- కలెక్టర్ జి.కిషన్ నారాయణపురంలో
- మినీ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ
- హాజరైన మానుకోట ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికార ప్రతినిధి
నారాయణపురం(నెల్లికుదురు) : పన్నులు సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ ప్రజలకు సూచించారు. మండలంలోని తుల్చాతండా, నారాయణపురం గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాల ప్రారంభం, నారాయణపురంలో మినీ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ, ఆలేరు నుంచి కల్వల వరకు మెటల్ రోడ్డు పనులకు, వెంకటి తండాకు సీసీ రోడ్డు, బోడకుంట తండా పాఠశాల భవన నిర్మాణానికి శుక్రవా రం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాలను కలెక్టర్‌తోపాటు ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్, ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, సర్పంచ్ డాక్టర్ ఊకంటి యాకూబ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పం చాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన గాంధీజీ సూక్తులను నిజం చేయాలం టే గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలన్నారు. చెప్పిన వారం రోజులకే 320 సమస్యలను తన ముందుంచిన సర్పంచ్‌ను అభినందించారు.
ఇలాంటి సర్పంచ్‌లకు సహకరించాలన్నారు. నారాయణపురం గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్ధేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తప్పనిసరిగా పన్నులు చెల్లిస్తామని గ్రామస్తులతో వాగ్దానం చేయించారు. తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎవరూ చేయని విధంగా అమరవీరుల కీర్తి స్థూపాన్ని ఆవిష్కరించి తెలంగాణ పట్ల తన ప్రేమను చాటుకున్న ఏకైక కలెక్టర్ కిషన్ అని కొనియాడారు.
ప్రజాసమస్యలు స్వయంగా తెలుసుకునేందకు గ్రామదర్శిని పేరుతో పుస్తకం రూపొందించి అందుబాటులోకి తెచ్చారని, ఈ పుస్తకాన్ని ప్రజాప్రతినిధులు అధ్యయనం చేసి ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి తోడ్పడుతుం దని అన్నారు. పార్లమెంట్‌లోఉన్న టీఆర్‌ఎస్ ఎంపీల సహకారంతో దశలవారీగా బంగారు తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్‌ను అన్నివిధాల అభివృద్ధి చేయడానికే ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చామని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నియోజకవర్గంలోని దళిత గిరిజన కాలనీలో మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు అన్నారపు యాకయ్య, ఆర్డీఓ మధుసూదన్‌నాయక్, సీడీపీఓ నిర్మలాదేవి, ఎంపీడీఓ కె.కర్ణాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు వి.స్వామి, రాజ్‌కుమార్, ఏఓ నెలకుర్తి రవీదంర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సదాశివరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్, డీటి మల్లయ్య, కార్యదర్శి సోంద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.