అదృశ్యమైన మహిళ దారుణ హత్య
వెల్దండ, న్యూస్‌లైన్ :
సుమారు 40 రోజుల క్రితం అదృశ్యమైన ఓ మహిళ చివరకు ప్రియుడి చేతి లో దారుణ హత్యకు గురైంది. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకా రం... ఆమన గల్లు పట్టణానికి చెందిన తోట లక్ష్మమ్మ (40) స్థానికంగా ఉంటూ వంటల మేస్త్రీగా పనిచేస్తూ జీవనం గడిపేది. భర్త బంగారి స్థానికంగా కూలిపని చేస్తున్నాడు. వీరికి కుమారుడు అల్లాజీ ఉన్నాడు. ఈమెకు ఎనిమిదేళ్లుగా గోపాల్పేట మండలం శిర్కాపల్లికి నాగోజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే గత నెల 9న ఇంటి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకసాగారు. ఎంత కూ ఆచూకీ లభ్యంకాకపోవడంతో అదే నెల 25న పోలీసులకు ఫిర్యాదు చే యడం తో కేసు దర్యాప్తు చేపట్టారు
. అనుమానంతో ప్రియుడిని సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. అదే రోజు లక్ష్మమ్మను తల్లిగారి గ్రామమైన బంగోనిపల్లి సమీపంలోని గుట్ట వద్దకు తీసుకెళ్లి మద్యం తాపి బండరాయితో మోదిచం పేశాడు. ఒంటిపై ఉన్న అర తులం బం గారు కమ్మలు, 30 తు లాల వెండి కడియాలు అపహరిం చినట్టు అం గీకరించాడు. అనంత రం సంఘటన స్థలా న్ని షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణచార్యులు, సీఐ ఫజలుర్హ్రమాన్ పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.