Metro Police Conference
-
కష్టమే!
మేయర్ ప్రకటనపై ప్రజల్లో ఆశలు ఒప్పుకోని నిబంధనలు ఆస్తి పన్ను రద్దుపై మల్లగుల్లాలు చట్ట సవరణ చేయాలంటున్న నిపుణులు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లకు రూ.4 వేల లోపు ఆస్తిపన్ను రద్దుకు స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది అమల్లోకి వస్తే 1200 చ.అడుగుల ఇళ్లున్న వారు సైతం ఆస్తిపన్ను చెల్లించాల్సిన పని ఉండదు. ఈ లెక్కన పలువురు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ వంటి వారు సైతం ఆస్తిపన్ను చెల్లించాల్సిన పని ఉండకపోవచ్చు.ఇక్కడే సమస్య ఎదురవుతోంది. ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అడ్డుగా నిబంధనలు జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనలను పరిశీలిస్తే...మేయర్ ప్రకటించినట్లుగా చేయాలంటే యాన్యువల్ రెంటల్ వేల్యూ దాదాపు రూ.7500 వరకు ఉన్న నివాస భవనాలకు ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుందని అధికారి ఒకరు చెప్పారు. దీన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. మినహాయింపునకు అవకాశం కల్పించినప్పటికీ.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం స్థానిక సంస్థకు (జీహెచ్ఎంసీకి) గ్రాంట్‌గా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది కూడా యజమానులు నివసిస్తున్న ఇళ్లకే వర్తిస్తుంది. అద్దెకిచ్చే ఇళ్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవని చెప్పారు. రావాల్సిన వాటాలే లేవు జీహెచ్ఎంసీకి వివిధ పథకాలు.. ప్రాజెక్టులకే ఎంతోకాలంగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. వృత్తి పన్ను, మోటారు వాహన పన్ను వాటా, ఆక్ట్రాయ్ పన్నుల్లోనూ అరకొరగానే విదిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ గ్రాంట్‌గా ఏటా దాదాపు రూ.400-500 కోట్లు ఇవ్వడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. పన్ను మినహాయింపుతో జీహెచ్ఎంసీకి దాదాపు రూ. వందకోట్ల ఆదాయమే తగ్గుతుందని... ఇతరత్రా పన్నులు... పటిష్ట చర్యలతో లోటును పూడ్చుకుంటామని మేయర్ మాజిద్ అంటున్నారు. అయితే రూ.4వేల లోపు ఆస్తిపన్ను ఉన్న ఇళ్ల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు రూ.500 కోట్లు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసినట్లు లేదని చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఆస్తిపన్ను కట్టాల్సిన పని లేదని భావిస్తున్న నగర ప్రజల ఆశ ఫలించేలా కనిపించడం లేదు. వసూళ్లపై దెబ్బ: జీహెచ్ఎంసీలో గత ఆర్థిక సంవత్సరం రూ.1000 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరం దాన్ని రూ.1500 కోట్లకు పెంచడం...టౌన్‌ప్లానింగ్ ఫీజులు, ట్రేడ్ లెసైన్సుల ఫీజులు పూర్తి స్థాయిలో వసూలు చేయాలనేది కమిషనర్ సోమేశ్‌కుమార్ లక్ష్యం. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరం వసూళ్ల టార్గెట్ దాదాపు రూ.5000 కోట్లు. ఇప్పటి వరకు రూ.దాదాపు రూ.450 కోట్లు ఆస్తిపన్ను వసూలై ంది. మేయర్ ప్రకటనతో ఆస్తిపన్ను వసూళ్లు తగ్గే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ వర్గాల అంచనా. స్మార్ట్‌గా వసూళ్లు.. ఇటీవల ముగిసిన మెట్రో పొలిస్ సదస్సులో ఆయా నగరాలు అనుసరిస్తున్న తీరు ఇచ్చిన స్ఫూర్తితో.. కాగిత రహిత పాలన (ఈ-ఆఫీస్) చేయాలనుకున్న జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లలోనూ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. బిల్ కలెక్టర్లు, తదితరులకు టాబ్లెట్ పీసీలు ఇస్తున్నారు. భవనం ఫొటోనూ ఆన్లైన్లో పొందుపరచనున్నారు. తద్వారా కార్యాలయాల్లోని ఉన్నతాధికారులకు సైతం ఏరోజు .. ఎవరు.. ఎక్కడ వసూలు చేశారనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. సమయంతో సహా టాబ్లెట్‌లో నమోదు కానుండటంతో పని దొంగలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఎగ్గొడితే అంతే... మరోవైపు పని చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇప్పటికే హెచ్చరించారు. ఏ భవనం నుంచైనా ఆస్తిపన్ను వసూలు కాని పక్షంలో.. తద్వారా జీహెచ్ఎంసీకి కలిగే నష్టం మొత్తాన్ని సంబంధిత ఉద్యోగి నుంచే వసూలు చేయవచ్చని చట్టంలో ఉంది. పని చేయని వారిపై ఈ చట్టాన్ని ప్రయోగిస్తామని కమిషనర్ హెచ్చరించారు. లేని పక్షంలో విధుల నుంచి తప్పుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. లక్ష్యాల్లో కేవలం 2 శాతమే చేసిన పలువురిని శుక్రవారం తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. కొందరు బిల్కలెక్టర్లనూ సస్పెం డ్ చేశారు. మరోవైపు బాగా పనిచేసేవారికి ప్రోత్సాహకాలనూ రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా వివిధ పద్ధతుల ద్వారా రూ. 5వేల కోట్లు ఆదాయం తేవాలనేది లక్ష్యం కాగా.. ఆస్తిపన్ను మినహాయింపు ప్రకటనతో దానికి గండి పడిందని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ ఊరుకున్నారేం... కొద్దిరోజుల్లో పాలకమండలి గడువు ముగుస్తోంది. ఈ సమయంలో చేసిన ఈ ప్రకటనను కనీసం ఆర్నెళ్లముందో.. లేక ఏడాది ముందో ఎందుకు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మేయర్ ప్రకటన వెనుక ఇతరత్రా కారణాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మురికివాడల్లో పరిస్థితులు మెరుగుపడాలి
సదస్సులో వక్తల మనోగతం సాక్షి, సిటీబ్యూరో: నగరాల్లోని మురికి వాడల్లో పరిస్థితులను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పలువురు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మెట్రో పోలిస్ సదస్సులో భాగంగా బుధవారం ‘అర్బన్ పూర్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ’ అనే అంశంపై చర్చ జరిగింది. ఇందులో యూఎస్ఎఫ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మ్యాగీ కాజల్, నిదాన్ అండ్ నాస్వి వ్యవస్థాపకులు అర్బింద్ సింగ్, చింతన్ డెరైక్టర్ భారతి చతుర్వేది, ప్రముఖ ఆర్కిటెక్ట్ కీర్తిషా, ఏపీఐఐసీ ఎండీ జయేశ్‌రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ప్రసంగించారు. పలువురు మాట్లాడుతూ మురికి వాడల్లో కాలుష్యం పెరిగిపోవడంతో అనారోగ్యకర వాతావరణం నెలకొంటుందని, వర్షం వస్తే ఆ కాలనీలు నీట మునిగిపోతున్నాయన్నారు. ఇళ్లు నిర్మించి ఇచ్చినంత మాత్రానో... మరో సదుపాయం కల్పించినంతమాత్రానో వారి పరిస్థితులు మారవన్నారు. సమాజంలో ఉండే మిగతా వారిలా పేదలకు కూడా తగిన సదుపాయాలను అందుబాటులో తేవాలని వక్తలు సూచించారు. ముఖ్యంగా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, సాంఘిక న్యాయం, సమానత్వం కూడా ఉన్నప్పుడే మురికి వాడలు ఉండవన్నారు. ఎందరో పేదలు ఫుట్‌పాత్‌లపైనే జీవనాన్ని సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌కత్తాలో 25 ఏళ్లగా ఫుట్‌పాత్‌లపైనే జీవితాలు వెళ్లదీస్తున్న మహిళలెందరో ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులు మారేందుకు ప్రభుత్వాలు, సంస్థలు తగిన కృషి చేయాల్సి ఉందని సూచించారు. పేదల కోసం అనేక కార్యక్రమాలు: కమిషనర్ హైదరాబాద్ నగరంలోని పేదల కోసం తాము వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. మురికి వాడల ప్రజలు క లుషిత జలాల వల్ల పలు వ్యాధుల బారిన పడుతుండటాన్ని గుర్తించినట్టు చెప్పారు. ఇందుకోసం మంచి నీటిని అందించేందుకు 150 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ద్వారా 600 మందికి కూడా ఉపాధి అవకాశాలుంటాయన్నారు. అంతేగాక డ్రైవర్ కమ్ ఓనర్, ఈవ్యాన్, నైట్‌షెల్టర్లు, రూ.5లకే భోజనం వంటి కార్యక్రమాలను ఆయన వివరించారు. -
తెలంగాణ చిత్రం
తెలంగాణ కుంచె అద్భుతాలకు తారామతి బారాదరి కాన్వాస్‌గా మారింది. తెలంగాణ గడ్డపై పుట్టిన చిత్రకారులు రంగుల లోకాన్ని సృష్టించారు. జీవం ఉట్టిపడే చిత్రరాజాలను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబాలను కళ్లముందుంచారు. నూనూగు మీసాల యువకుల నుంచి ఎనిమిదిపదుల పెద్దల వరకూ తమ ప్రతిభను చాటారు. ఆర్ట్ ఎట్ తెలంగాణ పేరిట శనివారం జరిగిన తెలంగాణకు చెందిన 90 మంది చిత్రకారులు తరలివచ్చారు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ చిత్రాల పండుగ జరగనుంది. ఈ నెల 30 వరకు మొదటి బ్యాచ్‌కు చెందిన 50 మంది కళాకారులు, అక్టోబర్ 1 నుంచి 6 వరకు మిగతా 40 మంది కళాకారులు చిత్రాలు వేయనున్నారు. తర్వాత ఈ చిత్రాలను నగరంలో జరగనున్న మెట్రోపోలీస్ సదస్సులో ప్రదర్శించనున్నారు. లక్ష్మణ్ ఏలే, లకా్ష్మగౌడ్, వైకుంఠం, అంజనీరెడ్డి, కవిత, ఎమ్మెస్ దాతార్ల తదితర చిత్రకళాకారులు ఇందులో పాల్గొన్నారు. ఔత్సాహికులకు మంచి వేదిక ఇటువంటి కార్యక్రమాలు ఔత్సాహిక చిత్ర కళాకారులకు మంచి వేదిక అన్నారు ఏలె లక్ష్మణ్. సీనియర్ ఆర్టిస్టులతో ముఖాముఖితో పాటు వారి సలహాలు తీసుకోవచ్చు. అంతే కాకుండా చిత్రం గీసే సమయంలో వారిని గమనించే అవకాశం లభిస్తుందంటున్నారాయన. గోల్కొండ