model development
-
PM Narendra Modi: ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్
వారణాసి: భారత్ వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనా(మోడల్)గా మారడం ఖాయమని, ఇది ‘మోదీ గ్యారంటీ’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయన గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ‘సంసద్ సంస్కృత్ ప్రతియోగితా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వారసత్వం, అభివృద్ధికి కాశీ నగరం ఒక మోడల్‌గా కనిపిస్తోందని, సంస్కృతి, సంప్రదాయం చుట్టూ ఆధునిక అభివృద్ధిని ప్రపంచం వీక్షిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మన దేశం అభివృద్ధికి మోడల్‌గా మారుతుందని చెప్పారు. భారతీయ సుసంపన్న ప్రాచీన వారసత్వం గురించి ప్రపంచమంతటా చర్చించుకుంటున్నారని తెలిపారు. కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగితా, కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగితా, కాశీ సంసద్ సంస్కృత్ ప్రతియోగితా అవార్డులను నరేంద్ర మోదీ విజేతలకు అందజేశారు. అనంతరం రూ.13,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత పదేళ్లుగా ఇక్కడి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని, వారణాసి తనను బనారసిగా మార్చిందని అన్నారు. వారణాసి యువతను కొందరు కాంగ్రెస్ నేతలు నషేరీ(మత్తులో మునిగిపోయినవారు) అని దూషిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాం«దీపై మోదీ మండిపడ్డారు. నిజంగా స్పృహలో ఉన్నవారు అలా మాట్లాడరని చెప్పారు. గత 20 ఏళ్ల పాటు తనను తిట్టారని, ఇప్పుడు యువతపై ఆక్రోశం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య, కాశీని అభివృద్ధి చేయడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు వారు ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వారణాసి రోడ్లపై నడుస్తూ తనిఖీ చేశారు. ప్రజలను విపక్షాలు కులాల పేరిట రెచ్చగొడుతున్నాయ్ విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. విపక్షాలు కులాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయని, గొడవలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు ఉన్నత పదవులు చేపడితే విపక్ష నాయకులు సహించలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తాము పోటీకి దింపితే ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వలేదని, ఆమెను ఓడించేందుకు ప్రయతి్నంచాయని గుర్తుచేశారు. దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకొచి్చన పథకాలను విపక్షాలు వ్యతిరేకించాయని చెప్పారు. వారణాసిలో శుక్రవారం సంత్ రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో మోదీ మాట్లాడారు. ప్రతి శకంలో యోగులు ప్రజలకు దారి చూపారని, తప్పుడు మార్గంలో నడవకుండా అప్రమత్తం చేశారని చెప్పారు. కులం పేరిట ఎవరైనా వివక్ష చూపితే అది మానవత్వంపై చేసిన దాడి అవుతుందని పేర్కొన్నారు. -
పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలి
కలెక్టర్ జి.కిషన్ నారాయణపురంలో మినీ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ హాజరైన మానుకోట ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికార ప్రతినిధి నారాయణపురం(నెల్లికుదురు) : పన్నులు సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ ప్రజలకు సూచించారు. మండలంలోని తుల్చాతండా, నారాయణపురం గ్రామాల్లో అంగన్వాడీ భవనాల ప్రారంభం, నారాయణపురంలో మినీ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ, ఆలేరు నుంచి కల్వల వరకు మెటల్ రోడ్డు పనులకు, వెంకటి తండాకు సీసీ రోడ్డు, బోడకుంట తండా పాఠశాల భవన నిర్మాణానికి శుక్రవా రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలను కలెక్టర్‌తోపాటు ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్, ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, సర్పంచ్ డాక్టర్ ఊకంటి యాకూబ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పం చాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన గాంధీజీ సూక్తులను నిజం చేయాలం టే గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలన్నారు. చెప్పిన వారం రోజులకే 320 సమస్యలను తన ముందుంచిన సర్పంచ్‌ను అభినందించారు. ఇలాంటి సర్పంచ్‌లకు సహకరించాలన్నారు. నారాయణపురం గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్ధేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తప్పనిసరిగా పన్నులు చెల్లిస్తామని గ్రామస్తులతో వాగ్దానం చేయించారు. తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎవరూ చేయని విధంగా అమరవీరుల కీర్తి స్థూపాన్ని ఆవిష్కరించి తెలంగాణ పట్ల తన ప్రేమను చాటుకున్న ఏకైక కలెక్టర్ కిషన్ అని కొనియాడారు. ప్రజాసమస్యలు స్వయంగా తెలుసుకునేందకు గ్రామదర్శిని పేరుతో పుస్తకం రూపొందించి అందుబాటులోకి తెచ్చారని, ఈ పుస్తకాన్ని ప్రజాప్రతినిధులు అధ్యయనం చేసి ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి తోడ్పడుతుం దని అన్నారు. పార్లమెంట్లోఉన్న టీఆర్ఎస్ ఎంపీల సహకారంతో దశలవారీగా బంగారు తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్‌ను అన్నివిధాల అభివృద్ధి చేయడానికే ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నియోజకవర్గంలోని దళిత గిరిజన కాలనీలో మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు అన్నారపు యాకయ్య, ఆర్డీఓ మధుసూదన్‌నాయక్, సీడీపీఓ నిర్మలాదేవి, ఎంపీడీఓ కె.కర్ణాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు వి.స్వామి, రాజ్‌కుమార్, ఏఓ నెలకుర్తి రవీదంర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సదాశివరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్, డీటి మల్లయ్య, కార్యదర్శి సోంద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.