ఎమ్మెల్యేను కలిసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఇంటి నివేశన స్థలాల కేటాయింపు కోసం అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆదివారం స్థానిక ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగా రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని విన్నవించారు. నగరంలో అనేక మంది విలేకరులు నివేశన స్థలాలు లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు.
వీటిలో రాజకీయాలకతీతంగా పనిచేస్తున్న ప్రతి విలేకరికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విలేకరికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలో ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్‌నాయుడు, మార్కండేయులు, నగర కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ ఖాన్, కార్యదర్శి మైనుద్దీన్, ట్రెజరర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.