను విలీనం చేసి కొత్త పురపాలిక ఏర్పాటు చేయా లని ప్రతిపాదనలు వచ్చాయి. మొత్తం 52 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా 28 కొత్త పురపాలికలు ఏర్పాటు చేయాలని 15 జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 5 పురపాలికల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. జనాభా 15 వేలు మించితే పురపాలికే 15 వేలకు మించిన జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ప్రస్తుతం ఉన్న పురపాలికలకు చుట్టూ 1 నుంచి 5 కి.మీల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలను కొత్త పురపాలికలుగా ఏర్పాటు చేయాలని లేదా ప్రస్తుతం ఉన్న పురపాలికల్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ లక్షణాలు, స్వభావం కలిగిన గ్రామ పంచాయతీలను గుర్తించి పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు లేదా సమీప పురపాలికల్లో విలీనం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనల తయారీ కోసం ప్రభుత్వం గత నెలలో 9 మంది ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రత్యేకాధికారులు 28 కొత్త పురపాలికల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 73 పురపాలికల్లో 199 శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఆగస్టులో కొత్త పురపాలికల ఏర్పాటు గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం వచ్చే జూలైతో ముగియనుంది. ఆ వెంటనే కొత్త పురపాలికల ఏర్పాటు, పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీల విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ లోపే పూర్తి చేయనుంది. కొత్త పురపాలికల ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీన ప్రతిపాదనలకు తుదిరూపు లభించిన తర్వాత ప్రభుత్వం ఈ కసరత్తు ప్రారంభించనుంది. కొత్త పురపాలికల ఏర్పాటు లేదా పురపాలికల్లో విలీనంపై సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బహిరంగ ప్రకటన జారీ చేయనుంది. అభిప్రాయాలు తెలపడానికి స్థానిక ప్రజలకు 10 రోజుల గడువు లభించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన అనంతరం సంబంధిత గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే ఆయా గ్రామ పంచాయతీలను కొత్త నగర పంచా యతీలు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ, శివారు పురపాలికల్లో విలీనం చేస్తున్నట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సెంచరీ దాటనున్న పురపాలికలు రాష్ట్రంలో జీహెచ్ఎంసీతోపాటు 73 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 28 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, తుది ప్రతిపాదనలు సిద్ధమ య్యే సరికి ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త పురపాలికలను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో పురపాలికల సంఖ్య 100కి మించిపోనుంది. -
'విలీన గ్రామాలు ఏపీలో ఉండాల్సిందే'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారారంటూ ఆయన విమర్శించారు. శనివారం రఘువీరా అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. విలీన గ్రామాలు ఏపీలో ఉండాల్సిందేనని రఘువీరా డిమాండ్ చేశారు.