Mexico wall
-
అధ్యక్షుడిగా బైడెన్ తొలి సంతకం.. కీలక నిర్ణయాలు
వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్వేతసౌధంలోకి వెళ్లిన జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు జో బైడెన్ అధ్యక్షుడి హోదాలో సంతకం చేశారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాలపై బైడెన్ ఎన్నికల్లో చెప్పినట్టు వాటిని వెనక్కి తీసుకున్నారు. ఈ విధంగా 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై బైడెన్ సంతకాలు చేశారు. బైడెన్ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనవి ఇవే.. (చదవండి : చరిత్ర సృష్టించిన జో బైడెన్) బైడెన్ తొలి నిర్ణయం కరోనా నుంచి ప్రజలను బయటపడడమే. అందులో భాగంగా కోవిడ్-19 రెస్పాన్స్ కో ఆర్డినేటర్ పదవిని సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వంద రోజుల పాటు మాస్క్లు, భౌతిక దూరం పాటించాలని బైడెన్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వైదొలగడాన్ని విరమించుకున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అమెరికా- పారిస్ వాతావరణ ఒప్పందంలో బైడెన్ నిర్ణయంతో అమెరికా మళ్లీ చేరింది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. మెక్సికో గోడ నిర్మాణంపై బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణానికి నిధుల సమీకరణకు తీసుకొచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ను నిలిపివేశారు. గ్రీన్ కార్డు జారీలో దేశాలకు పరిమితిని బైడెన్ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో భారతదేశంతో పాటు ఎన్నో దేశాల వారికి ఉపశమనం కలగనుంది. అమెరికా వీసాల జారీలో ఆంక్షలను క్రమేణ ఎత్తివేసేలా బైడెన్ వ్యూహం ఉంది. అమెరికా అభివృద్ధిలో కీలకంగా ఉన్న వలసదారులకు శాశ్వత పౌరసత్వం, నివాసం కల్పిస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. వీటితో జాతి వివక్ష, ముస్లిం దేశాల రాకపోకలపై నిర్ణయాలు ఉన్నాయి. మొత్తానికి బైడెన్ గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. అమెరికా ప్రజలకు మేలు చేస్తూనే ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకునేలా బైడెన్ తీరు కనిపిస్తోంది. -
అమెరికా షట్డౌన్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించింది (షట్డౌన్). అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30) కొన్ని అత్యవసర, కీలక విభాగాలు తప్పించి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అమెరికాలో ఇలా జరగడం ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండానే, అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ అడిగిన 500 కోట్ల డాలర్ల డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే శుక్రవారం కాంగ్రెస్ వాయిదా పడింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు సకాలంలో కాంగ్రెస్ అమోదం పొందకపోయినా, అధ్యక్షుడు సంతకం చేయకపోయినా పాలన స్తంభిస్తుంది. పాలన నిలిచిపోకుండా చూసేందుకు చివరి నిమిషం వరకు కాంగ్రెస్ నేతలు, శ్వేతసౌధం అధికారుల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రభుత్వానికి చెందిన కొన్ని కీలక భద్రతా సంస్థలు, అత్యవసర సేవల సంస్థలు మాత్రమే ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నా యి. అమెరికా రక్షణ మంత్రి పదవికి జిమ్ మ్యాటిస్ రాజీనామా చేసిన మరుసటి రోజునే పాలన స్తంభించడంతో అమెరికాలో కల్లోలిత వాతావరణం నెలకొంది. షట్డౌన్ కారణంగా 8 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి వేత నం లేని సెలవులు లభించనుండగా, మరికొందరు జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఈసారి ఎక్కువ కాలం.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించేంత వరకు అమెరికాలో షట్డౌన్ కొనసాగుతుంది. ఈ సారి షట్డౌన్ ఎక్కువ కాలం కొనసాగుతుందనీ, దానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అధికారం చేపట్టాకా షట్డౌన్ అమలు కావడం ఇది మూడో సారి. ఈ ఏడాది జనవరి, జూన్ నెలలలో కూడా కొన్ని రోజుల పాటు పాలన స్తంభించింది. షట్డౌన్ కాలంలో చాలా మంది ఉద్యోగులకు సెలవులు ఇస్తారు. అత్యవసర విభాగాల సిబ్బంది యథావిధిగా పని చేస్తారు. ఈ కాలంలో సామాజిక తనిఖీ విభాగం, వైద్యశాఖ, తపాలా విభాగాలపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. అవన్నీ యథా ప్రకారం పని చేస్తాయి. ఎఫ్బీఐ, సరిహద్దు గస్తీ, తీరరక్షణ, ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, ఆహార తనిఖీ, హోంలాండ్ సెక్యూరిటీ విభాగం వంటి అత్యవసర విభాగాలు కూడా మామూలుగానే పని చేస్తాయి. షట్డౌన్ కాలంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మ్యూజియంలు, ఉద్యానవనాలు, షాపింగ్ మాల్స్ మూతపడతాయి. సెనెట్ అప్రాప్రియేషన్ కమిటీలోని డెమోక్రాట్ల నివేదిక ప్రకారం 4,20,000 మంది ఈ షట్డౌన్లో జీతం లేకుండా పని చేస్తారు. షట్డౌన్లు కొత్త కాదు అమెరికాకు షట్డౌన్లు కొత్త కాదు. దాదాపు ప్రతి సంవత్సరం జనవరిలో కొన్ని రోజుల పాటు పాలన స్తంభిస్తుంటుంది. దైనందిన ప్రభుత్వ వ్యవహారాలకు అవసరమైన నిధులను ఖర్చు చేయడానికి ద్రవ్యవినిమయ బిల్లును జనవరిలో కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం సకాలంలో లభించకపోతే షట్డౌన్ అవుతుంది. జిమ్మి కార్టర్ హయాంలో ప్రతి ఏడూ సరాసరి 11 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి నెలకొంది. రోనాల్డ్ రీగన్ రెండు దఫాల పాలనలో ఆరు షట్డౌన్లను అమెరికా చూసింది. 2013లో ఏకంగా 16 రోజుల పాటు ప్రభుత్వ పాలన స్తంభించిపోయింది. ఈ ఏడాది జనవరిలో మూడు రోజుల పాటు, జూన్లో కొన్ని గంటలపాటు షట్డౌన్ అయ్యింది. అయితే ఒకే సంవత్సరంలో మూడు సార్లు షట్డౌన్ కావడం మాత్రం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. -
ట్రంప్ డ్రీమ్ నెరవేరుతుందా..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కల నెరవేరనున్నట్లు తెలుస్తోంది. మెక్సికోతో తమ దేశానికి ఉన్న సరిహద్దు గుండా నిర్మించాలనుకుంటున్న భారీ ప్రహరీ నిర్మాణం ప్రక్రియ మొదలుకానుంది. అందుకోసం కావాల్సిన డబ్బుకు సంబంధించిన బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ప్రాధాన్యత అంశాల్లో ఈ మెక్సికో గోడనే ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, దీని నిర్మాణం కోసం మెక్సికో కూడా ఖర్చు భరించాల్సి ఉంటుందని అమెరికా చెప్పగా మెక్సికో నిరాకరించింది. దీంతో తామే ఈ నిర్మాణం పూర్తి చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. మొత్తం 827 బిలియన్ల ప్యాకేజీకి సంబంధించిన బిల్లును గురువారం సభలో ప్రవేశపెట్టగా 235మంది ప్రతినిధులు ఉన్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో 192మంది ఆమోదించారు. దీంతో ఇందులోని 1.6 బిలియన్ డాలర్లను ప్రత్యేకంగా గోడ నిర్మాణానికే ఖర్చు చేయనున్నారు. అక్రమ వలసలను, మాదక ద్రవ్యాలు అమెరికాలోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ ప్రహరీ నిర్మాణం చేయనున్నారు. అయితే, ఈ బిల్లు సెనేట్లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. సెనేట్లో డెమొక్రాట్లు అధికంగా ఉన్నారు. ఇది చట్ట రూపం దాల్చేందుకు ముందు సెనేట్లు కూడా ఈ బిల్లును ఆమోదించనుంది.