metorological department
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుఫాను సూచన
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకుని అల్పపీడనం కేంద్రీకృతమైవుంది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 6 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 36 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతానికి అనుకుని వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. వాయుగుండం వాయువ్య దిశగా తమిళనాడు వైపు పయనిస్తూ ఈ నెల 28 నాటికి తూఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 30న తుఫాను ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ అల్ప పీడనద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం హైదారాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖమ్మం, రంగారెడ్డి, తూర్పు -
దేశ వ్యాప్తంగా వర్షపాతం 6 శాతం మాత్రమే
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 6 శాతం వర్షపాతం నమోదైందని, ఆగస్టు నెలలో 10 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు నర్సింహా రావు చెప్పారు. తెలంగాణలో సాధారణం కంటే 26 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని తెలిపారు. తెలంగాణ 10 జిల్లాలకు గానూ 7 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉందన్నారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 11 శాతం ఎక్కువ వర్షపాతమున్నా, నెల్లూరు జిల్లాలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైందని, మిగతా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసిందిని తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 12 శాతం తక్కువ వర్షపాతం ఉంటుందని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం ఏర్పడితేనే రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు నర్సింహా రావు వివరించారు.