metal road
-
ఉటా ఎడారిలో మిస్టరీ దిమ్మె!
అమెరికా: ఉటా ఎడారిలో అకస్మాత్తుగా ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి ఊడిపడిందో ఎవరికీ తెలియదు కానీ.. ఇది సుమారు 12 అడుగుల పొడవుందని ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్లు ప్రకటించారు. ఎడారి ప్రాంతంలోని అడవి గొర్రెల సంతతిని లెక్కించేందుకు గత బుధవారం తాము హెలికాప్టర్లో సర్వే నిర్వహించిన ప్పుడు ఉటా నైరుతి దిక్కున ఎర్ర రాళ్ల మధ్య ఈ లోహపు దిమ్మె కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ దిమ్మెను అక్కడికి ఎవరు తెచ్చారో? ఎలా తెచ్చారో తెలియలేదని, అక్కడ పాతిన ఆనవాళ్లూ ఏవీ కనిపించ లేదన్నారు. ఈ దిమ్మె కచ్చితంగా ఎక్కడుందో చెప్పేందుకు కూడా అధికారులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే మనుషులు వెళ్లలేని ప్రాంతంలో అది ఉందని, ఒకవేళ ఎవరైనా వెళ్లినా వాళ్లను రక్షించేందుకు మళ్లీ తామే వెళ్లాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అచ్చం ఆ సినిమాలో ఉన్నట్లే... ఉటా ఎడారిలో గుర్తించిన లోహపు దిమ్మె అచ్చం 1968లో విడుదలైన ‘‘2001: ఎ స్పేస్ ఒడెస్సీ’’ చిత్రంలో గ్రహాంతర వాసులకు చెందినదిగా చూపిన నిర్మాణం మాదిరిగానే ఉండటంతో ఈ వార్తపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఉటా హైవే ఫేస్బుక్ పేజీలో ఈ మిస్టరీ నిర్మాణంపై పలువురు హాస్యాన్ని జోడించి మరీ కామెంట్లు పెట్టారు. మరోవైపు ఈ నిర్మాణంపై అధికారులు స్పందిస్తూ ఇది చట్ట వ్యతిరేకమని, తగిన అనుమతుల్లేకుండా ఇలా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేయడం ఎర్త్ లాను ఉల్లంఘించడమేనని హెచ్చరిస్తున్నారు. ఆ దిమ్మె ఏమిటి? అక్కడకు ఎలా వచ్చిందన్నది ప్రస్తుతానికైతే మిస్టరీనే! స్ప్రే చేస్తే చాలు.. కదులుతాయి! శరీరం లోపలి భాగాలకు నేరుగా మందులు అందించేందుకు హాంకాంగ్ సిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత పదార్థపు స్ప్రేతో ఏ వస్తువునైనా మిల్లీ రోబోగా మార్చేయగలగడం ఇందులోని కీలక అంశం. పాలివినైల్ ఆల్క హాల్, గ్లుటెన్, ఇనుప రజనుతో తయారైన ఈ స్ప్రే చేసిన వస్తువును శరీరంలో కావాల్సిన చోటికి నడిపించవచ్చు లేదా దొర్లేలా చేయవచ్చు. పాక్కుంటూ కూడా వెళ్లగలదు. కేవలం మిల్లీమీటర్లో నాలుగో వంతు మందం ఉండే ఈ స్ప్రేను మాత్రలపై ఉప యోగించడం ద్వారా మందులను నేరుగా శరీర భాగాలకు ఇవ్వాలన్నది తమ ఆలోచన అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ షెన్ యాజింగ్ తెలిపారు. ఎం–స్ప్రే అని పిలిచే ఈ కొత్త పదార్థం శరీరంలోకి ప్రవేశించిన తరువాత అవసరమైన సమయంలో తనంతట తానే నాశనమై వ్యర్థంగా బయటకు వచ్చేస్తుంది. గమనాన్నీ నియంత్రించొచ్చు.. అంతేకాదు.. ఎం–స్ప్రే కోటింగ్ ఉన్న వస్తువు ఏ రకంగా ప్రయాణించాలో నిర్ణయించవచ్చని, అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కోటింగ్‌పై కణాల అమరికను మార్చడం ద్వారా ఇది సాధ్యమని యాజింగ్ వివరిస్తున్నారు. కొన్ని మాత్రలకు తాము ఈ కోటింగ్ ఇచ్చి ఎలుకలపై ప్రయోగించామని, ఆ తరువాత ఇవి ఎలుకల శరీరంలో ఎలా ప్రయాణించాయో స్పష్టంగా గమనించగలిగామని, కావాల్సిన ప్రాంతానికి చేరుకోగానే కోటింగ్ కరిగిపోయి మందు మాత్రమే విడుదలైందని చెప్పారు. ఈ స్ప్రేను వైద్య రంగంలో ఉపయోగించడమే కాకుండా మిల్లీ రోబోల తయారీ ద్వారా కదిలే సెన్సర్లుగానూ వాడుకోవచ్చునని యాజింగ్ అంటున్నారు. గుండెజబ్బుల చికిత్స కోసం శరీరంలోకి చొప్పించే క్యాథిటర్ను కూడా ఈ కోటింగ్ ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. -
పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలి
కలెక్టర్ జి.కిషన్ నారాయణపురంలో మినీ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ హాజరైన మానుకోట ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికార ప్రతినిధి నారాయణపురం(నెల్లికుదురు) : పన్నులు సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ ప్రజలకు సూచించారు. మండలంలోని తుల్చాతండా, నారాయణపురం గ్రామాల్లో అంగన్వాడీ భవనాల ప్రారంభం, నారాయణపురంలో మినీ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ, ఆలేరు నుంచి కల్వల వరకు మెటల్ రోడ్డు పనులకు, వెంకటి తండాకు సీసీ రోడ్డు, బోడకుంట తండా పాఠశాల భవన నిర్మాణానికి శుక్రవా రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలను కలెక్టర్‌తోపాటు ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్, ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, సర్పంచ్ డాక్టర్ ఊకంటి యాకూబ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పం చాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన గాంధీజీ సూక్తులను నిజం చేయాలం టే గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలన్నారు. చెప్పిన వారం రోజులకే 320 సమస్యలను తన ముందుంచిన సర్పంచ్‌ను అభినందించారు. ఇలాంటి సర్పంచ్‌లకు సహకరించాలన్నారు. నారాయణపురం గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్ధేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తప్పనిసరిగా పన్నులు చెల్లిస్తామని గ్రామస్తులతో వాగ్దానం చేయించారు. తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎవరూ చేయని విధంగా అమరవీరుల కీర్తి స్థూపాన్ని ఆవిష్కరించి తెలంగాణ పట్ల తన ప్రేమను చాటుకున్న ఏకైక కలెక్టర్ కిషన్ అని కొనియాడారు. ప్రజాసమస్యలు స్వయంగా తెలుసుకునేందకు గ్రామదర్శిని పేరుతో పుస్తకం రూపొందించి అందుబాటులోకి తెచ్చారని, ఈ పుస్తకాన్ని ప్రజాప్రతినిధులు అధ్యయనం చేసి ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి తోడ్పడుతుం దని అన్నారు. పార్లమెంట్లోఉన్న టీఆర్ఎస్ ఎంపీల సహకారంతో దశలవారీగా బంగారు తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్‌ను అన్నివిధాల అభివృద్ధి చేయడానికే ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నియోజకవర్గంలోని దళిత గిరిజన కాలనీలో మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు అన్నారపు యాకయ్య, ఆర్డీఓ మధుసూదన్‌నాయక్, సీడీపీఓ నిర్మలాదేవి, ఎంపీడీఓ కె.కర్ణాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు వి.స్వామి, రాజ్‌కుమార్, ఏఓ నెలకుర్తి రవీదంర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సదాశివరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్, డీటి మల్లయ్య, కార్యదర్శి సోంద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
రెడీ మిక్స్, 60 ఎంఎం కంకరతో సీసీల నిర్మాణం..ఒక కాలనీలో నిర్మించాల్సిన రోడ్లను మరో కాలనీలో.. కంకరపరచి వదిలేస్తున్న మెటల్ రోడ్లు.. వెరసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వం మంజూరు చేస్తున్న కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి. తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ, మెడల్, బీటీల నిర్మాణాలు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి ఎస్ఎల్బీసీ ఆయకట్టు పరిధి గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాలువల వరకు రహదారి సౌకర్యార్థం మెటల్, బీటీ రోడ్ల నిర్మాణాలకు ఏడాది క్రితం ప్రభుత్వం *10 కోట్లను విడుదల చేసింది. దీంతో మండలంలోని ఇందుగు ల, సర్వారం, ఇండ్లూరు, గడ్డికొండారం, ఎర్రగడ్డలగూడెం, ఖాజీరామారం, తానేదార్పల్లి, కంకణాలపల్లి, పెద్దసూరారం, చిన్నసూరారం, పజ్జూరు గ్రామాల్లో అభి వృద్ధి పనులు చేపడుతున్నారు. ఒక చోట వేయాల్సిన రోడ్డు మరోచోట.. మండలంలోని ఎర్రగడ్డలగూడెం, ఖాజీరామారం, గ్రామాల్లో ఎస్సీ కాలనీలో వేయాల్సిన సీసీరోడ్లు, మరో కాలనీలో వేస్తున్నారు. ఆ నిధులు కేవలం ఎస్సీ కాలనీల అభివృద్ధి కోసమే వినియోగించాల్సి ఉండగా అధికారులు, కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా ఆ రోడ్లను మరోచోట వేస్తున్నారు. ఎర్రగడ్డలగూడెంలో గ్రామం నుంచి కాల్వను కలుపుతూ వెళ్లే రోడ్లు ఎస్సీ కాలనీ నుంచి డి-40 కాల్వ వరకు వేయాలని రైతులంతా కోరుతున్నా అవేమి పట్టించుకో వడం లేదు. ఎర్రగడ్లగూడెం గ్రామం నుంచి లక్ష్మిపురం వెళ్లే రోడ్డునే నిర్మిస్తున్నారు. ఇలా పలు గ్రామాల్లో ఓ చోట చేపట్టాల్సిన పనులను మరో చోట చేస్తుండడంతో ఆయా గ్రామా ల ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అసంపూర్తి పనులతో అవస్థలు... పెద్ద సూరారం, ఎర్రగడ్డలగూడెం గ్రామా ల్లో అసంపూర్తిగా రోడ్డు పనులను వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నకిరేకల్ అడ్డరోడ్డు నుంచి గ్రామం వరకు మెటల్‌రోడ్డు వేసి వదిలేయగా కంకర తేలి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అలాగే ఎర్రగడ్డలగూడెం గ్రామం నుంచి లక్ష్మీపురం వెళ్లే దారికూడా వేసిన వారం రోజులకే కంకర తేలింది. దీంతో పెద్ద సూరారంలో సీసీరోడ్లు వేసి పక్కన మట్టివేయకుండా వదిలేశారు. అధికారులకు పలుమార్లు చెప్పినా రేపుమాపు అంటూ సమాధానం దాటవేస్తున్నారే తప్ప సమస్య పరిష్కరించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.