దక్షిణ భారత అథ్లెటిక్స్ పోటీలకు మేరికుమార్
నరసరావుపేట ఈస్ట్: దక్షిణ భారత అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ఎస్ఎస్ఎన్ కళాశాల ఐబీఏ విద్యార్థి ఎస్ మేరికుమార్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పీఎన్‌వీడీ మహేష్ శుక్రవారం తెలిపారు. అక్టోబర్ 4, 5 తేదీల్లో కరీంనగర్లో జరిగే దక్షిణ భారత అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో జావెలిన్‌త్రో విభాగంలో మేరికుమార్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. విద్యార్థిని కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, కార్యదర్శి నాగసరపు సుబ్బరాయగుప్తా, ఉపాధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ మహేష్, వైస్ ప్రిన్సిపాల్ సోము మల్లయ్య, వ్యాయామ అధ్యాపకుడు వై మధుసూదనరావు తదితరులు అభినందించారు.